చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న వైసీపీ

చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న సామెత చందంగా…. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్ స‌స్పెన్ష‌న్ ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న సామెత చందంగా…. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్ స‌స్పెన్ష‌న్ ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించార‌నే కార‌ణంతో ఆయ‌న్ను పార్టీ నుంచి ఎట్ట‌కేల‌కు బ‌య‌టికి పంపారు. దువ్వాడ కుటుంబ వ్య‌వ‌హారాలు ర‌చ్చ‌కెక్కి కొన్ని నెల‌ల‌వుతోంది.

దువ్వాడ భార్య‌, పిల్ల‌లు రోడ్డెక్కి ఎమ్మెల్సీ శ్రీ‌నివాస్‌కి వ్య‌తిరేకంగా పెద్ద పోరాట‌మే చేశారు. మ‌రోవైపు ఇంకో వివాహిత‌తో దువ్వాడ స‌హ‌జీవ‌నం, కొత్త జంట‌లా యూట్యూబ్ చానెల్స్‌కు ఇంట‌ర్వ్యూల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దువ్వాడ శ్రీ‌నివాస్ ఎప్పుడూ క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించ‌లేదు. ఎందుకంటే, ఆయ‌న ఎప్పుడూ ఒకేలా ఉన్నారు.

కాక‌పోతే, దువ్వాడ చేష్ట‌ల‌తో రాజ‌కీయంగా రోజురోజుకూ బ‌ద్నాం అవుతున్నామ‌ని వైసీపీ పెద్ద‌లు ఇప్పుడు గ్ర‌హించిన‌ట్టున్నారు. అందుకే ఆయ‌నపై వేటు వేశారు. ఈ ప‌ని ఎప్పుడో చేసి వుండాల్సింది. దువ్వాడ కుటుంబ వ్య‌వ‌హారాలు బ‌జారుకెక్కి, ర‌చ్చ‌ర‌చ్చ అవుతున్న‌ప్పుడు.. వైసీపీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ ప్రేక్ష‌క‌పాత్ర పోషించింది.

కేవ‌లం టెక్కిలి ఇన్‌చార్జ్ బాధ్య‌త‌ల నుంచి మాత్ర‌మే ఆయ‌న్ను త‌ప్పించింది. మ‌ళ్లీ కొన్ని నెల‌ల త‌ర్వాత … దువ్వాడ‌ను స‌స్పెండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌నేదో మొద‌ట్లోనే చేసి వుంటే, పార్టీకి ఎంతోకొంత గౌరవం వుండేదేమో! కానీ ఉరుముల్లేకుండానే పిడుగు ప‌డ్డ చందంగా, ఇప్పుడు దువ్వాడ‌ను పార్టీ నుంచి బ‌య‌టికి పంపార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

23 Replies to “చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న వైసీపీ”

  1. Tdp/ జనసేన/ బీజేపీ లోనో జాయిన్ అవుతాడు. విసరే బీజేపీ అంటున్నారుగా.

  2. ఈ విషయానికి అయితే ఆయనను బర్తరఫ్ చేయనవసరం లేదు ఇలాంటి వాళ్ళు అన్ని పార్టీలలోనూ వున్నారు వాళ్ళుప్రజలకి ఎలాగా సేవ చేస్తున్నారన్నది ప్రదానం ఇంట్లో భార్యలందరు పూర్వం స్త్రీ ల మాదిరి ఉండటం లేదు ఎవరి ఇబ్బందులు వారివి ఇప్పటి స్త్రీలు కొందరు భర్తకు నరకం చూపిస్తున్నారు నిజం దేవునకు తెలియాలి

    1. మా జగన్ రెడ్డి కి లక్ష్మి పార్వతి లో పతివ్రత లక్షణాలు కనపడతాయి..

      విప్పుకుని తిరిగిన గోరంట్ల మాధవ్, అనంతబాబు ల్లో మగతనం చూస్తాడు..

      మాసాజ్ మాత్రమే చేస్తాదా .. ఇంకేమీ చేయదా అని దొరికిపోయిన అంబటి రాంబాబు లో రసికతనం చూస్తాడు..

