అమ‌రావ‌తిని పోషించుకోవ‌డ‌మే ఆంధ్రుల విధి!

ఒక రంగుల క‌ల‌ను చూపించి చంద్ర‌బాబు ఒక కేట‌గిరి జ‌నాల‌ను అయితే క‌ట్టిప‌డేశారు!

త‌ను విజ‌న‌రీ అని చెప్పుకోవ‌డం తెలుగుదేశం అధ్య‌క్షుడు, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు కొత్త కాదు. అయితే విజ‌న‌రీలు ఎవ్వ‌రూ తాము విజ‌న‌రీ అని చెప్పుకోవ‌డం చ‌రిత్ర‌లో చూడం మ‌నం! విజ‌న‌రీలు ఎవ‌రైతే ఉన్నారో వారిని మిగ‌తా ప్ర‌పంచం కీర్త‌స్తుంది కానీ, త‌మ‌ను తాము గొప్ప విజ‌న‌రీగా బ‌య‌ట‌కు చెప్పుకునే విజ‌న‌రీ మాత్రం ఎవ్వ‌రూ క‌న‌ప‌డ‌రు. అయితే చంద్ర‌బాబు త‌ను చెప్పుకుంటే త‌ప్ప జ‌నాలు దాన్ని గుర్తించ‌ర‌ని అనుకుంటారో ఏమో కానీ.. త‌ను విజ‌న‌రీ అని త‌నే డ‌బ్బా కొట్టుకుంటూ ఉంటారు!

అలాగే మంచి ఏది జ‌రిగి ఉన్నా.. జ‌ర‌గ‌బోయేలా ఉన్నా.. దాన్ని త‌న ఖాతాలో వేసుకోవ‌డం గురించి కూడా చంద్ర‌బాబు ఎలాంటి మొహ‌మాటాలూ ప‌డ‌రు! న‌వ్వుకుంటారు.. అనే భ‌యం కూడా ఆయ‌న‌కు లేదు. అలా న‌వ్వుల పాల‌య్యే ప్ర‌క‌ట‌న‌లు ఎన్నో చేసి ఉంటారో కూడా లెక్క ఉండ‌దు! ఈ విష‌యాల‌ను ప‌ట్టుకుని ప్ర‌త్య‌ర్థులు ట్రోల్ చేస్తూనే ఉంటారు. ప్ర‌త్యేకించి సోష‌ల్ మీడియా విరివిగా మారాకా.. ఆయ‌న ప్ర‌క‌ట‌న‌ల్లోని డొల్ల త‌నాల‌ను జ‌నాలు ఎండ‌గ‌డుతూనే ఉంటారు! అయితేనేం.. ఆయ‌న ఇప్పుడు కూడా ముఖ్య‌మంత్రి! ఎలాగైతేనేం.. ఇంకోసారి గెలిచి అధికారాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అమ‌రావ‌తి పున‌రారంభం అంటున్నారు!

అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్త‌వుతున్న ద‌శ‌లో మ‌ళ్లీ అమ‌రావ‌తిని చంద్రబాబు నాయుడు పున‌రారంభించారు! అంటే.. ఇలా ఎన్ని సార్లు ఆరంభిస్తారు? అందునా అమ‌రావ‌తి అనే ప్రాజెక్టు అంత అర్రీబుర్రీగా పూర్త‌య్యేది కూడా కాదు. ఒక‌వేళ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే.. ఇప్పుడు చేసిన పున‌రారంభం ఏమ‌వుతుంది అనేది కూడా ప్ర‌శ్నార్థ‌క‌మే! అలాగే.. 2014 నుంచి 2019ల మ‌ధ్య‌న తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉండి ఉంది. ఆ స‌మ‌యంలోనే అమ‌రావ‌తికి ఆరంభం ప‌లికారు. అలా చేసినా.. ఆ ఐదేళ్ల వ్య‌వ‌ధిలో సాధించింది ఏమీ లేద‌న్న‌ట్టుగా వెక్కిరిస్తున్న‌ట్టుగా ఉంది ఈ పునరారంభ ప్ర‌క‌ట‌న‌!

