సీనియర్ హీరో మళ్లీ పెళ్లి పనుల్లో బిజీ

గతేడాది పెద్ద కూతురు పెళ్లి చేశారు సీనియర్ హీరో అర్జున్. ఈ ఏడాది ఆయన తన చిన్న కూతురు పెళ్లి చేయబోతున్నారు.

గతేడాది పెద్ద కూతురు పెళ్లి చేశారు సీనియర్ హీరో అర్జున్. ఈ ఏడాది ఆయన తన చిన్న కూతురు పెళ్లి చేయబోతున్నారు. ఈ మేరకు ఎంగేజ్ మెంట్ పూర్తయింది. ఇటలీలోని అందమైన లొకేషన్ లో అర్జున్ సర్జా చిన్న కూతురు అంజనా నిశ్చితార్థ వేడుక పూర్తయింది.

ఇటలీలోనే ఈ వేడుక చేయడానికి ఓ కారణం ఉంది. అంజనా ప్రేమించింది ఇటలీ అబ్బాయినే. అంతేకాదు, దాదపు 13 ఏళ్లుగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. నిశ్చితార్థం పూర్తయిన సందర్భంగా అంజనా పెట్టిన పోస్టు ఈ విషయాన్ని పరోక్షంగా నిర్థారిస్తోంది.

పెద్ద కూతుర్ని నటుడు రామయ్య కొడుకు ఉమాపతికి ఇచ్చి పెళ్లి చేశారు అర్జున్. వాళ్లది ప్రేమ వివాహమే. ఇక చిన్న కూతురు ఏకంగా విదేశీయుడ్ని ప్రేమించింది. ఈ పెళ్లికి కూడా అర్జున్ సర్జా అంగీకరించారు.

ప్రస్తుతం అర్జున్ చిన్నకూతురు అంజనా, సర్జా వరల్డ్ అనే కంపెనీని స్థాపించి, దానికి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వీళ్ల నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.