తిరుపతి రాజకీయాల్లో టీటీడీ గోశాల చుట్టూ హైడ్రామా నడుస్తోంది. ఫోటోలు కూడా చూపించి మరీ.. గోశాలను కాస్తా గోవధశాలగా మార్చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి స్పష్టమైన ఆరోపణలు చేశారు. వాటికి జవాబు ఇవ్వడానికి.. టీటీడీ నానా పాట్లు పడుతోంది.
వైసీపీ హయాంలో గోశాల నిర్వహణ అలా జరిగింది, ఇలా జరిగింది.. నీటితొట్టెలు పాచిపట్టాయి.. పురుగుల దాణా పెట్టారు.. వంటి డొంకతిరుగుడు ఆరోపణలు చేస్తున్నారే తప్ప.. స్పష్టమైన కౌంటర్ ఎటాక్ ఇవ్వలేకపోతున్నారు.
తాజా పరిణామాల్లో గోశాల సందర్శనకు రావాలంటూ.. ఇరు పార్టీల నాయకులు ఒకరికొకరు సవాళ్లు విసురుకోవడమూ.. ఉద్రిక్త వాతావరణం ఏర్పడడమూ జరిగింది. పోలీసులు మాత్రం ఎప్పటిలాగానే.. అధికార పార్టీకి సహకరిస్తూ, వారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేశారనే అపకీర్తిని మూటగట్టుకున్నారు. ఈ హైడ్రామా ముగిసిన తర్వాత కూడా.. భూమన కరుణాకర రెడ్డి చాలా స్ట్రెయిట్ గా కూటమి పార్టీల నాయకులకు కొన్ని సవాళ్లు విసిరారు. ఆ సవాళ్లకు మాత్రం ఎవ్వరూ స్పందించడం లేదు.
వివరాల్లోకి వెళితే.. దమ్ముంటే గోశాల సందర్శనకు రావాలని.. తాము కూడా అక్కడకు వస్తామని కూటమి నాయకులు భూమనకు సవాళ్లు విసిరారు. బోర్డు సభ్యుడు, బిజెపి నేత భానుప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు తదితరులు అక్కడకు చేరుకున్నారు. అక్కడి నుంచి డైరక్టుగా భూమనకు ఫోను చేసి.. గోశాలకు రావాల్సిందిగా వారు రెచ్చగొట్టేలా మాట్లాడారు.
మరోవైపు భూమన కరుణాకరరెడ్డి గోశాల వరకు శాంతి ర్యాలీని ప్రకటించారు. ఆయన పిలుపును అందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీంతో పోలీసులు ఆయనను ఇంటివద్దనే అడ్డుకున్నారు. ర్యాలీగా వెళ్లడానికి వీల్లేదని అన్నారు. గన్ మెన్ లను మాత్రం వెంటబెట్టుకుని అయిదుగురికి మించకుండా వెళ్లాలని తొలుత చెప్పారు. ఆతర్వాత అసలు కదలనివ్వకుండా భూమనను అడ్డుకున్నారు.
భూమన కరుణాకర రెడ్డి అక్కడే రోడ్డు మీద పడుకుని తన నిరసన తెలియజేశారు. ఈలోగా ఎంపీ గురుమూర్తి మాత్రం విడిగా గోశాల వద్దకు వెళితే.. ఆయనను టీడీపీ నాయకులు ఉన్నచోటకు పోలీసులు అనుమతించలేదు. వారే సవాళ్లు చేసి పిలిచారు.. భూమనను అడ్డుకోగా ఎంపీ గురుమూర్తి వెళితే అనుమతించలేదు. వెనక్కు పంపేశారు. సవాలు స్వీకరించి వస్తే పోలీసులు అడ్డుకున్నారంటూ గురుమూర్తి అన్నారు.
ఆ తరువాత భూమన ప్రెస్ మీట్ పెట్టి.. ఇవాళ పోలీసులు నిర్బంధించిన తీరును ఎండగడుతూ.. తాను కూటమి నేతల సవాలుకు ఇప్పటికీ సిద్ధమేనని.. రేపైనా ఎల్లుండైనా మరెప్పుడైనా సరే.. వారు చెప్పిన రోజున తాను ఒక్కడినే వస్తానని దమ్ముంటే ఆ పార్టీ నాయకులు రావాలని స్ట్రెయిట్ సవాలు విసిరారు. ఈ సవాలుకు మాత్రం కూటమి శిబిరం నుంచి కనీస స్పందన కూడా లేదు. అందరూ కలిసి గోశాలవద్దకు వచ్చి రాద్ధాంతం చేసిన తర్వాత.. తాజా సవాలుకు అంతా సైలెంట్ అయిపోయారు.
కాగా, వైసీపీ నేతలు అయిదుగురికి మించకుండా గోశాల వద్దకు రావాలని నియమాలు ప్రవచించిన తిరుపతి పోలీసులు.. కూటమి నేతలు, కార్యకర్తలను మాత్రం గుంపులు గుంపులుగా అక్కడకు అనుమతించడం విశేషం.
కుక్క మొరుగుతోందని వదిలేసినట్టున్నారు..
ఒకప్పుడు పింక్ డైమండ్ అని అబద్ధాలు చెప్పారు.. ఇప్పుడు ఆ దేవుడిని ఫుల్లుగా వాడుకొంటున్నారు ..
మీ ఎదవ యవ్వారాలు జనాలకు ఒక క్లారిటీ ఉందని.. జనాలు చెప్పుకొంటున్నారు..
కు క్క మొరుగుతోందని వదిలేసినట్టున్నారు..
ఒకప్పుడు పింక్ డైమండ్ అని అబద్ధాలు చెప్పారు.. ఇప్పుడు ఆ దేవుడిని ఫుల్లుగా వాడుకొంటున్నారు ..
మీ ఎదవ యవ్వారాలు జనాలకు ఒక క్లారిటీ ఉందని.. జనాలు చెప్పుకొంటున్నారు..
Dramarayullu
“గొఱ్ఱెలు గోవుల గురించి మాట్లాడటం ” ఏంటీ??
అసలు సూత్రదారి “మాడామోహన రెడ్డి” అనే లంగా గాడు.. వాడిని బొక్కలో వేసి దె0గే టైం వచ్చింది
Niku anni viseshale ra GA..
Fake drama…typical ycheap tricks..siggu leni
వీడి బొంద! వీడు ఒక్కడు రాకుండా జనాన్ని వెసుకొని వెళ్ళి మొత్తం విషయాన్ని పక్కదారి పట్తించాలి అని చూసినప్పుడె వీడు ఒడిపొయాడు!
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు పవన్ నీ చూసి వీళ్లు కూడా రోడ్ మీద డ్రామా లు మొదలుపెట్టారు.