ఈ సారి అద‌నంగా అమ‌రావ‌తికి భూములు సేక‌రిస్తార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతూ ఉంది. ఉన్న భూమినే ఇప్ప‌టి వ‌ర‌కూ ఉద్ధ‌రించింది లేదు, ఇంకా భూములెందుకు అనే ప్ర‌శ్న‌లు స‌హ‌జంగానే వ‌స్తాయి. అయితే ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చే తీరిక‌, ఇవ్వాల్సిన అవ‌స‌రం కూడా చంద్ర‌బాబుకు అయితే లేదు! ఆయ‌న అభిప్రాయాల‌ను, ఆయ‌న ఉద్దేశాల‌ను రుద్దేందుకు మీడియా అయితే గ‌ట్టిగా ఉంది. మ‌రి ఈ ఆరంభాలు, పున‌రారంభాలు, ఈవెంట్ మేనేజ్ మెంట్లు బాగానే ఉన్నాయి కానీ.. అమ‌రావ‌తి నిర్మాణానికి నిధుల సంగ‌తేంటి అనేదే ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం!

నిధులు అన‌గానే.. అమ‌రావ‌తి సెల్ఫ్ స‌స్టైన్డ్ ప్రాజెక్ట్ అని అంటారు. అయితే అమ‌రావ‌తి కోసం మ‌ళ్లీ అప్పు అంటారు. కేంద్ర సాయం అంటారు. ఆ కేంద్ర సాయం గురించి చంద్ర‌బాబే ర‌క‌ర‌కాల మాట‌లు చెప్పారు! ఒక్క‌సారేమో మోడీ ఢిల్లీ నుంచి ప‌విత్ర‌మైన మ‌ట్టిని తెచ్చార‌ని చెప్పి, ఆ త‌ర్వాత అదే మ‌ట్టి గురించి అందుకు వ్య‌తిరేక‌మైన టోన్లో కూడా చంద్ర‌బాబు మాట్లాడారు. ఆయా రాజ‌కీయ అవ‌స‌రాల‌ను బ‌ట్టి కేంద్ర సాయం గురించి చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. మ‌రి ఇప్పుడు మోడీతో మ‌ళ్లీ దోస్తానా న‌డుస్తోంది కాబ‌ట్టి.. పున‌రారాంభానికి కూడా మోడీనే అతిథి అయ్యారు!

ఇక అమ‌రావ‌తిలో భూ కుంభకోణం అని ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వ‌చ్చింది. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్య‌తిరేక దారి తీసుకుంది. మూడు రాజ‌ధానుల ఫార్ములాను ప్ర‌క‌టించింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన థియ‌రీ ఏపీ జ‌నాల‌కు ఏ ర‌కంగానూ న‌చ్చ‌లేద‌నే అనుకోవాలి! అలాగ‌ని అమ‌రావ‌తి న‌చ్చిందా అంటే.. అదో బ్ర‌హ్మ‌ప‌దార్థం. చంద్ర‌బాబు నాయుడు చేసిన ప‌నేంటంటే.. అమ‌రావ‌తిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ నెత్తి మీద పెట్టేశారు. ఇప్పుడు దాని ప‌రిస్థితి ఎలా ఉందంటే.. పూర్తి చేస్తే ఒక ర‌కమైన భారం, పూర్తి చేయ‌క‌పోతే మ‌రో ర‌క‌మైన భారం!

ప్ర‌పంచ చ‌రిత్ర‌లో ఎక్క‌డ చూసినా.. ఏ దేశం ఏగి వ‌చ్చినా.. ఎక్క‌డా.. ఇలాంటి న‌గ‌ర నిర్మాణం అనేది ఒక ముహూర్తం పెట్టుకుని, ఆరంభాలు చేసి.. పున‌రారంభాలు చేసి.. నిర్మించిన‌ట్టుగా అగుపించ‌దు! కాల‌క్ర‌మంలో.. ప‌రిస్థితులు, వాతావ‌ర‌ణం, ప్ర‌పంచ ప‌రిణామాలు, దేశాభివృద్ధి, వ‌న‌రులు, ఉపాధి.. వంటి కార‌ణాల చేత ఎక్క‌డైనా న‌గ‌రాలు ఏర్ప‌డ్డాయి, అభివృద్ధి చెందాయి, మ‌హాన‌గ‌రాలు అయ్యాయి కానీ.. ఇక్కడ ఒక న‌గ‌రం క‌డ‌తామంటూ ప్ర‌క‌టించుకున్న ప్ర‌తి చోటా ప్ర‌హ‌స‌న‌మే ఎదుర‌య్యింది!

