ఇక ఓపెన్ అవ్వాల్సింది ప్రభాస్ మాత్రమే..!

తన కొడుకుతో కలిసి తాజాగా ఆదిపురుష్ సినిమా చూశాడంట సైఫ్. అందులో రావణుడి పాత్రను చూడ్డానికి సైఫ్ కొడుకు చాలా ఇబ్బంది పడ్డాడట.

చాలామంది ఇంకా ఆదిపురుష్ సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఆ సినిమాలో నటించిన నటీనటులు లేదా పనిచేసిన టెక్నీషియన్స్ కనిపిస్తే మీడియా కూడా ఆ మూవీ గురించే అడుగుతోంది. అవును మరి.. ఆ సినిమా సృష్టించిన బీభత్సం అలాంటిది మరి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు, నిర్మాత, మాటల రచయిత, మ్యూజిక్ డైరక్టర్.. ఇలా చాలామంది ఓపెన్ అయ్యారు. ఇప్పుడు సైఫ్ అలీఖాన్ వంతు.

తన కొడుకుతో కలిసి తాజాగా ఆదిపురుష్ సినిమా చూశాడంట సైఫ్. అందులో రావణుడి పాత్రను చూడ్డానికి సైఫ్ కొడుకు చాలా ఇబ్బంది పడ్డాడట. అలాంటి పాత్ర పోషించినందుకు తనను క్షమించమని, కొడుకును వేడుకున్నాడట సైఫ్.

ఆదిపురుష్ లో నటించడం తను చేసిన తప్పని అంగీకరించాడు సైఫ్. ఆ సినిమాకు సంబంధించి వివాదాలు మొదలైందే సైఫ్ అలీఖాన్ పోషించిన రావణుడి లుక్ నుంచి. అలా మొదలైన వివాదాలు రిలీజ్ తర్వాత కూడా వెంటాడాయి.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇక ఓపెన్ అవ్వాల్సింది ప్రభాస్ మాత్రమే. ఇందులో శ్రీరాముడి పాత్ర పోషించిన ప్రభాస్, తన పాత్ర వరకు న్యాయం చేసినప్పటికీ సినిమా మరీ అన్యాయంగా ఉంది. ఒక దశలో ప్రభాస్ కూడా దర్శకుడు ఓంరౌత్ పై ఫైర్ అయినట్టు కథనాలొచ్చాయి. చూస్తుంటే, ఏదో ఒక సందర్భంలో ప్రభాస్ కూడా కాస్త గట్టిగానే ఓపెన్ అయ్యేలా ఉన్నాడు.

3 Replies to “ఇక ఓపెన్ అవ్వాల్సింది ప్రభాస్ మాత్రమే..!”

Comments are closed.