పెద్దోళ్లు అలానే కలుస్తారు. కలిసి కూర్చుంటారు, అవసరమైతే కలిసి భోజనాలు కూడా చేస్తారు. ఇందులో విచిత్రమేంటని అనుకోవద్దు. రేవంత్ సర్కారుకు, నాగార్జునకు మధ్య నలుగుతున్న తకరారు గురించి అందరికీ తెలిసిందే.
ఒకటి కాదు, ఏకంగా 2 పెద్ద ఇష్యూలున్నాయి ఇద్దరి మధ్య. వీటిలో మొదటిది ఎన్-కన్వెన్షన్ కూల్చివేత. రేవంత్ రెడ్డి హయాంలోనే నాగార్జునకు రెండో ఆయువుపట్టుగా (మెదటిది అన్నపూర్ణ స్టుడియోస్) చెప్పుకునే ఎన్-కన్వెన్షన్ ను కూల్చేసింది హైడ్రా.
దీనిపై నాగార్జున న్యాయపోరాటం చేస్తున్నారు. కోర్టు స్టే ఇచ్చింది. కానీ కూల్చింది అలానే ఉంది. ఇప్పటికీ అటువైపు వెళ్తుంటే, ఆ శకలాలు దర్శనమిస్తున్నాయి. కాబట్టి గాయం ఇంకా పచ్చిగా ఉన్నట్టే లెక్క.
ఎన్-కన్వెన్షన్ డబ్బుకు సంబంధించిన మేటర్. రెండోది పరువుకు సంబంధించిన మేటర్. రేవంత్ రెడ్డి సర్కారులోని ఓ మహిళా మంత్రి, నాగార్జునపై అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళ అలా మాట్లాడ్డం సరికాదంటూ చాలామంది అప్పట్లో అభిప్రాయపడ్డారు కూడా.
దీనిపై కూడా నాగార్జున న్యాయపోరాటానికి దిగారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ పరువునష్టం దావా వేశారు. ఇలా రేవంత్ రెడ్డి సర్కారుతో నాగార్జునకు 2 పెద్ద ఇష్యూలు నడుస్తున్నాయి.
అయినప్పటికీ వాటన్నింటినీ పక్కనపెట్టి, వెళ్లి రేవంత్ పక్కన కూర్చున్నారు నాగ్. మిస్ వరల్డ్-2025 పోటీల్లో భాగంగా తెలంగాణ బ్యూటీ అండ్ కల్చర్ ను సెలబ్రేట్ చేసుకునే వేడుకలో ఒకే టేబుల్ పై రేవంత్, నాగ్ కనువిందు చేశారు.
నిజానికి వీళ్లిద్దరూ ఇలా కలవడం ఇదే తొలిసారి కాదు. గతంలో టాలీవుడ్ పెద్దలు కొంతమంది వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంలో కూడా నాగ్ ఉన్నారు. రేవంత్ కు శాలువా కూడా కప్పి వచ్చారు. ఈసారి ఏకంగా టేబుల్ షేర్ చేసుకున్నారు. అందుకే ఎంతమంది సెలబ్రిటీలు వచ్చినా, నాగార్జున, సీఎం రేవంత్ జోడీ ఎక్కువమందిని ఆకర్షించింది.
అట్లుంటది నాగ్ తోని
సమంత ఛాన్స్ మిస్ అయ్యింది అదే కేటీఆర్ ఉంటె తప్పకుండా వచ్చేది
“ఒకే టేబుల్ ఫై” అంటే, ఇంకా కుర్చీలు లేక టేబుల్ ఎక్కారనుకున్న “ఒకే టేబుల్ ఫై” అంటే, ఇంకా కుర్చీలు లేక టేబుల్ ఎక్కారనుకున్న
Nagarjuna good person
He doesn’t care about any when beautiful women r around.
ఆంధ్రులను అర్ధం చేసుకునే వాళ్ళలో రేవంత్ గారు కూడా ఒకరు