మ‌హామ‌హా న‌గ‌రాలు అన్నీ న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో పునాదులు వేసుకున్నాయి. అక్క‌డ ఉన్న నీళ్లు మొద‌ట మ‌నిషిని అక్క‌డ‌కు వ‌చ్చేలా చేశాయి. మ‌నిషి అక్క‌డ‌కు చేర‌డంతో.. స‌మూహం ఏర్ప‌డింది. ఒక‌రికి ఒక‌రి అవ‌స‌రం ఏర్ప‌డింది. వృత్తి ప‌నులు అవ‌స‌రం అయ్యాయి. ఆయా వృత్తులు చేయ‌గ‌ల వాళ్లు అక్క‌డ‌కు వెళితే ఉపాధి ల‌భించే ప‌రిస్థితి త‌లెత్తింది. ఒక్కొక్క‌రుగా అక్క‌డ‌కు చేరుకున్నారు, సామూహికంగా అభివృద్ధి చెందారు. అవే కాల క్ర‌మంలో న‌గ‌రాలు అయ్యాయి. కొత్త కొత్త అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటూ అవే మ‌హా న‌గ‌రాలుగా మారాయి. ప్ర‌స్తుతం మ‌హాన‌గ‌రం అని మ‌నం పిలుచుకునే ఏ న‌గ‌రం గ‌మ‌నం అయినా అలానే ఏర్ప‌డింది.

ఏ న‌గ‌రం అయినా.. నెమ్మది నెమ్మ‌దిగా విస్త‌రించుకుంటూ పోయింది. త‌న ప‌రిధిని పెంచుకుంటూ వెళ్లింది. న‌గ‌రం ప‌రిధి పెరుగుతున్న ప్ర‌తి ద‌శ‌లోనూ ప్లాన్డ్ న‌గ‌రాలు ఏర్ప‌డ్డాయి. ఇంతే కానీ.. ఇదిగో.. ఈ న‌గ‌రాన్ని ఇన్నివేల ఎక‌రాల్లో విస్త‌రిస్తాం.. ఈ న‌గ‌రంలో ఇది ఇక్క‌డ ఉంటుంది, ఇక్క‌డే ఉండాలి, ఆ న‌గ‌రంలో ఉన్న‌దాన్ని ఈ న‌గ‌రంలో తెచ్చిపెడ‌తాం, లేక‌పోతే డూప్లికేట్ త‌యారు చేస్తాం.. ఆ న‌గ‌రంతో పోలిక పెట్టి ఈ న‌గ‌రాన్ని నిర్మిస్తాం.. అంటూ నిర్మించిన న‌గ‌రాలు ఏవీ లేవు చ‌రిత్ర‌లో!

ఒక వ్య‌క్తి వ‌ద్ద డ‌బ్బులుంటే.. త‌న ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బులో ఎంత ఇల్లు క‌ట్టాలో నిర్ణ‌యించుకుని, ఆ మేర ప్లేస్ కొనుగోలు చేసి, అందులో ఇంటిని ప్లాన్ చేసుకుని క‌ట్టుకొన్న‌ట్టుగా.. ఒక రాష్ట్రం కొంత ప‌రిధిలో భూమిని సేక‌రించి, అక్క‌డ ఒక మ‌హా న‌గ‌రాన్ని డెవ‌ల‌ప్ చేసేస్తాం అంటే.. అది ప్ర‌హ‌స‌నంగా ఉంటుంది. అయితే చంద్ర‌బాబు మాత్రం ఇప్ప‌టికి ప‌దేళ్ల నుంచి అమ‌రావ‌తి క‌బుర్లు చెబుతూనే ఉన్నారు. ఇంకా నాలుగేళ్లు కూడా ఇవే ముచ్చ‌ట్లే స‌రిపోతాయ‌ని పున‌రారంభం తో స్ప‌ష్టం అవుతూ ఉంది.

రాజ‌ధాని అనేది తానంత‌కు తాను అభివృద్ధి కావాలి ఎక్క‌డైనా.. ప్ర‌భుత్వం దానికోసం చేయ‌గలిగింది దారులు ప‌ర‌చ‌డం మాత్ర‌మే! అంతే కానీ.. భూమినంతా ప్ర‌భుత్వ ఆధీనంలో పెట్టుకుని, ఇది ఇక్క‌డ‌, ఇది ఇక్క‌డ అంటే.. అదెలా సాధ్యం అవుతుంది! అలాగ‌ని ప్ర‌భుత్వ డ‌బ్బుతోనే అన్నీనా అంటే, అంత సీన్ లేదు! భూములు తీసుకున్నందుకు రైతుల‌కు చెల్లింపులు చేయాలి, ప్లాట్ల‌ను డెవ‌ల‌ప్ చేసి ఇస్తామ‌నే హామీలున్నాయి! దీని కోసం రాష్ట్రంలో అన్ని మూల‌ల‌కూ చేరాల్సిన వాట‌న్నింటినీ అమ‌రావ‌తి బాట ప‌ట్టించే ముచ్చ‌ట్ల‌కూ లోటు లేదు! అమ‌రావ‌తి అనే గుదిబండ‌ను పోషించ‌డానికి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికీ ఏదీ ద‌క్క‌కూడ‌దు! అలాగ‌ని మ‌న చ‌రిత్ర ఏమైనా ఘ‌నంగా ఉందా అంటే.. అభివృద్ధిని కేంద్రీకృతంగా సాగించ‌డం వ‌ల్ల తెలుగు వాళ్లు ప్ర‌తి సారీ మోస‌పోయారు!