      ..

      కానీ.. దువ్వాడ శ్రీనివాస్ ని మాత్రం తిరుగుబోతు గా చూస్తాడు .. అనుకుంటే మనం పొరపడ్డట్టే..

      దువ్వాడ మాధురి కి లైన్ క్లియర్ చేసాడు.. దువ్వాడ ప్రేమికుడు..

      ఇంకొన్ని రోజుల్లో దువ్వాడ మాధురి వైసీపీ మైకుల ముందు గలగలా భూతులు మాట్లాడటం మనం చూడబోతున్నాం..

  3. ఒకసారి వైసీపీ పార్టీ క్రమశిక్షణ “నాటకాలు” ఎలా ఫన్నీ గా ఉంటాయో.. లెక్కలు తీద్దాం..

    దళిత డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపినా ఎమ్మెల్సీ అనంతబాబు ని జగన్ రెడ్డి పార్టీ నుండి సస్పెండ్ చేసాడు..

    కట్ చేస్తే.. రెండు రోజుల తర్వాత జగన్ రెడ్డి పర్యటన లో వెనకే నిల్చుని హల్చల్ చేసాడు అనంతబాబు..

    పార్టీ మీటింగ్స్ లో కూడా తెగ హడావుడి చేసేసేవాడు..

    ..

    వల్లభనేని వంశి ని పార్టీ లోకి తీసుకోరు..పార్టీ కండువా కప్పరు .. కానీ వల్లభనేని వంశి కోసం వైసీపీ క్యాడర్ మొత్తం రక్తం చిందించేస్తుంది..

    ..

    అది అంతే.. తీసి తీసేసినట్టు.. తీసుకుని తీసుకోనట్టు ఉంటాయి.. వైసీపీ క్రమశిక్షణ వ్యవహారాలు.. కామెడీ గా

    ..

    రేపు అనే రోజు.. “దువ్వాడ మాధురి” కి వైసీపీ ఎంపీ సీట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు..

    వైసీపీ ఇలాంటి వ్యవహారాలూ జుజుబీ..

    1. ఇంకొకరిని మరచి పోయావ్ గౌతమ్ రెడ్డిని సస్పెండ్ చేసి తిరిగి కార్పొరేషన్ పధవి లబించింది
    2. అవును, 2029 ఎలెక్షన్స్ కి వైసీపీ కి అభ్యర్థులు వుండరు. ఆ పార్టీకి దువ్వాడ లాంటివాళ్లే గతి

  4. ఒరెయ్ నీకు సిగ్గులేదా!!! వైసిపి ఆకులు పట్టుకోలేదు….దువ్వడని బలి పశువు చేసింది. హత్య చేసి హోం డెలివరీ చేస్తే చర్య లేదు…నగ్న వీడియోలు చేస్తే చర్యలు లేవు, సంజనా, గంట అరగంట కి చర్యలు లేవు…ఒక్క దువ్వాడ అప్పనంగా దొరికాడు….

  5. మనం వెస్టర్న్ కల్చర్ లో లేము రా..ఒక రాజకీయ నాయకుడు అయ్యివుండి మనవల్ల తో ఆదుకోవాల్సిన వయసులో.. కూతురు వయసున్న ముగ్గురు పిల్లల తల్లి తో డాన్స్ లు, రాంప్ వాక్ లు…సమాజం  హర్షిస్తుందా? వ్యక్తిగత ము అనుకుంటే  గోప్యత పాటించాలి..అంతేకాని ఈ బజారు చేష్టాలెంది?

  6. పిఏసి సమావేశంలో సభ్యులు పార్టీ అధ్యక్షులు వారికి దువ్వాడ శ్రీనివాస్ గారి వల్ల పార్టీ కి జరుగుతున్న నష్టాన్ని వివరించడం వల్లనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది, జగన్ లో మార్పు వచ్చింది చెప్పింది వింటున్నాడు:జర్నలిస్ట్ సాయి 

Comments are closed.