ఆరోగ్యంగా.. ఉత్సాహంగా.. సీనియర్ దర్శకుడు

ఎట్టకేలకు పుకార్లన్నింటికీ చెక్ పెట్టేశారు. వేదికపై ఉత్సాహంగా కనిపించారు వీవీ వినాయక్. చాన్నాళ్ల తర్వాత ప్రేక్షకులు ఆయన గొంతు విన్నారు.

మొన్నటివరకు ఎన్నో పుకార్లు, మరెన్నో కథనాలు.. ఒక దశలో కండిషన్ క్రిటికల్ గా ఉందంటూ ప్రచారం. ఓవైపు ఖండన ప్రకటనలు వస్తున్నప్పటికీ, మరోవైపు ఆగని రూమర్లు. ఇలా ఓ చేదు దశను చూశారు సీనియర్ దర్శకుడు వీవీ వినాయక్.

ఆయన అనారోగ్యానికి గురైన మాట వాస్తవం. అయితే దాన్నుంచి ఆయన తొందరగానే కోలుకున్నారు. అయినప్పటికీ పబ్లిక్ ఫంక్షన్లలో కనిపించపోవడంతో అక్కడక్కడ ఇంకా ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి.

ఎట్టకేలకు పుకార్లన్నింటికీ చెక్ పెట్టేశారు. వేదికపై ఉత్సాహంగా కనిపించారు వీవీ వినాయక్. చాన్నాళ్ల తర్వాత ప్రేక్షకులు ఆయన గొంతు విన్నారు.

దిల్ రాజు కొత్త వెంచర్ ఓపెనింగ్ కు వచ్చిన వీవీ వినాయక్, పూర్తి ఆరోగ్యంతో కనిపించారు. ఆయన మాట కూడా స్పష్టంగా ఉంది. గతంలో ఓసారి ఆయన తడబడుతూ మాట్లాడ్డం చాలామందిని కలచివేసింది. ఈసారి ఆ తడబాటు లేదు.

మొత్తానికి వినాయక్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. ఇక మిగిలింది దర్శకుడిగా ఆయన రీఎంట్రీ మాత్రమే.