చెన్నైని వ‌దులుకున్నారు, హైద‌రాబాద్ లోనూ చంద్ర‌బాబు హ‌యాంలో నే అంతా హైద‌రాబాదే అన్న‌ట్టుగా సాగించి చివ‌ర‌కు దాన్నీ కోల్పోయారు! రేపు మ‌ళ్లీ అలాంటివే జ‌ర‌గ‌వ‌ని ఏమీ లేదు! నిక్షేపంగా జ‌ర‌గ‌నూ వ‌చ్చు! అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాలి మొర్రో అని మ‌హామ‌హా మేధావులు మొత్తుకుంటారు. అయితే చంద్ర‌బాబు మేధ‌స్సు మాత్రం అంతా రంగుల రంగులుగా గ్రాఫిక్స్ చుట్టూరానే ఉంటుంది. కొత్త కొత్త గ్రాఫిక్స్ తో అమ‌రావ‌తి కొత్త ప‌టాలు త‌యారు అవుతూ ఉన్నాయిప్పుడు! ఒక రంగుల క‌ల‌ను చూపించి చంద్ర‌బాబు ఒక కేట‌గిరి జ‌నాల‌ను అయితే క‌ట్టిప‌డేశారు! వారేమో ఆ రంగుల క‌ల‌ల‌ను న‌మ్ముకుంటున్నారు. వాస్త‌వంలోకి వ‌స్తే అమ‌రావ‌తి అంటే అప్పులు అనే మాట రెండోదిగా వినిపిస్తుంది.

ఏతావాతా.. చంద్ర‌బాబు నాయుడు విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తొలిసారి అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడే అమ‌రావ‌తి అనే ఈ ప‌రిస్థితుల్లో ఏ మాత్రం వాస్త‌వం కాలేని ఒక క‌ల‌ను ఏపీలో ప్ర‌చారం చేసి, దాన్ని గుదిబండ‌గా క‌ట్టేశారు. దాన్ని వ‌దిలించుకోలేక కొన‌సాగించ‌లేక జ‌గ‌న్ న‌లిగిపోయి, రాజ‌కీయంగా కూడా ఎదురుదెబ్బ‌తిన్నాడు. మ‌రి రెండోసారి అధికారంలోకి వ‌చ్చాకా ఆ అమ‌రావ‌తిని ఈ సారి రాష్ట్రంపై మ‌రింత భారంగా మోపుతున్నారు చంద్ర‌బాబు నాయుడు! వ‌చ్చేసారి ఈయ‌న కూట‌మి మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చినా, రాక‌పోయినా.. ఏపీ మాత్రం శాశ్వ‌తంగా అమ‌రావ‌తి గుదిబండ‌ను మోయాల్సిందే! సెల్ఫ్ స‌స్టైన్డ్ ప్రాజెక్ట్ అని.. దాన్ని ఏపీ నెత్తిన రుద్ద‌డం తీవ్రస్థాయికి వెళ్లిపోయింది.

ఎక్క‌డైనా రాజ‌ధాని నుంచి ఏ రాష్ట్రానికి అయినా ఆదాయం ఉంటుంది, ఉపాధి ల‌భిస్తుంది, అయితే ఏపీకి మాత్రం ప‌న్నుల ఆదాయంతో పాటు, అప్పులు తెచ్చి మ‌రీ రాజ‌ధానిని పోషించుకోవాల్సిన ప‌రిస్థితుల్లో ఉంది. ఇలా ఎన్నాళ్లు అంటే.. ఎన్నాళ్లైనా ఇలాంటి ప‌రిస్థితే ఉండ‌వ‌చ్చు! చంద్ర‌బాబు క‌న్న క‌ల‌లు గ్రాఫిక్స్ గానే ఉన్నాయి ఇంకా, ఈ క‌ల‌లు కార్య‌రూపం దాల్చాలంటే జ‌స్ట్ ఓ ఐదారు ద‌శాబ్దాలు ప‌ట్టొచ్చు. అప్ప‌టి వ‌ర‌కూ అమ‌రావ‌తిని పోషించుకోవ‌డం ఆంధ్రుల క‌ర్త‌వ్యం!

