చింత‌మ‌నేని అరాచ‌కాలకు అడ్డుక‌ట్ట వేయ‌లేరా?

టీడీపీ అధికారంలో వుంటే చాలు… దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ అరాచ‌కాల‌కు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.

టీడీపీ అధికారంలో వుంటే చాలు… దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ అరాచ‌కాల‌కు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. చింత‌మ‌నేని, ఆయ‌న అనుచ‌రుల దౌర్జ‌న్యాల నుంచి త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ దాస‌రి బాబూరావు దంపతులు టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి వెళ్లి వేడుకున్నారు. త‌మ భూమిలో అక్ర‌మ మ‌ట్టి త‌వ్వ‌కాలు చేస్తున్నార‌ని, ఈ విష‌య‌మై ఎస్పీ మొద‌లుకుని, రెవెన్యూ, మైన్స్ అధికారుల‌కు ఫిర్యాదు చేసినా ఫ‌లితం లేద‌ని టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి వెళ్లి ఆ దంప‌తులు గోడు వెల్ల‌బోసుకున్నారు.

ఈ విష‌య‌మై సాక్షితో పాటు ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక‌లు కూడా వార్త‌లు రాశాయి. ఇదేమీ ఆయా ప‌త్రిక‌ల సొంత క‌థ‌నాలు కావు. ఒక సంఘ‌ట‌న‌కు సంబంధించి రిపోర్ట్ చేశారంతే. అయితే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌కు “సాక్షి”పై మాత్ర‌మే కోపం వ‌చ్చింది. ఆ ప‌త్రిక వైఎస్ జ‌గ‌న్‌కు సంబంధించింది కావ‌డంతో టార్గెట్ చేయ‌డానికి చింత‌మ‌నేనికి సులువైంది.

ఏలూరులోని సాక్షి కార్యాల‌యానికి మందీమార్బ‌లంతో వెళ్లి విధ్వంస ర‌చ‌న చేశారు. చింత‌మ‌నేని త‌న అనుచ‌రుల‌తో సాక్షి కార్యాల‌యంలో విధ్వంసానికి తెగ‌బ‌డి, భ‌య‌పెట్ట‌డం ద్వారా త‌న‌పై వ్య‌తిరేక క‌థ‌నాలు రాకుండా అడ్డుకోవాల‌ని అనుకున్న‌ట్టుగా ఉన్నారు. తానంటే భ‌యంతో మీడియా ప్ర‌తినిధులు త‌మ క‌లాల‌కు ప‌ని పెట్ట‌కూడ‌ద‌నేది ఆయ‌న ఉద్దేశంగా క‌నిపిస్తోంది. అయితే చింత‌మ‌నేని సాక్షిపై దాడితో త‌న పిరికిత‌నాన్ని తానే చాటుకున్న‌ట్టైంది.

నిజంగా త‌న‌కు ద‌మ్ము, ధైర్యం వుంటే… ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక‌ల కార్యాల‌యాల‌పై దాడికి పాల్ప‌డాల్సి వుంది. అప్పుడు ఏమ‌య్యేదో చింత‌మ‌నేనికి తెలిసేది. అధికారాన్ని కోల్పోయి నిస్స‌హాయ స్థితిలో ఉన్న వైసీపీ సంబంధిత మీడియా కార్యాల‌యాల‌పై భౌతిక‌దాడులు చేయ‌డం ద్వారా ధైర్య‌ప‌రుల‌ని అనిపించుకోరు. గ‌తంలో 2014-19 మ‌ధ్య కూడా ఇలాగే చింత‌మనేని అరాచ‌కాల‌తోనే టీడీపీ రాజ‌కీయంగా తీవ్రంగా న‌ష్ట‌పోయింది. ఇప్పుడు మ‌రోసారి చింత‌మ‌నేని అరాచ‌కాలు గ‌తం కంటే రెట్టింపుగా పున‌రావృతం అవుతున్నాయి.

