ప్రభాస్ రావడమే లేటు!

రాజాసాబ్ ప్రభాస్ ప్రస్తుతం వేసవి విశ్రాంతిలో వున్నారు. త్వరలో ఆయన ఇండియా వస్తారు. వస్తూనే టీజర్ కు డబ్బింగ్ చెబుతారు.

ఎప్పటి నుంచో ఊరిస్తోంది రాజాసాబ్ టీజర్. ప్రభాస్-మారుతి కాంబినేషన్ లో పీపుల్స్ మీడియా నిర్మించిన సినిమా రాజాసాబ్. టీజర్ ఏనాడో కట్ చేసి వుంచారు.సిజి పనులు చేయించారు. ఎప్పుడు వదలుతారా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

టీజర్ ఎలా వచ్చింది అన్న దాని మీద చాలా వార్తలు వచ్చాయి. టీజర్ వస్తే సినిమా మీద, దర్శకుడు మారుతి స్టామినా మీద మంచి అప్లాజ్ వస్తుందని, సినిమా మీద మంచి అంచనాలు ఏర్పాడతాయని చూసిన చాలా మంది చెబుతూ వచ్చారు. అవన్నీ వార్తలుగా మారాయి కూడా.

కానీ టీజర్ ఎప్పుడు వస్తుందన్నది మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఓ గుడ్ న్యూస్ ఏమిటంటే మే నెలలో టీజర్ రాబోతోంది. రాజాసాబ్ ప్రభాస్ ప్రస్తుతం వేసవి విశ్రాంతిలో వున్నారు. త్వరలో ఆయన ఇండియా వస్తారు. వస్తూనే టీజర్ కు డబ్బింగ్ చెబుతారు. మిగిలిన చిన్న చిన్న పనులు పూర్తి చేసి టీజర్ ను వదులుతారు. అయితే అన్ని విధాలా సశాస్త్రీయమైన ముహుర్తం కుదరాలి. అదే విడుదల తేదీ.

ఆ తరువాత థియేటర్లలో వుండే ఏదైనా మంచి సినిమాకు ఈ టీజర్ ను జోడిస్తారు. అదీ విషయం.