91 Replies to “అమ‌రావ‌తిని పోషించుకోవ‌డ‌మే ఆంధ్రుల విధి!”

      1. పాపం ఆ పప్పు బెల్లాలు ఆగిపోయే ఇదిగో ఇలాంటి జఫ్ఫాల గింజులాట

  1. We can understand your frastration….ENO was shortage in Andhra from last 2 days , heavy demand from Jaffa. Things will settle in couple of days, don’t worry. Untill then ENO advertising in main edition of all leading Newspaper, just satisfy with the advertisements.  TIP: Today Eenadu has ENO advertisement

  2. పోషించుకుంటాము అనే ఓటు వేశారు లే .. ఎక్కువ ఏడవ మాకు 

    1. పోషించుకుంటాం అని ఎవడూ చెప్ప లేదు. జగన కన్నా ఎక్కువ పధకాల ఆశ చూపి మోసం చేశాడు. చంద్రబాబు అసలు పధం లక్షన్నర కోట్ల రూపాయల అప్పుతో కమ్మ సామ్రాజ్యాన్ని స్థాపించటం అని తెలిస్తే ఓటు కాదు,  మొఖం మీద ఉచ్ఛ 

  3. There are many intellectuals than you, in AP Govt. You dont lecture on the feasibility of the capital city. What did YCP do for the last 5 years except playing the drama of 3 capitals , ending up building none?

    Let there be one capital. Let them do their job.

    Do u expect the people of AP go and beg in other States’ capital like Bangalore, Chennai or Hyderabad???

    Just shut up

  4.  Jagan కూడా ఎలాంటి మొహమాటం లేకుండా అమరావతి ni degrade చెయ్యడమే లక్ష్యంగా పని చేసారు. వైజాగ్ ను ప్రమోట్ చేశారు 

      చివరికి ఏమి అయ్యింది. రెండు ప్రాంతాల్లో ప్రజలు హర్షించ లేదు ..అప్పుడు హైదరాబాద్ మీద.ఇలాగే ఏడుపులు ఎందుకు విమానాశ్రయం ఎందుకు హై వే లు.ఎందుకు బ్రిడ్జి లు ఎందుకు ఫ్లై ఓవర్ లు ఇదంతా తినేదా పెట్టేదా అని సరిగ్గా ఇరబయేళ్లకి.  హైదరాబాద్ వాళ్ళ. కొన్ని కోట్ల మంది దేశం నలుమూలల నుండి వచ్చి బతికే సిటీ అయింది అనేక హేళన.లు అవమానాలు తరువాతే. కేవలం అన్ని.తనకా లు పెట్టీ అప్పులు.తెచ్చే వెధవలకి ఏమి అర్థం అవుతుంది 

    1. Yes I still remember those cries in those days, now when they are getting fruits they started saying it was not done by CBN. But truth will never fade, that’s why in last few years his fame was shining.

  5. It is necessary to have a capital but unnecessary to spend lakhs of crores on a capital and that too only an area that is in flood zone. This is similar to the difference between educating people but not wasting time arguing with fools who shut their brains for a cause best known to them. 

    In writing this point, I have learnt a lesson from this and will be ignoring yellow chandlam and their publicity to jackup Amaravathi.

  6. Amaravati ni మేము పోషించుకుంటాం మాకు ఏమి బాధ లేదు. రేపు మాకు మా పిల్లలు కి ఉపయోగ పడవచ్చు. అలా పోషించమని మేము ఓట్లు వేశాం. నువ్వు, మీ Paytm బ్యాచ్ ee 5 years జరిగేది చూసి కుళ్ళి కుళ్ళి ఏడవండి. అంతకు మించి మీరు చేసేది ఏమి లేదు.

    1. 1.5 lakhs of crores loans and no one knows where that money was gone. Why should we cry, already rains are flooding the region and making buildings into swimming pools. People are crying for voting for this useless parties in 2024 who cannot fulfill promises made to them and also cannot even build a single wall.

