బన్నీ కేరాఫ్ దుబాయ్?

ఇప్పుడే కాదు.. కానీ కొన్ని ఏళ్ల తరువాత మాత్రం దుబాయ్ లో సెటిల్ అవ్వాలనే ఆలోచనలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ వున్నారని తెలుస్తోంది.

ఇప్పుడే కాదు.. కానీ కొన్ని ఏళ్ల తరువాత మాత్రం దుబాయ్ లో సెటిల్ అవ్వాలనే ఆలోచనలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ వున్నారని తెలుస్తోంది. ఇటీవల మన టాలీవుడ్ జనాలు ఎక్కువ మంది దుబాయ్ బాటలో వున్నారు. మూడు గంటలు జర్నీ కనుక ఊ అంటే ఇలా వెళ్లి అలా వస్తున్నారు. సినిమా ప్రముఖులు కొందరు దుబాయ్ లో ప్రాపర్టీలు కొనుగోలు చేసారు. అందరి కన్నా ముందుగా దుబాయ్ లో ఇల్లు కొన్నది సూపర్ స్టార్ మహేష్ బాబు నే. టాలీవుడ్ జనాలు వీళ్లు, వాళ్లు అని లేదు షాపింగ్ అంటే ఛలో దుబాయ్ అంటున్నారు.

మెగాస్టార్ చిన్న తనయ ఇటీవలే తన మకాం ను దుబాయ్ కు మార్చారు. తన ఇద్దరు పిల్లల చదువుల కోసం ఆమె దుబాయ్ కు షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. ఎప్పటికైనా దుబాయ్ లో సెటిల్ కావాలన్న తన భావనను బన్నీ తన సన్నిహితుల దగ్గర చాలా సార్లు వెల్లడించినట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు హైదరాబాద్ కు దూరంగా కాస్త రిలాక్స్ కావాలంటే ముంబాయి కి వెళ్లడం మన హీరోలకు అలవాటు వుండేది. దాదాపు చాలా మంది ముంబాయికి బాగా పరిచయం అయిపోయారు. పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని మన హీరోలు ముంబాయిలో కూడా ఫ్రీగా తిరగలేని పరిస్థితి. అందుకే ఇప్పుడు దుబాయ్ మీద దృష్టి పడింది. పైగా దగ్గరగా వుండే దేశం. అది పెద్ద అడ్వాంటేజ్.

బన్నీ ఇప్పుడు అట్లీతో భారీ సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. అట్లీ ముంబాయిలో వుంటారు. ఈ సినిమా అయిన తరువాత లేదా మరో ఒకటి రెండు సినిమాల తరువాత బన్నీ దుబాయ్ కు మకాం మార్చినా ఆశ్చర్యం లేదు.

13 Replies to “బన్నీ కేరాఫ్ దుబాయ్?”

  1. ఎం ఫీల్ అవ్వద్దు కొంచెం పలుకుబడి సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళు ఎవరు ఇండియా వదిలి పోరు పొతే అక్కడ వీది లో d0g కూడా khataru చెయ్యదు అని వాళ్ళకి కూడా తెలుసు

  2. America lo dorike luxury manaki daggaraga Dubai lo dorukutundi. Inthakante inkemkavali. Prashanthamga evaru evarni pattinchukokunda happyga luxurous ga bathikeyochhu. Thoka oopithe mana Dubai vallu thata theestharu. Safega happy ga additional income tho brathikeyochu. 

  3. దుబాయ్ టాక్స్ హెవెన్ అండ్ ఈజీ గ నలుపు తెలుపు పనులు జరుగుతాయి. ఖాన్ త్రయం అండ్ other బాలీవుడ్ చాల సంత్సరాల క్రితమే ఇది మొదలు పెట్టారు. ఇండియా లో స్టేట్ అండ్ సెంటర్ గొవెర్న్మెంట్స్ లొంగని వాళ్ళ ఆర్ధిక లొసుగులతో ఆడుకుంటున్నాయి. అందుకే ఇలాంటి ప్లేసెస్ వెతుకుంటున్నారు టక్కరి నక్కలు

Comments are closed.