పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు!

ప్ర‌పంచ క్రైస్త‌వ మ‌త‌పెద్ద పోప్ ఫ్రాన్సిస్ (88) శాశ్వ‌తంగా ఈ లోకాన్ని వీడారు. ఈ విష‌యాన్ని వాటిక‌న్ సిటీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ప్ర‌పంచ క్రైస్త‌వ మ‌త‌పెద్ద పోప్ ఫ్రాన్సిస్ (88) శాశ్వ‌తంగా ఈ లోకాన్ని వీడారు. ఈ విష‌యాన్ని వాటిక‌న్ సిటీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కొంత‌కాలంగా ఆయ‌న శ్వాస సంబంధ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల ఆయ‌న ఆస్ప‌త్రిలో కూడా చేరి చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం కుదుట ప‌డింద‌ని అనుకుంటున్న త‌రుణంలో విషాద వార్త‌ను వాటిక‌న్ సిటీ వ‌ర్గాలు తెలిపాయి.

పోప్ అస‌లు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనాలోని బ్యూన‌స్ ఎయిర్స్‌లో 1936, డిసెంబ‌ర్ 17న జ‌న్మించారు. 2013 మార్చి 13న 266వ పోప్‌గా ఫ్రాన్సిస్ ఎన్నిక‌య్యారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా క్రిస్టియ‌న్లంతా పోప్ ఆదేశాల‌ను శిర‌సా వ‌హిస్తారు. గ‌తంలో వ‌స‌ల‌దారులు, శ‌ర‌ణార్థుల విష‌యంలో పోప్ ఫ్రాన్సిస్ చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. వాళ్ల విష‌యంలో మాన‌వ‌త్వంతో మెల‌గాల‌ని ప్ర‌పంచ దేశాల‌కు ఆయ‌న పిలుపు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప‌ర్యావ‌ర‌ణ విధ్వంసం, అలాగే మ‌ర‌ణశిక్ష‌ల‌కు వ్య‌తిరేకంగా కూడా ఆయ‌న పోరాడారు. తోటి మాన‌వులను ప్రేమించాల‌ని , అదే ప్ర‌పంచాన్ని కాపాడుతుంద‌ని ఆయ‌న ప‌దేప‌దే సందేశాలు ఇచ్చారు. వృద్ధాప్యంతో వ‌చ్చిన అనారోగ్య కార‌ణంగా 88 సంవ‌త్స‌రాల వ‌య‌సులో వాటిక‌న్ సిటీలోని కాసా శాంటా మార్టా నివాసంలో తుది శ్వాస విడిచారు. పోప్ మృతిపై ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌ముఖులంతా సంతాపం వెల్ల‌డిస్తున్నారు.

7 Replies to “పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు!”

  1. యేసు చనిపోయి శవం గా మారి మరల  తిరిగి లేచాడు అని చెప్పే ఈస్టర్ పండుగ రోజునే పోప్  చనిపోయాడు. కాబట్టి యెహోవా దగ్గరకి వెళ్ళి వుంటారు అని అనుకుందాం. ఆమేన్ అల్లెల్లుయ.

    జగన్ తన ఆస్తులు పూర్తిగా రోమ్ చర్చ్ కి దానం చేయడం చాలా గొప్ప విషయం.

  2. కల్వరి కొబ్బరి నూనె రాస్తే  తిరిగి బతికే అవకాసం ఉంది. రోమ్ కి కల్వరి కొబ్బరి నూనె డబ్బా ను పార్సెల్ చేయండి.

Comments are closed.