      1. నీ పార్టీ చచ్చిపోయింది సార్ అది మళ్ళీ బతికి బట్ట కట్టే అవకాశం లేనే లేదు 

        1. We will see about it sir. Only time will prove who does and who lives. BTW, already discussions within yellow chandalam about fear if Jagan returning back to power. Go and tell your stories to them for peace.

    2. Instead of wasting your time here, go and buy land in this region and enjoy returns of nothing until people drag you out in 2029. 2029 will not be like 2024 where people will be fooled again with fake promises and electronics.

      1. ఏ కామెంట్ లో చూసినా 2029 2029 ani చంపేస్తునావు. Emaidhi 2029 లొ. మనోడి బ్రతుకు 11 నుండి ఇంకా దిగజారిది అంత మించి ఏమి జరగదు

        1. ENO దొరకక పాపం రెండు రోజుల నుండి పిచ్చెక్కి తిరుగుతున్నాడు. లైట్ తీసుకోండి…వాడి ఫ్రస్ట్రేషన్ పాపం పీక్స్

  7. Sir amaravathi kotta vanarulu strustunchukocacchu inko kotta nagaram nanaji tayaru aitey tappenti.joti mandhi nivasinchocchu hy bnglr chennai ki pratyamnayam gha manam cheyi cheyi kalipi tayaruchesukontey tappenti

  8. Misleading article. 

    Andhra shall have one good capital which will be owned by all parts of the state.

    The youth or other people shall not go to other States’ capitals like Bangalore, Chennai or Hyderabad with a begging bowl for employment or medical facilities or other requirements. We shall have some pride, please.

      1. This is old news. After losing in Mangalagiri, Malokam killed his pride and fell flat on the foot of central leadership and joined washing machine party to wiggle out of cases. This is not future but past news.

  9. Lekapote meelanti  psycho gallani poshinchala enti…5 yrs ap ni ishtam vachhinattu lootchesi venakesukunnaru bagane…manchi panulu jarugutunte chustu tatttukoleka mee kadupu manta bayata pettukuntunnaru…

  10. ఆల్రెడీ పోషిస్తున్నారుగా… అక్కడ ఉన్న భూములు ఇచ్చిన వ్యక్తులకి గత పదేళ్లుగా…. డబ్బులు / కౌలు ఇస్తున్నారు… ఇప్పుడు మరికొంత భూములు సేకరించ బోతున్నారు… వాళ్లకి కూడా ఇవ్వాలి..

    ఇప్పుడు వేల కోట్ల అప్పులు చెయ్యబోతున్నారు… వాటికి వడ్డీ డబ్బులు ఎవడు కడతారు..? మనమే… మనం కట్టే టాక్స్ లు తో ఎంచక్కా ఎంజాయ్ చేస్తారు…

    కట్టబోతున్న బిల్డింగ్ లు అడుగుకి 10000 దాకా ఖర్చు పెడతారట … హైదరాబాద్ లో టాలెస్ట్ బిల్డింగ్ సాస్ క్రౌన్ లో కూడా కనీసం ౩౦౦౦ అవ్వలేదు అడుగుకి… ఇక్కడ పది వేలు… ఎంచక్కా త్రీ టైమ్స్… హాయిగా.. స్కామ్ లు చేసుకుంటారు… అడిగే వాళ్ళు లేరు… మళ్ళీ ఎక్కడ అడుగుతాడేమో అని జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు… కాబట్టి.. హాయిగా స్కాం లు చేసుకోవచ్చు…

    ఆ అప్పులు కూడా టైం వచ్చినప్పుడు ఆంధ్ర జనాలే కడతారు… కట్టాలి కూడా..

  11. ఆల్రెడీ పోషిస్తున్నారుగా… అక్కడ ఉన్న భూములు ఇచ్చిన వ్యక్తులకి గత పదేళ్లుగా…. డబ్బులు / కౌలు ఇస్తున్నారు… ఇప్పుడు మరికొంత భూములు సేకరించ బోతున్నారు… వాళ్లకి కూడా ఇవ్వాలి..

    .

    ఇప్పుడు వేల కో ట్ల అ ప్పు లు చెయ్యబోతున్నారు… వాటికి వ డ్డీ డబ్బులు ఎవడు కడతారు..? మనమే… మనం కట్టే టాక్స్ లు తో ఎంచక్కా ఎంజాయ్ చేస్తారు…

    .

