సమంత.. సైకో సీరియల్.. ప్చ్!

సమంత తొలిసారి నిర్మాతగా తీస్తున్న సినిమా కనుక కాస్త అంచనాలు వుంటాయి. కానీ ట్రయిలర్ ఆ అంచనాలను నిలబెట్టలేదు.

హీరోయిన్ సమంత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే.తొలి సినిమా గా శుభం అంటూ శ్రీకారం చుట్టారు. ఇంత శుభమైన టైటిల్ పెట్టి సమంత అందిస్తున్న సరదా హర్రర్ సినిమా ట్రయిలర్ విడుదలైంది. కామన్ గా కామెడీ హర్రర్ సినిమాలు చాలా వచ్చాయి. ఈ సినిమాలో చిత్రమైన రీజన్ తీసుకున్నారు.

ఒక సీరియల్ కు అడిక్ట్ అయిపోవడం, అది చూడడం అడ్డుకుంటే చిత్రాతి చిత్రంగా బిహేవ్ చేయడం వంటి చిత్రాలు ట్రయిలర్ లో కట్ చేసి పెట్టారు. ముగ్గురు యువకులు, వారి సంసారాలు, వాటిలో చోటు చేసుకున్న ఈ సైకో సీరియల్ సంగతులు కలిసి శుభం అనే సినిమా అని అర్థం అయింది.

ట్రయిలర్ కట్ పెద్ద గొప్పగా లేదు. సింపుల్ గా వుంది. పైగా మరీ అద్భుతమైన ఫన్ మూమెంట్స్ ఏవీ చోటు చేసుకోలేదు. జస్ట్ కాజువల్ గా వుంది అంతే. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ హర్రర్ కామెడీ సీన్లు మన జనాలు చాలా అంటే చాలా చూసేసారు. అందువల్ల ఈ డోస్ సరిపోదు. కానీ ఇది జస్ట్ ట్రయిలర్ కనుక సినిమాలో ఎక్కువ వుంటుందని ఆశించడంలో తప్పు లేదు.

అయితే సమంత తొలిసారి నిర్మాతగా తీస్తున్న సినిమా కనుక కాస్త అంచనాలు వుంటాయి. కానీ ట్రయిలర్ ఆ అంచనాలను నిలబెట్టలేదు. పైగా ట్రయిలర్ చివర్న కామెయోగా సమంత కనిపించారు. కానీ అది కూడా పెద్దగా ఇంపాక్ట్ కలుగచేయలేదు. మే 9న సినిమా వచ్చాక అసలు సంగతి తెలియాల్సి వుంది.

3 Replies to “సమంత.. సైకో సీరియల్.. ప్చ్!”

  1. yee mahaathalli remunerations gurinchi lectures ichindhi. hero and heroine ki endhuku different remuneration isthaaru. nenu producer ga andariki same salary ichaanu ani. ilaanti verri pushpaalani theesukunte same salary ivvochu. oke star telugu hero and heroine ni theesukuni same remuneration ivvagaladhaa? thoo ..vrudhanaaree pathivratha type maatalu.

Comments are closed.