గురువారం విడుదలైన హిట్ 3 మంచి ఓపెనింగ్ తీసుకుంది. మర్నాడు శుక్రవారం కూడా మంచి కలెక్షన్లు నమోదు చేసింది. కానీ శనివారం నైజాం, ఉత్తరాంధ్ర ఏరియాలు మినహా మిగిలిన ఏరియాల్లో డ్రాప్ కనిపించింది. అందువల్ల సండే అన్నది కీలకం. సండే కచ్చితంగా అన్ని ఏరియాల్లో మంచి ఫలితాలు నమోదు అయ్యే అవకాశం వుంది. ఇదే కీలకం. ఎందుకంటే ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్ ఒకటి వుంది.
నాని సినిమాలకు క్రిటికల్ అప్లాజ్ బాగా వస్తుంది. నైజాం, ఉత్తరాంధ్ర, ఓవర్ సీస్ ల్లో బాగానే నడుస్తుంది. కానీ మిగిలిన ఏరియాల్లో తడబడుతూ వుంటుంది. దీన్ని అధిగమించాలని ప్రయత్నిస్తూనే వున్నారు. దసరా కు వైజాగ్ లో కూడా తడబడింది. హిట్ 3 సినిమాను వీలయినంత రీజనబుల్ రేట్లకు మార్కెట్ చేసారు. ఆంధ్ర 15 కోట్ల రేషియోలో ఇచ్చారు. హిట్ 3 కి వున్న బజ్ కు ఇది పెద్ద మొత్తం కాదు. అందువల్ల హిట్ 3 కు నైజాం, వైజాగ్ మినహా ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ సమస్య రాదు అని కచ్చితంగా భావిస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో హిట్ 3 తొలి రోజు మంచి ఓపెనింగ్ అందుకుంది. ఫస్ట్ లాంగ్ వీకెండ్ నాలుగు రోజుల్లో సినిమా బ్రేక్ ఈవెన్ కు చేరిపోతుంది అనే భావన కలిగింది. కానీ ఇప్పుడు చూస్తుంటే బ్రేక్ ఈవెన్ కావడానికి వన్ వీక్ పడుతుందా? వన్ వీక్ లో కూడా బ్రేక్ ఈవెన్ ఏరియాలు వుంటాయా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే మండే నుంచి రెగ్యులర్ డేస్ స్టార్ట్ అవుతాయి. అందువల్ల కలెక్షన్లు ఎలా వుంటాయి అన్నది చూడాల్సి వుంది.
మండే నుంచి కలెక్షన్లు బాగా డ్రాప్ అయిపోతే మళ్లీ స్టోరీ రిపీట్ అవుతుంది. నైజాం, వైజాగ్ మినహా మిగిలిన ఏరియాలు సమస్య అవుతుంది. నాని ఎలాగైనా ఈ సమస్యను అధిగమించాలి అంటే సండే చాలా బాగా ఫెర్ ఫార్మ్ చేయాలి. మండే బాగుండాలి. ఇక్కడ లక్ పాయింట్ ఏమిటంటే మళ్లీ దగ్గరలో బాగా అంటే బాగా క్రేజ్ వున్న సినిమాలు ఏవీ లేకపోవడం.
ఈజీ గానే 45 కొటొచ్చు.