    కట్టబోతున్న బిల్డింగ్ లు అడుగుకి 1 0 0 0 0 దాకా ఖర్చు పెడతారట … హైదరాబాద్ లో టాలెస్ట్ బిల్డింగ్ సాస్ క్రౌ న్ లో కూడా కనీసం ౩ ౦ ౦ ౦ అవ్వలే దు అడుగుకి… ఇక్కడ పది వేలు… ఎంచ క్కా త్రీ టై మ్స్… హాయిగా.. స్కామ్ లు చేసుకుంటారు… అడిగే వాళ్ళు లేరు… మళ్ళీ ఎక్కడ అడుగుతాడేమో అని జగన్ కి ప్ర తి ప క్ష హోదా కూడా ఇవ్వలేదు… కాబట్టి.. హాయిగా స్కాం లు చేసుకోవచ్చు…

    .

    ఆ అ ప్పులు కూ డా టైం వచ్చినప్పుడు ఆంధ్ర జనాలే కడతారు… కట్టాలి కూడా..

  12. ఆల్రెడీ పోషిస్తున్నారుగా… అక్కడ ఉన్న భూములు ఇచ్చిన వ్యక్తులకి గత పదేళ్లుగా…. డబ్బులు / కౌలు ఇస్తున్నారు… ఇప్పుడు మరికొంత భూములు సేకరించ బోతున్నారు… వాళ్లకి కూడా ఇవ్వాలి..

    .

    ఇప్పుడు వేల కో ట్ల అ ప్పు లు చెయ్యబోతున్నారు… వాటికి వ డ్డీ డబ్బులు ఎవడు కడతారు..? మనమే… మనం కట్టే టాక్స్ లు తో ఎంచక్కా ఎంజాయ్ చేస్తారు…

    .

    కట్టబోతున్న బిల్డింగ్ లు అడుగుకి 1 0 0 0 0 దాకా ఖర్చు పెడతారట … హైదరాబాద్ లో టాలెస్ట్ బిల్డింగ్ సాస్ క్రౌ న్ లో కూడా కనీసం ౩ ౦ ౦ ౦ అవ్వలే దు అడుగుకి… ఇక్కడ పది వేలు… ఎంచ క్కా త్రీ టై మ్స్… హాయిగా.. స్కామ్ లు చేసుకుంటారు… అడిగే వాళ్ళు లేరు… మళ్ళీ ఎక్కడ అడుగుతాడేమో అని జగన్ కి ప్ర తి ప క్ష హోదా కూడా ఇవ్వలేదు… కాబట్టి.. హాయిగా స్కాం లు చేసుకోవచ్చు…

    .

    ఆ అ ప్పులు కూ డా టైం వచ్చినప్పుడు ఆంధ్ర జనాలే కడతారు… కట్టాలి కూడా..

  13. Amaravathi is Andra’s capital, if you have any concern about states’s pride you don’t talk negative, people already gave verdict. Come and join together with govt to make it success, don’t cry. That is not good for you and your party.

    1. Yeah.. Lets cooperate them to do their corruption to the core … and loot all the public money.. just casually.. as people gave a mandate….. 

      1. Corruption Chesthe ethi chupinchataanike kadaa prathipaksham pani. YCP pani. Corruption chesthaarani ekamgaa rajadhani vaddantaaremitraa baabu mee YCP vaallu. Undandi meeru mee jagan ide trans lo undandi. Ade raashtraaniki manchidi. 

        1. oh.. you don’t even know the meaning of my above comment… By the way, ycp also never said, amaravathi is not a rajadhani… you need to understand… for that, you need to have matured mindset… 

          1. We can understand your cry. If work starts and funds given then corruption occur, there is no much funds released yet, already crying corruption, this shows your mind set.

          2. ycp vaallaki maturity levels ekkuvayipoyaayi. Ade maturity levels tho jagan mudu rajadhanulu ki kattubadi unnaanu ani swayam ga prakatinchaalani manaspoorthiga korukuntunnaanu bro. Nee korika kudaa ade anukuntunnaanu mari. Avunaa?

          3. Then whatbwas 1L crores loans spent on till date? Why were 300 crores spent on re-launch of Amaravati? Yes, no works are happening except public money getting disappeared in name of capital construction. 

          4. Taking a region that is not at all feasible for reasons best known to public and spending lakhs of crores to make it a capital is a thing that even Tuglak would have thought twice but our Yellow Chandalam does it at the cost of state for benefitting g their deep pockets.

        2. It was a fake yellow media that said YCP does not want capital but there is no point to explain people that are deaf to the ideological principle of distributed development and making three regions of the state grow equally. Amaravathi can be a capital to house government buildings and related infrastructure but why does government need to spend 1L crores on building government infrastructure?

