వైఎస్‌ఆర్‌ను ఫాలో అవకుంటే ఈయన మనుగడ కష్టమే…!

ఎమ్మెల్యేలతో సమావేశమయ్యే ప్రక్రియ నిరంతరం సాగుతుందా? లేదా? అనేది చెప్పలేం.

కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల తరువాత రేవంత్‌ రెడ్డికి జ్ఞానోదయం అయింది. కేసీఆర్‌కు వచ్చిన చెడ్డపేరు తనకూ వస్తుందని భయపడిపోయినట్టుగా ఉంది. అందుకే దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డిని ఫాలో కావాలని డిసైడ్‌ అయ్యాడు. ఆయన మాదిరిగా మంచిపేరు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఏ ముఖ్యమంత్రికైనా మంచిపేరు రావాలంటే సంక్షేమ పథకాలు అమలు చేయడం, అభివృద్ధి పనులు చేయడం ఒక్కటే సరిపోదు.

మానవ సంబంధాలను కూడా మెయింటైన్‌ చేయాలి. ఇక్కడ మానవ సంబంధాలంటే మరీ గొప్పగా చెప్పుకోనక్కరలేదు. సామాన్య ప్రజలతో, పార్టీ ఎమ్మెల్యేలతో, నాయకులతో ఇంటరాక్ట్‌ కావడం. వారి కష్టసుఖాలు వినడం. వారితో కాస్త ఆత్మీయంగా మాట్లాడటం — అంతే. ఈ పని వైఎస్‌ఆర్‌ సమర్థంగా చేసేవారు. తాను ఎంత బిజీగా ఉన్నా తన దగ్గరకు వచ్చే ఎమ్మెల్యేలను కలిసేవారు, మాట్లాడేవారు, వారి బాధలు వినేవారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఎంత గౌరవంగా, ఆప్యాయంగా ట్రీట్‌ చేసేవారో, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, నాయకులను కూడా అలాగే ట్రీట్‌ చేసేవారు. మేలు చేసేటప్పుడు వైఎస్‌ రాజకీయాలు చేయడనేది విపక్షాలే ఒప్పుకున్న నిజం.

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి జోష్‌ ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో కనిపించడం లేదు. మంత్రులు కూడా ఎవరి వాళ్లే “యమునా తీరే” అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వైఎస్‌ఆర్‌ కష్టాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు ఏ పార్టీ వారైనా సరే ఆర్థిక సాయం చేసేవారని అంటారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా వారు అడిగిన పనులు చేసిపెట్టేవారు.

ఇలాంటి “హ్యూమన్ టచ్‌” కారణంగానే వైఎస్‌ఆర్‌కు అన్ని పార్టీల్లోనూ అభిమానులు ఉన్నారు. రేవంత్‌ రెడ్డి ఇలాంటి అభిమానం సంపాదించుకోకపోతే పార్టీలో ఆయన పట్ల వ్యతిరేకత ప్రబలే అవకాశం ఉంది.

రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్యేలతో ఎక్కువగా ఇంటరాక్ట్‌ కావడం లేదన్న ఆరోపణ ఉంది. కేసీఆర్‌ కూడా ఇలాంటి చెడ్డ పేరే మూటగట్టుకున్నాడు. ఆయన అధికారంలో ఉన్నంతకాలం ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఎవరినీ దగ్గరకు రానివ్వలేదు. ఎవరితో మనసు విప్పి మాట్లాడేవాడు కాదు. ఎమ్మెల్యేల కష్టసుఖాలు తెలుసుకునేవాడు కాదు.

బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఒకప్పుడు మండిపడ్డాడు. కేసీఆర్‌ను కలవడానికి ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్‌ దొరికేది కాదని… ఒకవేళ దొరికినా గంటల తరబడి వెయిట్‌ చేయించేవారని విమర్శించాడు. ఇది చాలామందికి ఉన్న అభిప్రాయం. కేసీఆర్‌ మంత్రులకు కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వడని అంటారు.

ఇలాంటి ఆరోపణలు రేవంత్‌ రెడ్డి మీద కూడా ఉన్నాయి. ఆ మధ్య మాజీ ఎమ్మెల్యే (ఐదుసార్లు ఎమ్మెల్యే) గుమ్మడి నర్సయ్య, ఇల్లెందు నియోజకవర్గ సమస్యలు చెబుదామని వచ్చి మూడు రోజులు వెయిట్‌ చేసినా, రేవంత్‌ రెడ్డి అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని చెబుతున్నారు.

రేవంత్‌ రెడ్డి అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్న కోపంతో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌ కుమార్‌ పార్టీకి రాజీనామా చేశాడు. ఇలాంటివి రేవంత్‌కు రిమార్కులు అయ్యాయి. అందుకే రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల తరువాత ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడటం మొదలుపెట్టాడు.

ముందుగా మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఏడుగురు ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా భేటీ అయ్యాడు. వారి సమస్యలు విన్నాడు. సంక్షేమ పథకాల అమలు గురించి తెలుసుకున్నాడు. అభివృద్ధి పనులను సమీక్షించాడు.

