డిజాస్టర్ దిశగా టాలీవుడ్ సమ్మర్?

ఇక మిగిలింది హిట్-3, కింగ్ డమ్ సినిమాలు మాత్రమే.

సరిగ్గా ఏడాది కిందటి సంగతి. సమ్మర్ లో వస్తాయనుకున్న సినిమాలేవీ రాలేదు, ఎప్పట్లానే వాయిదాలు పడ్డాయి. దీంతో ఏప్రిల్ నెల బోసిపోయింది.

ఆశ్చర్యంగా ఈ ఏడాది ఏప్రిల్ నెల కూడా అలానే తయారైంది. వస్తాయనుకున్న సినిమాలు రాలేదు. వచ్చిన సినిమాలు ఆడలేదు.

గతేడాది మార్చి నెల చివర్లో వచ్చిన టిల్లూ స్క్వేర్, జూన్ చివర్లో వచ్చిన కల్కి మినహా మధ్యలో మరో సినిమా లేదు. దీంతో సమ్మర్ వృధా అయింది. ఇప్పుడు 2025 సమ్మర్ కూడా అలా మరోసారి వేస్ట్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయిు.

ఈ ఏడాది మార్చి ఎండింగ్ లో మ్యాడ్ స్క్వేర్ వచ్చింది. అంతకంటే ముందు కోర్ట్ సినిమా వచ్చింది. కమర్షియల్ గా చెప్పుకుంటే రెండూ బ్లాక్ బస్టర్స్ కావు. ఏప్రిల్ సినిమాల సంగతి సరేసరి.

జాక్, గుడ్ బ్యాడ్ అగ్లీ, అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలు వచ్చినట్టే వచ్చి వెనక్కు వెళ్లిపోయాయి. ఓదెల-2 ఊపు మూడో రోజు నుంచి కనిపించలేదు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు ప్రారంభంలో మంచి టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత ఆక్యుపెన్సీ కనిపించలేదు.

ఇక ఈ నెలకు ఫినిషింగ్ టచ్ గా వచ్చిన సారంగపాణి జాతకం సినిమా నిన్ననే రిలీజైంది. కొంతమందికి నచ్చింది, కొందరికి నచ్చలేదు, మరికొందరికి పార్టులు పార్టులుగా నచ్చింది. ఈ వీకెండ్ ముగిసేనాటికి రిజల్ట్ తేలిపోతుంది.

కన్నప్ప, రాజాసాబ్ లాంటి సినిమాలు వాయిదాలు పడ్డాయి. వచ్చేనెల రావాల్సిన హరిహర వీరమల్లు లాంటి మరికొన్ని సినిమాలు కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. ఇక మిగిలింది హిట్-3, కింగ్ డమ్ సినిమాలు మాత్రమే. ఈ సమ్మర్ బాక్సాఫీస్ గురించి భవిష్యత్తులో మాట్లాడుకోవాలంటే ఈ రెండు సినిమాలపైనే అంతా ఆధారపడి ఉంది.

3 Replies to “డిజాస్టర్ దిశగా టాలీవుడ్ సమ్మర్?”

Comments are closed.