ఇప్ప‌టికే చింత‌మనేని చ‌ర్య‌ల‌తో అరాచ‌క ప్ర‌భుత్వ‌మ‌నే ముద్ర ప‌డింది. ఇది మ‌రింత పెరిగితే మాత్రం రాజ‌కీయంగా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వుంటుంది. చింత‌మ‌నేని చ‌ట్టానికి అతీతుడిగా కూట‌మి స‌ర్కార్ భావిస్తున్న‌ట్టుగా వుంటే, ఆ విష‌యాన్ని బ‌హిరంగంగా ప్ర‌క‌టిస్తే, ప్ర‌జ‌లే అంతిమ నిర్ణ‌యం తీసుకుంటారనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

8 Replies to “చింత‌మ‌నేని అరాచ‌కాలకు అడ్డుక‌ట్ట వేయ‌లేరా?”

  1. నిన్న జరిగిన చింతమనేని గారి పోరాటం అందరు చూసేరు ఆయన తనను నేరస్తుడిగా చిత్రీకరించి ఆర్టికల్ ప్రచురించిన విషయానికి ఆధారాలు అడిగేరు అందులో తప్పేముంది ఒక పేపర్ చేతిలో వుంది కదా అని ఒక వ్యక్తి క్యారెక్టర్ ని తప్పుగా ప్రచురిస్తే వదిలేయాలా వాళ్ళు ఆధారాలు ఇవ్వాలి ఎదో పేపర్ వేసింది మేము అందుకు వేసాము అంటే ఎలా వొప్పుకొంటారు అందుకనే అది టిష్యూ పేపర్ అయింది

    1. ఆల్రెడీ రాజధాని లో పంట కాల్చిందిని నాలుగు నెలలు ఉంచి తీసారు. ఒక నెలకు ఒక సినిమా రచయిత నీరు కారాడు , రెండు నెలలుగా గన్నవరం గంట కొడుతుతున్నారు

  2. ఎంతో సహనం గా వ్యవహరించాడు తన సహజ సిద్ధ స్వభావాన్ని కి..సాక్షి రాసిన తప్పుడు రాతలకి ..మామూలు గా అయితే గు..ద్ద రాల మింగి ఏలూర్ ఆఫీస్ కి తాళం ఎయిన్చేవాడు..

  3. 🔥 జగన్‌ను ప్రజలు ఓడించలేదు… నేరుగా చెంపదెబ్బ కొట్టారు!

    ఇది ఓ సాధారణ ఓటింగ్ ఫలితం కాదు బాస్…

    ఇది ప్రజల కోపం, అసహనం, అవమానానికి ఇచ్చిన ప్రతిస్పందన!

    👉 తల్లిని కోర్టుకి లాగిన వాడికి ప్రజలు గౌరవం చూపారా?

    👉 చెల్లిని అవమానపరిచిన వ్యక్తికి ఇంకెవరైనా అండగా నిలుస్తారా?

    ప్రజలు ఏం చేశారు తెలుసా?

    ఒక నిమిషం కూడా వెనక్కి చూసుకోకుండా, ఒక్క ఓటుతో నేరుగా గుద్దిన చెంపతాటు వేశారు.

    📉 151 నుంచి 11? ఇదెక్కడ ఓ సాధారణ ఓటు తేడా లా ఉంది?

    ఇది ఒక మౌన తిరుగుబాటు కాదు… ఇది ఓ గర్జన!

    ఓట్ల ద్వారా ప్రజలు జగన్‌కి చెప్పిన తుది తీర్పు: “జనం మాయలో పడే రోజులు ముగిశాయి!”

    ఇప్పుడు YCP పేరు వింటేనే జనం చిరాకుపడుతున్నారు.

    గ్రామాల్లో ఫ్లెక్సీలు లేవు, పట్టణాల్లో క్యాడర్ మాయం, నగరాల్లో ఆది అభిమానం మిగల్లేదు.

    💥 ఇది ఓటింగ్ కాదు…

    ఇది ప్రజల చేతిలో వాలిన అర్హత చెంపదెబ్బ.

    ఇది జగన్‌పై వేసిన ముద్ర – “ఇక ఈ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు!”

    #చెంపతాటు2024

    #తీవ్రతిరస్కారం

    #JaganRejected

    #SelfRespectVote

    #NeverAgainJagan

    #YSRCPGone

    #PublicSlap

    #AndhraDecided

Comments are closed.