ఈ మధ్య ఏ పెద్ద ఇష్యూ జరిగినా దాని మూలాలు ఏదో ఒక రూపంలో పరిశ్రమలో బయటపడుతున్నాయి. మొన్నటికి మొన్న సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కు చెందిన దాదాపు 3000 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలను ఈడీ వెలికి తీసే క్రమంలో, ఈ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన మహేష్ బాబు పేరు తెరపైకొచ్చింది. దీంతో అతడికి కూడా నోటీసులిచ్చింది ఈడీ.
ఏపీ లిక్కర్ కేసు కూడా అలాంటి మలుపు తిరిగేలా కనిపిస్తోంది. అసలు ఇది కేసేనా.. దీని ప్రభావం ఎంత.. అసలైన నిందితులెవరు.. లాంటి విషయాల్ని ఇక్కడ ప్రస్తావించడం లేదు. ఈ కేసు పేరు చెప్పి, విజయసాయిరెడ్డి లాంటి చాలామంది ఒకే ఒక్క వ్యక్తి వైపు వేలు చూపిస్తున్నారు. అతడే రాజ్ కెసిరెడ్డి అలియాస్ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి.
మొన్నటి వరకు కనిపించుట లేదు అంటూ కథనాలొచ్చినప్పటికీ తాజాగా ఈ రాజ్, పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆయన పోలీసులకు ఇలా దొరికాడో లేదో అలా టాలీవుడ్ లో చిన్నపాటి అలజడి మొదలైంది. ఎందుకంటే, ఒకప్పుడు ఈ రాజ్ నిర్మాత కూడా.
వైఎస్ జగన్ హయాంలో ఐటీ సలహాదారుగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, అదే టైమ్ లో నిర్మాత అవతారం కూడా ఎత్తారు. రెడ్ సినిమాస్ అనే బ్యానర్ పెట్టి సుమంత్ తో ఓ సినిమా తీశారు. ఆ తర్వాత ఈడీ ఎంటర్టైన్మెంట్ అనే మరో బ్యానర్ పెట్టారు.
ఈసారి ఇంకాస్త పెద్దగా నిఖిల్ తో స్పై అనే సినిమా నిర్మించారు. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ సినిమాకు కథ కూడా రాజ్ కేసిరెడ్డి అందించడం విశేషం. తన నిర్మాణ సంస్థకు కార్పొరేట్ లుక్ తీసుకొచ్చేందుకు చరణ్ తేజ్ ఉప్పలపాటి అనే వ్యక్తిని సీఈవోగా పెట్టుకున్నారు. ఈ సినిమా టైమ్ లోనే కేసిరెడ్డికి, నిఖిల్ కు మధ్య విడుదల తేదీ విషయంలో అభిప్రాయబేధాలొచ్చాయి. మొత్తానికి పెద్దగా ప్రచారం లేకుండానే రిలీజ్ చేసి డిజాస్టర్ తెచ్చుకున్నారు.
ఈ గ్యాప్ లో మరిన్ని సినిమాలపై కథా చర్చలు సాగించారు. ఓ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి బయోపిక్ కూడా తీయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో టాలీవుడ్ కు చెందిన కొంతమందికి అడ్వాన్సులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒక దశలో సినిమాల కోసం మెగా కాంపౌండ్ వరకు కూడా వెళ్లారు కానీ అక్కడ వీళ్ల ప్రయత్నాలు వర్కవుట్ కాలేదు.
మరి వీటన్నింటికీ డబ్బులు ఎక్కడ్నుంచి వచ్చాయి. రాజ్ కేసిరెడ్డి అలియాస్ కె.రాజశేఖర్ రెడ్డి అరెస్టుతో ఇప్పుడీ వ్యవహారాలు కూడా తెరపైకి వచ్చేలా ఉన్నాయి. అందుకే టాలీవుడ్ లో చిన్నపాటి అలజడి.
సర్కార్ వారి పాట టైమ్ లోనే మహేష్ నీ ఒత్తిడి చేసి ప్యాలెస్ నుండి ఫోన్ కూడా చేపించి మరీ సినిమా చేయించారు అని అన్నారు.
ED … entertainments Banner peru bale saripoindhi
మహేష్ నీ కూడా అప్పట్లో బెదిరించి మరీ సినిమా తీశారు.
మాడామోహన గాణ్ణి “ఎర్రి బాగులోన్ని చేసి .. మావోణ్ణి కేవలం ఉత్త్తుత్తి బటన్లు నొక్కే ఎవ్వారానికే పరిమితం చేసి.. వాడికి తెలియకుండా, మీరు అందరూ కల్సి ఆంధ్రాని అన్నీ విధాలా లూటీ చేశారు కదరా.. చివరికి ఆడి పెళ్ళాన్ని కూడా వదల్లేదు కదరా.. మీయమ్మ కడుపులు మాడా
ఎంత సేపు నీ గోల నీదేనా? దేశం లో ఏం జరుగుతుందో చూస్తున్నావా? నీకు భాద్యత లేదా?
Inka nalugellu adigo metro, idio singapore style adigo london stylo lo building, new york style lo ani ABN battalu tappa phalitham emi undadu. Mottam 75000 ekarala ahara bhoomi real estate palu.
ఛీ.. ఛీ.. కడుపుకు అన్నం తింటున్నారా.. రాజకీయం తింటున్నారా .. దేశం మొత్తం, మీడియా మొత్తం ఉగ్రదాడుల మీద రగిలిపోతుంటే, మీ దగ్గర నుండి ఒక్క ఆర్టికల్ రాకపోవడం అతి దారుణం
Pappam bhuvaneswari akka badha padi vuntundhi