          1. YCP and Jagan could have questioned the same. Instead played gimmicks. But anyways, since what you said about YCP principle was reflected in the last 5 years jagan’s ruling, I truly wish Jagan at least come out of his room and reannounce his distributed development by 3 capitals. I truly wish this wholeheartedly. I hope you wish the same right?

      2. ఛాన్స్ ఇచ్చి చూశాం కదా తండ్రిని మించి కోడుకు పాలించి చూపించారు, దోచుకోవటంలో ఒకరిని మించి మరొకరు

    2. There is no pride in looting lakhs of crores in the guise of constructing a capital and destroying farm lands. 

      Why does capital need 1L crore investment? What will government build with 1L crores? To construct government buildings, High Court (which was already built) does it really need 1L crores? Capital development is a process that will have to happen organically and all government will be needing to support this organic growth is to provide basic amenities and infrastructure alongside having  buildings for government to operate. If this would require 1L crores, how would it be sustainable for future growth and why would companies invest in such a place where building something is not affordable?

  14. రాష్ట్ర రాజధాని అభివృద్ధి చెందుతుంటే ఓర్చుకోలేక కేవలం అసూయ తో, కుళ్ళు బుద్ది తో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్న జెగ్గులు బ్యాచ్..

    గ్రేట్ కాదు గ్యాస్ ఆంధ్రా అనేది ఇందుకే ..

    కంట్రోల్ లో ఉండు.. లేకపోతే గ్యాస్ ఎక్కువై పోతావ్ వెంకీ

  15. అమరావతి ఊపందుకుంటే.. ప్రైవేటు పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయి. ఏపీలో ఎవరు ఎలాంటి ఖర్చు పెట్టినా ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల రూపంలో ముఫ్పై నుంచి నలభై శాతం తిరిగి వస్తుంది. . గతంలో జెగ్గులు పథకాల పేరుతో, ఇక్కడి డబ్బులు ఇక్కడే రీసైకిల్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం కలగలేదు.

    .

    అమరావతి నిర్మాణం అనుకున్నట్లుగా సాగితే మూడేళ్లలో ఏపీ ఆర్థిక వ్యవస్థ భారీగా పుంజుకుంటుంది. ఉపాధి అవకాశాల గనిగా మారుతుంది. అదే జరిగితే…. ఏపీకి తిరుగులేని ఆర్థిక బలం చేకూరుతుంది.

  16. వీటికి సమాధానం వున్నా, నీ పీత బుర్ర కి అర్థం కాదని చెప్పట్లేదు

  17. you are criticizing man who is building something to improve GDP of andhra. Where were you when Jagan was abusing Andhra..che ddi batch have no shame.

  18. Em telinodiki cheppochhu…

    Antha telisinodiki cheppochhu…

    Kani neelanti moorkudiki cheppalem..

    You are not just supporting jagan…

    Criticiing AP people and their future…

    Ban GA

  19. చంద్రబాబు చేసే అభివృద్ధిని చూస్తూ ఏడవటం తప్ప ఈ పిచ్చికుక్క లు,సైకో కుక్కలు, కొజ్జా గాళ్ళు, చంద్రబాబు తెల్ల వెంట్రుక కూడా పీకలేరు.

  20. చంద్రబాబు చేసే అభివృద్ధిని చూస్తూ ఏడవటం తప్ప ఈ పిచ్చికుక్క లు,సైకో కుక్కలు, కొజ్జా గాళ్ళు, చంద్రబాబు తెల్ల వెంట్రుక కూడా పీకలేరు

  21. కేవలం  ప్యాలెస్ పులకేశి మాత్రమే సొంత ఆస్తులు పెంచుకోవడానికి లేకుండా, 

    రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం రాజధాని కోసం పెట్టుబడి పెట్టడం ఏంటో ? అని గ్రేట్ ఆంద్ర శోకాలు.

    మన రిషి కొండ, తాడేపల్లి ప్యాలెస్ లాగ ప్యాలెస్ పులకేశి కోసం ప్రజల డబ్బుతో కట్టిన ప్యాలెస్ లు వుంటే ప్యాలెస్ పులకేశి ఎంజాయ్ చేస్తాడు, సొంత పిల్లలకి ఆ ఆస్తులు ఇచ్చుకుంటాడు, కాని ఇలా ప్రజలకోసం రాజధాని కట్టుకుంటే ఎలాగ ? ఆయ్ ! 

Comments are closed.