విశాఖ నుంచి విజయవాడకు వెళ్ళే విమాన సర్వీసులను రద్దు చేయడంతో విశాఖ విమాన ప్రయాణీకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత పది నెలల కాలంలో విజయవాడ మాత్రమే కాదు ఇతర ముఖ్య ప్రాంతాలకు వెళ్ళే సర్వీసులు కూడా రద్దు అయ్యాయి.
దాంతో విశాఖ విమాన సేవలు మీద పౌరుల నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. ఉత్తరాంధ్ర కు చెందిన వారే పౌర విమాన యాన మంత్రిగా ఉన్నా కూడా తమకు ఏమిటి ఈ పరిస్థితి అని అంతా అంటున్నారు.
ఈ క్రమంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏపీ టూ ఏపీ వయా తెలంగాణా అని ట్వీట్ చేశారు. ఆయన ప్రజల బాధలను దృష్టిలో ఉంచుకునే ఈ ట్వీట్ చేసినా అది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో ఆయన మీద హైకమాండ్ సీరియస్ అయింది అని వార్తలు వచ్చాయి.
ఇపుడు ఆయనకు మరో ఎమ్మెల్యే తోడు అయ్యారు. బీజేపీకి చెందిన విష్ణు కుమార్ రాజు కూడా విశాఖలో విమానాల సర్వీలు రద్దు అయ్యాయని దీని వల్ల విజయవాడకు డైరెక్ట్ గా వెళ్ళలేకపోతున్నామని అన్నారు.
ఎవరూ బయటకు చెప్పడం లేదు కానీ వ్యాపార వర్గాలు పారిశ్రామిక వర్గాలు సతమతమవుతున్నాయని ఆయన చెబుతున్నారు. విశాఖ విజయవాడల మధ్యన సర్వీసులకు ప్రయాణీకుల తాకిడి బాగానే ఉంటుందని అయినా రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విధంగా చూస్తే గంటాకు తోడుగా రాజు గారు కూడా గొంతు కలిపారు అని అంటున్నారు. గంటా మీద టీడీపీ ఆగ్రహించిందని ప్రచారం సాగింది. విష్ణు కుమార్ రాజు మీద బీజేపీ పెద్దలు ఆగ్రహిస్తారా లేక ఇద్దరు ఎమ్మెల్యేలు ఎత్తిన కీలక సంస్యను పరిష్కరించేలా చూస్తారా అని అంతా తర్కించుకుంటున్నారు.
elections tarvaata vizag real estate drain lo kalisipoyindi. idi fact. daaniki todu pelipotunna electricity bills. avi choosi janam pandaga chesukovala?