ఆర్జీవీ పెద్ద ప్లాన్ మీదే వున్నారు

అమితాబ్, నానా పటేకర్, మనోజ్ బాజ్ పాయ్, ఫాహిద్ ఫాజిల్ లాంటి నటులతో ఆర్జీవీ సంప్రదింపులు చేస్తున్నారని తెలుస్తోంది.

దర్శకుడు ఆర్జీవీ సీరియస్ గా కాస్త ప్రామిసింగ్ సినిమా చేసి చాలా కాలం అయింది. నాగ్ తో ఆఫీసర్ సినిమా తీస్తున్నపుడు చాలా మంది ఆశపడ్డారు. ఆర్జీవీ నుంచి మంచి సినిమా వస్తుందని. కానీ మరోసారి అభిమానులే రాంగ్ అని ప్రూవ్ చేసారు.

తరువాత ఆయనకు నచ్చిన సినిమాలు ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. పది మందో ఇరవై మందో చూస్తున్నారు. లేదంటే లేదు. ఇలాంటి టైమ్ లో ఆర్జీవీ సిండికేట్ అనే సినిమా ప్రయత్నాలు ప్రారంభించారు.

ఈ మేరకు వార్తలు కూడా వచ్చాయి. సిండికేట్ లో చాలా మంది నటులు వుంటారని, నాగ్, వెంకీ ఇలా చాలా పేర్లు వినిపించాయి. కానీ ఆర్జీవీ ప్లాన్ లో ఈ పేర్లు లేవని, వేరే పేర్లు వున్నాయని తెలుస్తోంది. అమితాబ్, నానా పటేకర్, మనోజ్ బాజ్ పాయ్, ఫాహిద్ ఫాజిల్ లాంటి నటులతో ఆర్జీవీ సంప్రదింపులు చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాలో మరి తెలుగు నటులు వుండరా అంటే, వుంటారు. కాస్త నోటెడ్ నటులు వుంటారా? వుంటే ఫుల్ లెంగ్త్ నా? స్పెషల్ రోల్ నా అన్నది తెలియాల్సి వుంది. ఈ సినిమా గురించి, సబ్జెక్ట్ గురించి పలువురు నటులతో ఆర్జీవీ చర్చలు సాగిస్తున్నట్లు మాత్రం తెలుస్తోంది.

11 Replies to “ఆర్జీవీ పెద్ద ప్లాన్ మీదే వున్నారు”

  1. ఎండిపోయిన బావి కి గిలక కట్టి నీళ్లు తీసుకుందాం అనుకుంటున్నావ్ కదా? టైం బొక్క . టికెట్ బొక్క. క్రియేటివిటీ చిప్ దొబ్బేసి చాలా కాలం అయ్యింది. నువ్వేదో లేపుతున్నావు కానీ ,ఆడు గాడ్ ఫాదర్ మూవీ ని తిప్పి తిప్పి మళ్లీ  తీస్తాడు అంతే .

Comments are closed.