కుబేర @ 130 కోట్లు

ఖర్చులు వడ్డీలు అన్నీ కలిపి సినిమా ఖర్చును 130 కోట్ల మేరకు చేర్చేసాయి.

ఈ సమ్మర్ లో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో కుబేర ఒకటి. ఈ సినిమా బడ్జెట్ వింటే కాస్త షాక్ అవ్వాల్సిందే. దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాల్లో హయ్యస్ట్ బడ్జెట్ ఈ సినిమానే. ధనుష్ సినిమాల్లో కూడా ఇదే హయ్యస్ట్ బడ్జెట్ మూవీ కావచ్చు. ఓ తమిళ ఆర్టిస్ట్ మీద మన తెలుగు సినిమా తీస్తూ ఇంత ఖర్చు చేయడం కాస్త ఆసక్తి కరమే.

అయితే ఇంత ఖర్చు ఎందుకు అవుతోంది అంటే కేవలం రెమ్యూనిరేషన్లే నటీనటులు, దర్శకుడు, టెక్నీషియన్లు కలిపి 60 కోట్ల వరకు ఖర్చయిపోయింది. ధనుష్ రెమ్యూనిరేషన్ నే 30 కోట్లకు కాస్త అటు ఇటుగా వుంటుంది. నాగ్ ఈ సినిమాకు తన కెరీర్ హయ్యస్ట్ రెమ్యూనిరేషన్ తీసుకున్నారు. ఈ పాత్రకు కచ్చితంగా నాగ్ కావాలి కనుక, ఆయనకు అడిగినంతా ఇచ్చి తీసుకున్నారు. దాదాపు 14 కోట్లు నాగ్ రెమ్యూనిరేషన్ అని తెలుస్తోంది. ఇక రష్మిక హీరోయిన్, దేవీశ్రీప్రసాద్ సంగీతం ఇవన్నీ కలిసి సినిమా ఖర్చును మరింత పెంచాయి.

ఇదిలా వుంటే శేఖర్ కమ్ముల తీసుకున్న ఈ సబ్జెక్ట్ ప్రకారం బ్యాంకాక్, ముంబాయిల్లో అధిక భాగం షూట్ చేసారు. అలాగే ఎక్కువ రోజులు వర్క్ చేసారు. అందువల్ల ఖర్చులు వడ్డీలు అన్నీ కలిపి సినిమా ఖర్చును 130 కోట్ల మేరకు చేర్చేసాయి.

ఇదిలా వుంటే ఈ సినిమాకు జస్ట్ ఓటిటి, హిందీ కలిపి 90 కోట్ల వరకు రికవరీ వచ్చింది. కీలకమైన తమిళ వెర్షన్ ఇంకా వుంది. తెలుగు థియేటర్ హక్కులు వున్నాయి. అందువల్ల ప్రాఫిటబుల్ వెంచరే అనే కుబేర.

10 Replies to “కుబేర @ 130 కోట్లు”

  1. ఈ చింపిరి జుత్తులు, మాసిన గడ్డాలు ట్రెండ్ ఫేడ్ అయినట్టుంది..శేఖర్ కమ్ముల మూవీ కదా..గట్టెక్క వచ్చు..

  2. ఈపాటి హీరో మన తెలుగులో దొరకలేదా? అల్లరి నరేష్, శర్వానంద్, నాని లాంటి పెరఫార్మర్స్ పనికి రారా

  3. Dhanush is overrated actor. Many Telugu actors like RaviTeja, Sharwanand, Allari Naresh would have been a good choice. Dhanush has no market in Telugu.

  4. విజయ్ సేతుపతి, ధనుష్, సత్యరాజ్, దుల్కర్ సల్మాన్, నయనతార, త్రిష, etc వీళ్ళందరినీ ఎందుకు నెత్తిన పెట్టుకుంటారో అర్దం కాదు, అనవసరమైన బిల్డప్ ఇచ్చి వీళ్ళను మన ఇండస్ట్రీలో పెద్ద పీట వేస్తున్నారు, ఏపాటి యాక్షన్ చేసేవాళ్ళు మన దగ్గర లేరా అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి అర తప్ప మన వాళ్లకు బయట అవకాశాలు వచ్చింది లేదు. వీళ్ళకు మాత్రం కోట్లల్లో ఇచ్చి వాళ్ళు ప్రమోషన్ కి రాకపోయినా సర్దుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అవసరమా ఇదంతా

  5. ఫైట్స్ హీరోయిన్ తో రొమాన్స్ లేకుండా మన తెలుగు హీరో కి స్టోరీ చెప్పి ఒప్పించడం పాజిబుల్ కాదు

Comments are closed.