బిగ్ బాస్‌గా బాలయ్య ఓకేనా?

బిగ్ బాస్‌నే మార్చాలన్న డిస్కషన్లు ప్రారంభమయ్యాయి. ‘అన్‌స్టాపబుల్’తో క్రేజ్ తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణను తీసుకోవాలనుకుంటున్నారు

తెలుగు జనాలకు బిగ్ బాస్ అంటే నాగార్జునే. ఎన్నో ఏళ్లుగా ఆయన పేరు అలవాటై పోయింది. నిజానికి ఆయన తన స్టైల్ మార్చుకోలేదు. అలాగే చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. మరోపక్క బిగ్ బాస్ రూల్స్ వల్ల సరైన సెలబ్రిటీలు హౌస్‌లోకి వెళ్లడం లేదు. మొత్తంగా బిగ్ బాస్ క్రేజ్ చోటా మోటా కంటెస్టెంట్లలో ఉందంతే తప్ప, ప్రేక్షకులలో నానాటికీ తగ్గిపోతూ వస్తోంది.

ఇలాంటి నేపథ్యంలో బిగ్ బాస్‌నే మార్చాలన్న డిస్కషన్లు ప్రారంభమయ్యాయి. ‘అన్‌స్టాపబుల్’తో క్రేజ్ తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణను తీసుకోవాలనుకుంటున్నారు. ఈ మేరకు సమావేశాలు, చర్చలు ప్రారంభమయ్యాయి. ‘అన్‌స్టాపబుల్’ రైటింగ్ టీంను తీసుకోవాలన్న చర్చలు కూడా ఉన్నాయి. బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షో క్లిక్ కావడంలో అక్కడ వర్క్ చేసిన రైటింగ్ టీమ్ కష్టం చాలా ఉంది. చాట్ షోకి వచ్చే సెలబ్రిటీలతో రోజుల తరబడి చర్చలు జరిపి, ఇంట్రెస్టింగ్ కంటెంట్ రెడీ చేసి, బాలయ్యకు నిమిషం నిమిషం చెవిలో ఇన్‌ఇయర్ ఎయిర్ బడ్ ద్వారా చెబుతూ రక్తికట్టించారు. బాలయ్య కూడా తన స్థాయి నుంచి కిందకి దిగి, అందరితో కలిసిపోయి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు.

కానీ బిగ్ బాస్ అలా కాదు. ఇది వన్ టు వన్ వ్యవహారం కాదు. దాదాపు పది మంది హౌస్‌మేట్స్‌తో డీల్ చేయాలి. ఎంత రైటింగ్ టీమ్ ఉన్నా కూడా స్పాంటేనియస్‌గా మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్లను కంట్రోల్ చేయాలి, లాలించాలి, గద్దించాలి — ఇంకా చాలా చాలా ఉంటుంది. ఇవన్నీ బ్యాక్‌ఎండ్ నుంచి టీమ్ సపోర్ట్ తీసుకుని బాలయ్య చేయగలరా అన్నది చూడాలి.

బాలయ్య బిగ్ బాస్‌గా వస్తారంటే క్రేజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అంచనాలు ఉంటాయి. నాగ్ స్టైల్‌తో పోలికలు ఉంటాయి. ఇవన్నీ బాలయ్య పార్టిసిపేషన్ ఓకే అయిన తర్వాత విషయం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

4 Replies to “బిగ్ బాస్‌గా బాలయ్య ఓకేనా?”

Comments are closed.