ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు ముందుగా శుభాకాంక్షలు. బర్త్‌డేని పురస్కరించుకుని ప్రతీకార వేడుకలు నిర్వహిస్తున్నానని, అందరూ రావాలని ఆహ్వానించడం రఘురామకే చెల్లింది. రఘురామలో బలహీనత ఏంటంటే, ప్రతిదానికీ ఆవేశపడడం. రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణం కాదు ఇది. ఎంతో సంయమనం ఉండాలి.
అంతెందుకు, ఇటీవల ఉండి నియోజకవర్గంలో ఇళ్ల కూల్చివేతపై సీపీఎం నేతృత్వంలో భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డిప్యూటీ స్పీకర్ రఘురామపై ఆరోపణలు గుప్పించారు. దీంతో ఆయనకు కోపం వచ్చింది. ఎంతో గౌరవప్రదమైన వ్యక్తిగా పేరున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుపై రఘురామ నోరు పారేసుకున్నారు. వామపక్షాలు అధికారంలో లేకపోవచ్చు కానీ, శ్రీనివాసరావు లాంటి నాయకులకు నీతే ఆస్తి. అలాంటి వాళ్లపై నోరు పారేసుకున్న రఘురామ లాంటి వాళ్ల గౌరవానికే అప్రతిష్ట. అంతే తప్ప, ఆయనకు పోయేదేమీ లేదు.
2021, మే 14న పుట్టిన రోజు నాడే తనపై రాజద్రోహం కేసు పెట్టి, సీఐడీ అధికారులు కస్టోడియల్ చిత్రహింసలకు గురి చేయడాన్ని రఘురామ పదేపదే గుర్తు చేస్తున్నారు. దెబ్బతిన్న రఘురామకు బాధ ఏంటో తెలుస్తుంది. ఎవరూ కాదనడానికి లేదు. తనను చిత్రహింసలకు గురి చేయడంతోనే వైసీపీ ప్రభుత్వ పతనానికి దారి తీసిందనేది ఇప్పటికీ ఆయన వాదన.
పోనీ రఘురామకు కూటమిలో ఒరిగిందేమిటో చెబితే బాగుంటుంది. నర్సాపురం నుంచి కూటమి తరపున ఎంపీ టికెట్‌ను ఆశించారు. కానీ ఆయనకు దక్కలేదు. ఆ సందర్భంలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ఎలా మాట్లాడారో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. చివరికి అతి కష్టం మీద ఉండి స్థానాన్ని రఘురామకు చంద్రబాబునాయుడు కేటాయించారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తన నెత్తిన కిరీటం పెడతారని రఘురామ భావించినట్టున్నారు. అలాంటిదేమీ జరగకపోవడంతో అప్పుడప్పుడు ఆయనలోని అసహనం బయట పడుతూ వుంటుంది. స్పీకర్ పదవి కోరుకున్నప్పటికీ, నెరవేరలేదు. మంత్రి పదవి ఇస్తారని ఆశించారు. అదీ జరగలేదు. తనకు ఎందుకు కీలక పదవులు ఇవ్వలేదో ఆయన పలు ఇంటర్వ్యూల్లో కీలక కామెంట్స్ చేశారు.
పోనీ, కస్టోడియల్ టార్చర్‌కు సంబంధించి పోలీసు యంత్రాంగం సీరియస్‌గా తీసుకుందా? అంటే, ఔనని, కాదని చెప్పలేని పరిస్థితి. నాటి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌ను అరెస్ట్ చేయాలనే ఆయన కోరిక నెరవేరలేదు. మరెందుకని ఆయన ఇవాళ ప్రతీకార దినోత్సవం జరుపుకుంటున్నారో రఘురామకే తెలియాలి. తన వల్ల కూటమి రాజకీయ ప్రయోజనం పొందిందని అంటున్న రఘురామ, తనకేం దక్కిందో ఒక్కసారి ఆలోచిస్తే ప్రతీకారాల గురించి ఆలోచించేవారా?
////ఎంతో గౌరవప్రదమైన వ్యక్తిగా పేరున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుపై రఘురామ నోరు పారేసుకున్నారు. వామపక్షాలు అధికారంలో లేకపోవచ్చు కానీ, శ్రీనివాసరావు లాంటి నాయకులకు నీతే ఆస్తి///
.
అదెంటయ్యా! మామూలుగా జగన్ ని విమర్సిస్తె వీళ్ళకి కులం అంటకట్టి విమర్సిస్తావ్!
ఇవ్వాల గౌరవప్రదమైన వ్యక్తి అంటున్నావ్! నీతే ఆస్తి అంటున్నావ్!! నాలిక ఒక్కసరె అలా ఎలా మడతెస్తాయగలవ్!
///రఘురామా… ప్రతీకారం ఎవరిపై?///
.
జగన్ పై!!
జగన్ చెప్పకుండా అయనపై కస్టొడియల్ టార్చర్ జరగదు అన్న విషయం అందరికీ తెలిసందె! మరి అయన జగన్ ని ఒడించటంలొ అయన పాత్ర అయన పొషించి ప్రతికారం తీర్చుకున్నరు అనుకొవాలి ఎమొ!
RRR తన కళ్ళ లో కి నేరుగా చూసి మాట్లాడాడు అని అహం దెబ్బ తిని, అతన్ని కొట్టించిన మాడ గాడు ప్యాలెస్ పులకేశి.
ఇప్పుడు చెల్లు కి చెల్లు గా అచ్చం RRR నీ ఎలా అయితే కొట్టారు నో, అలాగే
ప్యాలెస్ పులకేశి గాడు నీ కూడా బల్ల మీద పడుకోబెట్టి, అరికాళ్ళ మీద లాటీ తో బడితే పూజ చేయాలి. ఆ పని నీ లైవ్ లో RRR చూడాలి.
అప్పుడు చెల్లు కి చెల్లు. RRR పడిన భాద కి పరిష్కారం దొరుకుతుంది.
Reddy?
అప్పట్లో జయ లలిత్ తో సున్నం పెట్టుకుని 1260 కోట్లు నష్ట పోయిన RRR. కానీ ఆమె ముందు తల వంచలేది.
నేను మొగాడి గా పుడితే, అచ్చం RRR లాగా ఉండాలి అని ఆవిడే తర్వాత మెచ్చుకున్నారు.
నేరుగా సూటిగా మాట్లాడం ఆయన నైజం.
ప్రతీకారం పంచాలూడదీసి “గుడిసేటోడి” పై.. ఇంకా నీకు క్లారిటీ లేదా గ్యాస్ ఎంకన్నా??