నాని ప్రూవ్డ్… ఇక విజయ్ వంతు

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ వస్తోంది. నానికి మంచి పేరు, హిట్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సినిమా అది.

సోషల్ మీడియాలో నాని-విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు అంతరం వుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ కామన్ కూడా. ఇలాంటి నేపథ్యంలో సరిగ్గా 30 రోజుల తేడాలో ఆ ఇద్దరి హీరోల సినిమాలు ప్లానింగ్ జరిగింది.

నాని హిట్ 3 సినిమా వచ్చింది. హిట్ అనిపించేసుకుంది. నానికి అన్ని విధాలా అప్లాజ్ వచ్చింది. ఇక దాని గురించి మాట్లాడుకోవడానికి లేదు. విజయ్ దేవరకొండ కింగ్ డమ్ వస్తోంది. నానికి మంచి పేరు, హిట్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సినిమా అది. పెద్ద బ్యానర్, పెద్ద టెక్నికల్ ప్యాడింగ్. మంచి హీరోయిన్. ఇంక ఏ లోటూ లేదు. హిట్ కొట్టడం మాత్రమే తరువాయి.

చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఈ సినిమా తో నూటికి నూరు శాతం హిట్ కొట్టి తీరాల్సిందే. లేదంటే ఇలాంటి పెద్ద చాన్స్ మళ్లీ రావడం కష్టం. పైగా ఈ సినిమా రెండు భాగాలు. మొదటి భాగం బాగా ఆడితేనే రెండో భాగం అన్నది పాజిబుల్.

అందువల్ల అని విధాలుగా సవాలు ఈ సినిమా విజయ్ దేవరకొండకు. అటు ఫ్యాన్స్ ప్రౌడ్ గా ఫీల్ కావాలి. తనకు హిట్ పడాలి. అంత మంచి ప్యాడింగ్ అన్ని విధాలుగా వున్నా హిట్ పడకపోతే నామర్దాగా వుంటుంది. మరో మూడు వారాల్లో రిజల్ట్ రానుంది ఈ సినిమా నుంచి.

3 Replies to “నాని ప్రూవ్డ్… ఇక విజయ్ వంతు”

  1. manchi heroine, ha ha.. any success or great acting skills from Borse ?

    It will be purely on Direction, Story & Acting- to get success. Any one or more persons wont give success. 

  2. Vijay have ease in acting and have more potential to unleash. But his badluck he is lag by no god father in Tollywood.

    its only true director and story screen play magic shall save him ..

Comments are closed.