మరి ఇలా ఎమ్మెల్యేలతో సమావేశమయ్యే ప్రక్రియ నిరంతరం సాగుతుందా? లేదా? అనేది చెప్పలేం. ఈ ప్రక్రియ కొనసాగితేనే ముఖ్యమంత్రికి మంచిది. ఎవరినీ కలుసుకోకపోతే అసంతృప్తికి దారి తీసి వ్యతిరేకత ప్రబలే ప్రమాదం ఉంది.

16 Replies to “వైఎస్‌ఆర్‌ను ఫాలో అవకుంటే ఈయన మనుగడ కష్టమే…!”

  1. Aa per this article, YSR was great and helping natured. What about hundreds of TDP activists and Leaders brutally murdered under his regime. As per author of this article YSR is great administrator, then why he got only 152/294 ( just crossed magic figure) in 2009 elections, instead of increasing seats than they won in 2004. If Chiranjeevi party Praja rajyam not in contest in 2009… What is the situation?

    1. //he got only 152/294 ( just crossed magic figure) in 2009 elections, //

      The same propaganda tactics were used by Goebbels seem to be echoed by OUR Bolli, also known for falsely claiming he was transferring money into people’s accounts and distributing ATM-like cards across various districts. This was later exposed, and Y. S. R himself reprimanded him in the Assembly. Bolli, being a habitual liar, has repeatedly misled the public. He falsely claimed that the state’s debt stood at ₹14 lakh Crs, while in reality, as acknowledged in the Assembly, the actual debt when Jagan left office in 2024 was only ₹5.48 lakh crore. Despite knowing this, Bolli continued to promise major welfare schemes like Super 6, free bus rides, Amma Vodi, PRC and DA for government employees, and retirees. However, once in power, he conveniently backtracked on all these poll promises, citing a lack of funds in the state exchequer. This contradiction raises a serious question: if the debt is not ₹14 lakh crore but only ₹5.48 lakh crore, as officially stated, what is preventing the implementation of these promised schemes?

      Tirupathi Railway station P!cK pocket C@ s lo.. D0 NG@ vaadu.. You cant expect more than this from him. Grow up!

  2. వాట్ అ జోక్ . YSR  ఒక పరమ నీచ నికృష్ట లోఫర్ (అఫ్కోర్స్ కొడుకు అయ్య కంటే నీచుడు అనుకోండి)  చేసిన పాపాలకి, అరచాలకి ఉసురు పోసుకొని కుక్క చావు చచ్చాడు.

  3. ఈ లోకంలో వైఎస్ఆర్ కి ఒక్కడికే మానవ సంబంధాలు ఉన్నట్టు ఆ బిల్డప్ ఏంట్రా బాబు

      1. మనిషికి భాష సంస్కారం ముఖ్యం, అవి లేకపోతే పశువుతో సమానం

  4. జగన్ కి పెట్టింది పేరు కదా. మనుషులు ల నీ కలవడు అని. ఎప్పుడు కూడా ఆ చీకటి గదిలో కూర్చుని ఆత్మల తో మాట్లాడతాడు , ఆఖరికి పోప్ కి కూడా కనిపించని జీసస్ , జగన్ తో నేరుగా ముఖాముఖి ములాఖాత్ వుంటది అని అప్పట్లో తనే చెప్పుకున్నాడు.

  5. రేవంత్ రెడ్డిని వదిలిపెట్టు రేవంత్ రెడ్డి ఎందుకు ఇప్పుడు ముందు మన గురించి మాట్లాడుకుందాం 

     తమరి అన్న ఐదేళ్లు ఎంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చాడు ఎంతమందితో మాట్లాడాడు మరి ఆయన ఎందుకు వైయస్ఆర్ అంటే తన తండ్రిని ఫాలో అవ్వలేదు చెప్పగలవా గ్యాస్ ఆంధ్ర. గురివింద గింజ తన నలుపు తాను ఎరగదన్న సామెత అక్షరాల తమ అన్న నిరూపించాడుగా. మరి అతని గురించి రాయకుండా ఇతని గురించి రాస్తున్నావ్ ఎందుకు రా గ్యాస్ ఆంధ్ర. ఇలా ఎవరితోనూ మాట్లాడకుండా ఎవరిని కలవకుండా ఎవరే ఎవరు వచ్చినా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఐదేళ్లు గబ్బిలంలో మూల దాక్కున్నాడు కాబట్టే మట్టి  కోట్టుకుపోయాడు అన్న సంగతి నీకు తెలుసు. అందుకే ముందు ఆ సంగతి చెప్పి తర్వాత చెప్పు . మీరు చేస్తే సంసారం అదే ఇతరులు చేస్తే వ్యభిచారం వారేవా ఏం రాజకీయం రా మీది . ఇక నువ్వు ఆకాశానికి ఎత్తిన రాజశేఖర్ రెడ్డి చరిత్ర చెప్పాలంటే ఒక పెద్ద ఉద్గ్రతమవుతుందిలే. అతని గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నావు ముందు చరిత్ర తెలుసుకో తర్వాత మాట్లాడరా గ్యాస్ ఆంధ్ర

Comments are closed.