విక్టరీ వెంకటేష్ తో దర్శకుడు త్రివిక్రమ్ సినిమా ఆల్ మోస్ట్ కన్ ఫర్మ్ అయిపోయినట్లే. బన్నీ జస్ట్ ఊ అంటే చాలు సినిమా అనౌన్స్ మెంట్ వస్తుంది. సినిమా రావడానికి పెద్ద అడ్డంకి వుండకపోవచ్చు. కానీ ఈ సినిమా మాత్రం త్రివిక్రమ్ కు పెద్ద సవాలు. ఎందుకంటే వెంకీ-త్రివిక్రమ్ సినిమా ఏనాటి నుంచో డ్యూ వుంది.
గతంలో మంచి క్లాసిక్ లాంటి మల్లీశ్వరి లాంటి సినిమా వారి కాంబినేషన్ లో వుంది. కానీ దానికి త్రివిక్రమ్ రచయిత మాత్రమే. అప్పటి నుంచి ఆ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆఖరికి ఇప్పటికి సెట్ అయింది. అందువల్ల అంచనాలు భారీగా వుంటాయి. ఫన్ ఓ రేంజ్ లో వుండాలని చూస్తారు. కథ కొత్తగా వుండాలని చూస్తారు.
ఆ సంగతి అలా వుంచితే అనిల్ రావిపూడి ఓ బ్లాక్ బస్టర్ ఇచ్చి వున్నారు. 250 నుంచి 300 కోట్ల సినిమా అది. త్రివిక్రమ్ రేంజ్ అనిల్ రావిపూడి కన్నా ఎక్కువ అన్నది త్రివిక్రమ్ అభిమానుల ఆలోచన. అందువల్ల ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాను మించిన సినిమా ఇవ్వాలి. మించిన ఫన్ ఇవ్వాలి. మించిన కలెక్షన్లు కళ్ల చూడాలి. లేదంటే త్రివిక్రమ్ ఇజ్జత్ కీ సవాల్ అన్నట్లు వుంటుంది పరిస్థితి.
ఇలాంటి నేపథ్యంలో త్రివిక్రమ్ ను మరీ గుడ్డిగా నమ్మేసి ముందుకు వెళ్లరు వెంకటేష్ కానీ, సురేష్ బాబు కానీ. కేవలం కథ లేకుండా ఏవో సీన్లు పేరిస్తే వర్కవుట్ అవుతుంది అని వారు ఒప్పుకోరు. అందువల్ల ఇప్పుడు సరైన కథ అల్లుకోవాలి. దగ్గుబాటి బ్రదర్స్ ను ఒప్పించాలి. అది ఓ పార్ట్. సినిమాను సంక్రాంతికి వస్తున్నాం కన్నా పెద్ద హిట్ చేయాలి అది మరో పార్ట్.
అన్నింటికి మించి ఇక్కడ ఫెయిల్ అయితే తరువాత బన్నీ సినిమా ప్రశ్నార్ధకం అవుతుంది. అది మరీ కీలకం.
Samyuktha ni heroine ga petkunda untey chalu
వాడికన్నా ఎక్కువ టెన్షన్ నీకున్నట్టుంది. ప్రతిరోజు ఏదో ఒకటి రాస్తున్నావ్ ఒకటే విషయం మీద. ట్యాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయావా?
Social media peddaga India lo penetrate avvani rojullo western movies lo story tisukuni daaniki Telugu sentiment ichi hit chese Vaadu..once Netflix and prime part of Indian common man tv, trivikram not able to make movies.
he is copy cat but I agree an intelligent copy cat perhaps a fox or hyena.