పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి రావాల్సిన సినిమాలు రెండు వున్నాయి. హరి హర వీరమల్లు, ఓజి. ఒకటి కొంత వరకు పూర్తయింది. రెండోది చాలా వరకు పూర్తయినది. వీటిలో హరి హర వీరమల్లు సినిమా నిర్మాత చాలా ఇబ్బందుల్లో వున్నారు. ఎందుకంటే సినిమా మీద బాగా పెట్టుబడి పెట్టేసారు. వడ్డీలు కట్టుకుంటున్నారు. ఇంకా ఇంకా ఆలస్యం అయితే అసలు సినిమాలు పైసా మిగులుతుంది అని అనుకోవడానికి లేదు. మంగళగిరిలోనే షూటింగ్ అంటారు. అదిగో విడుదల అంటారు. ఇదిగో విడుదల అంటారు. కానీ అవేమీ కనిపించదు.
ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ రెండు సినిమాల నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వచ్చేసాయి. హరిహర వీరమల్లుకు సంబంధించిన ప్యాచ్ వర్కలు ప్లాన్ చేసుకుని, వీలయినంత త్వరలో విడుదల చేసుకోమని చెప్పారని తెలుస్తోంది. మే రెండు లేదా మూడో వారంలో విడుదల ఉండొచ్చంటున్నారు. అలాగే ఓజి సినిమా వర్క్ ప్లానింగ్ కూడా స్టార్ట్ చేయమన్నారని, సెప్టెంబర్ 5న విడుదలకు సన్నాహలు చేస్తున్నారని తెలుస్తోంది.
అంతా బాగానే వుంది. పవన్ మాట మీద వుంటారా అన్నది అనుమానం. ఉండటానికి వీలు అవుతుందా అని అనుమానం. ఎందుకంటే ఉపముఖ్యమంత్రిగా ఏ క్షణం ఏ పని పడుతుందో తెలియదు. అందువల్ల ఎప్పుడు షెడ్యూలు ఉంటుందో,ఉండదో తెలియదు.
హరి హర అంటే ఓకె, కొద్ది వర్క్ కనుక ఏదో ఒకటి చేస్తారు. ఓజి అలా కాదు. విదేశీ షూట్ కూడా వుంది. మరి దానిని ఏం చేస్తారో? సిజి లతో మేనేజ్ చేస్తారో చూడాలి. ఇటీవల బాడీ డబుల్ అనేది బాలీవుడ్ మాదిరిగా తెలుగులోనూ పెరిగింది. చాలా సులువుగా బాడీ డబుల్ ను అందరూ వాడేస్తున్నారు. ఆ విధంగా కొంత వరకు మేనేజ్ చేయవచ్చు. ఏమైనా సరే, పవన్ బలంగా మనసు పెడితే తప్ప సినిమాలు పూర్తి కావు.
ఇవన్నీ ఇలా వుంటే మైత్రీ మూవీస్ సినిమా అలా వుండనే వుంది. అది అసలు వుంటుందో, వుండదో కూడా క్లారిటీ లేదు.
cheppindhe ennisaarlu chepthaavu venkat reddy ? valla kasthaalu evo vaallu padathaarule.
Pawan Kalyan ni edo okati anakapothe jaffa gadu payment ivvademo,
Utsaaa thagu venkat reddy