వామ్మో.. ఉర్సాకు క‌ట్టబెట్టింది అందుకేనా?

విశాఖ‌లో ఉర్సా క్ల‌స్ట‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌కు రూ.3 వేల కోట్ల విలువైన 50 ఎక‌రాల‌కు పైగా భూమిని క‌ట్ట‌బెట్ట‌డం వెనుక పెద్ద వ్య‌వ‌హార‌మే ఉంద‌నే ఆరోప‌ణ‌లు గుప్పుమంటున్నాయి

విశాఖ‌లో ఉర్సా క్ల‌స్ట‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌కు రూ.3 వేల కోట్ల విలువైన 50 ఎక‌రాల‌కు పైగా భూమిని క‌ట్ట‌బెట్ట‌డం వెనుక పెద్ద వ్య‌వ‌హార‌మే ఉంద‌నే ఆరోప‌ణ‌లు గుప్పుమంటున్నాయి. ఉర్సా ప్ర‌మోట‌ర్ అబ్బూరి స‌తీష్ ఎలాంటి వారో విజ‌య‌వాడ మాజీ ఎంపీ కేశినేని నాని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్నికి స‌న్నిహితుడ‌ని, మోస‌కారి అని ఆయ‌న ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. గ‌తంలో ఒక కంపెనీ పెట్టి చాలా మంది కొనుగోలుదారుల్ని మోస‌గించి, ప‌త్తా లేకుండా పోయాడ‌ని, అలాంటి వ్య‌క్తికి వేల కోట్ల విలువైన భూమిని క‌ట్ట‌బెట్ట‌డం ఏంట‌ని ఆయ‌న ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని సిఫార్సుతోనే స‌తీష్‌కు సంబంధించిన కంపెనీకి భూమి ఇచ్చార‌నేది నాని ఆరోప‌ణ‌. ఈ వ్య‌వ‌హారం వెనుక పెద్ద‌లు ఒక్కొక్క‌రుగా బ‌య‌టికొస్తున్నారు. రెండు నెల‌ల క్రితం స్థాపించిన ఈ కంపెనీ డైరెక్ట‌ర్‌ను అంటూ జ‌య్ తాళ్లూరి ప్ర‌భుత్వ అనుకూల చానెల్స్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఇత‌ని వెనుక బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తి వుంది.

తానా మాజీ అధ్య‌క్షుడైన జె తాళ్లూరి సోద‌రుడు, ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త డాక్ట‌ర్ రాజా తాళ్లూరి కుమార్తె పూజ‌తో అన‌కాప‌ల్లి ఎంపీ సీఎం ర‌మేశ్ కుమారుడు రిత్విక్‌కు 2019, న‌వంబ‌ర్‌లో దుబాయ్‌లో ఘ‌నంగా పెళ్లి జ‌రిగింది. జ‌య్ తాళ్లూరి, సీఎం ర‌మేశ్ వియ్యంకుల‌న్న‌మాట‌.

కారుచౌక‌గా ఉర్సా కంపెనీకి వేల కోట్ల విలువైన భూముల్ని క‌ట్ట‌బెట్ట‌డానికి ఇంత‌కంటే ప‌లుకుబ‌డి ఏం కావాలో అర్థం చేసుకోవ‌చ్చు. అధికారం చేతిలో వుంటే, కంపెనీ ఎప్పుడు స్థాపించార‌న్న‌ది ముఖ్యం కానేకాదు. అంతేకాదు, దాని కెపాసిటీతో కూడా ప‌నిలేదు. ఎంతో విలువైన భూమిని అలా నిమిషాల్లో ఇచ్చేయొచ్చ‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మ‌రేదో అనుకునేరు. ఇదే మ‌రి!

15 Replies to “వామ్మో.. ఉర్సాకు క‌ట్టబెట్టింది అందుకేనా?”

  1. This URSA company does not even have website when alocated land, address is just ఆ home address. Company got established just 2 months ago. అలీబాబా ఆరడజను దొంగలు రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు

  2. Ok Ok Ok,

    suppose, for suppose nuvvu cheppedi correst anukundam, 

    Total land value 3000c

    total land 50 acers

    1 acer price = 3000/50 =600 croresa?

    state lo 600c per acer yekkadina vunda reddy?

  3. OK OK OK

    suppose for suppose, nuvvu cheppinde correct anukundam Reddy

    Total land value 3000Cr

    total land 50 Acers

    Cost per Acer 3000/50=600Cr

    Oka ekaram 600cr mana state lo yekkadina vunda reddy?

    why all these false allegations ? to cover Liquor Scam????

  4. అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే ఇదే మరి. ప్రజల ఆస్తులు చంద్ర బాబు గారు వాళ్ళ అనుయాయులకు కట్ట బెట్టి ప్రజా సొమ్ము కొల్ల గొట్టిన వాడిని క్షమించ రాదు.

Comments are closed.