అంత జ‌రుగుతున్నా.. అమెరికానే ముద్దు, ఇదే వాస్త‌వం!

అమెరికా అనే డ్రీమ్ భార‌తీయుల్లో ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇది పెరుగుతూ ఉంది.

అమెరికాలో ప‌రిణామాలు సానుకూలంగా లేవు, అమెరికాకు వ‌ల‌స వెళ్లాల‌నుకోవ‌డం తెలివైన ప‌ని కాదు, దాదాపు ద‌శాబ్ద‌కాలంగా ఈ మాట ఇండియాలోని తెలుగు వాళ్ల మ‌ధ్య వినిపిస్తూ ఉంది. ప్ర‌త్యేకించి ట్రంప్ క్రితం సారి అధ్య‌క్షుడు అయిన‌ప్పుడు, అంత‌కు ముందు కూడా ఇలాంటి మాట‌లు వినిపించాయి, వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇవ‌న్నీ పైపేకే! అమెరికన్ డ్రీమ్ ఇండియ‌న్స్ ను ఇప్ప‌టికీ నిద్ర లేకుండా చేస్తూ ఉంది. అక్క‌డి ప‌రిణామాలు క‌ల‌త‌ల‌త‌ను క‌లిగించేలా ఉన్నాయ‌నే హెచ్చ‌రిక‌లు వినిపిస్తున్నా, పైపైకి అమెరికన్ డ్రీమ్ అంత బాగోలేద‌నే విశ్లేష‌ణ‌లు వినిపిస్తూ ఉన్నా.. ప్ర‌తియేటా ఇండియా నుంచి విద్య కోసం అమెరికాకు వెళ్లే వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతూ ఉంది.

ఒక గ‌ణాంకం ప్ర‌కారం.. 2022-23 ప్ర‌కారం ఇండియా నుంచి అమెరికాకు దాదాపు రెండు ల‌క్ష‌లా అర‌వై ఎనిమిది వేల మంది విద్యార్థులు వెళ్లారు. అయితే 2023-24 విద్యా సంవ‌త్స‌రంలో అమెరికాలో విద్యాభ్యాసం కోసం వెళ్లిన వారి సంఖ్య ఏకంగా మూడు ల‌క్ష‌లా ముప్పై వేల మంది వ‌రకూ ఉంది! అంటే అంత‌కు ముందు సంవ‌త్స‌రంతో పోలిస్తే పెరిగిన విద్యార్థుల సంఖ్య అర‌వై వేల వ‌ర‌కూ ఎక్కువ ఉంది!

అమెరికాలో ప‌రిణామాలు బాగోలేవు, అటు వైపు వెళ్ల‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం అనే విశ్లేష‌ణ ప్ర‌ముఖంగా వినిపించ‌డం మొద‌లై దాదాపు ప‌దేళ్లు గ‌డుస్తున్నా ఏ యేటికాయేడు అమెరికాకు వెళ్లి చ‌ద‌వాల‌నే వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతూ ఉంది. అది కూడా క్లిష్ట‌మైన ప‌రిస్థితులు ఉన్నాయ‌నే సంవ‌త్స‌రాల్లో ఏకంగా అర‌వై వేల మంది అద‌నంగా కొత్త‌గా అక్క‌డ‌కు వెళ్లారంటే ప‌రిస్థితిని అంచ‌నా వేసుకోవ‌చ్చు!

అయితే రేపటి విద్యా సంవ‌త్స‌రం అయినా ఇది త‌గ్గుతుంది అనుకోవ‌డానికి ఏమీ లేదు! ఒక‌వైపు ట్రంప్ అధ్య‌క్షుడు అయ్యాకా విద్యార్థుల‌ను ప్ర‌త్యేకంగా ల‌క్ష్యంగా చేసుకున్నారు. భార‌తీయ విద్యార్థులు అక్క‌డ‌కు వెళ్లి పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ, ఇంకా కొంద‌రు ఫుల్ టైమ్ లో కూడా ప‌ని చేస్తూ అక్క‌డి వారి ఉపాధికి గండి కొడుతున్నార‌నే లెక్క‌ల‌తో వీరిపై అమెరిక‌న్ ప్ర‌భుత్వం దృష్టి పెట్టి కూడా చాలా కాలం అవుతూ ఉంది. చ‌దువుకునే వాళ్లు చ‌దువుకోవాలి త‌ప్ప ఉద్యోగాల జోలికి వెళ్ల‌కూడ‌ద‌నే నియమం మొద‌టి నుంచి ఉన్నా.. అప్పుడు ప‌ట్టించుకోలేదు. దీంతో పార్ట్ టైమ్ ల‌తో భార‌తీయ విద్యార్థులు త‌మ చ‌దువుల వ్య‌యాన్ని సునాయాసంగా సంపాదించుకుంటూ వ‌చ్చారు. అయితే ఇప్పుడు మ‌రింత స్ట్రిక్ట్ గా మారుతూ ఉంది ప‌రిస్థితి.

ఇదే కాకుండా.. ఎంఎస్ త‌ర్వాత కొంత‌కాలం అమెరికాలో ఉండి, విద్య‌కు సంబంధించిన వృత్తిని చేయ‌డానికి అవ‌కాశాన్ని కూడా ట్రంప్ పూర్తిగా ఎత్తి వేసేలా ఉన్నాడు. ఇప్ప‌టికే ఆ నియ‌మాన్ని ప్ర‌క‌టించాడు కూడా! అయిన‌ప్ప‌టికీ ఇండియా నుంచి అమెరికా వైపు ప‌రుగులు ఆగుతాయ‌ని అనుకోవ‌డానికి ఏమాత్ర‌మే లేదు! అంత‌కు ముందు ఏడాదితో పోలిస్తే.. గ‌త ఏడాది అర‌వై వేల మంది అద‌నంగా అమెరికాకు వెళ్లారు చ‌దువుల పేరిట‌. వ‌చ్చే ఏడాది ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశ‌మే ఉంటుంది త‌ప్ప త‌గ్గే ప‌రిస్థితి ఉండ‌క‌పోవ‌చ్చు.

ఏదేమైనా.. అమెరికా అనే డ్రీమ్ భార‌తీయుల్లో ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇది పెరుగుతూ ఉంది. ప్ర‌త్యేకించి ఇక్క‌డ ఆర్థిక శ‌క్తి కాస్త పెరిగిన క్లాస్ లో అమెరికా చ‌దువు ప‌ట్ల కొత్త ఉత్సాహం వ‌స్తూ ఉంది. ఇండియాలో ఇప్పుడు ఎల్కేజీ చ‌దువుకే రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల ఖ‌ర్చు పెట్టే ప‌రిస్థితి ఉంది. అలాంటిది ఇంజ‌నీరింగ్ కోస‌మో, ఎంఎస్ కోస‌మో.. త‌లతాక‌ట్టు పెట్టి అయినా అర కోటో, కోటి రూపాయ‌లో పెట్ట‌డానికి వెనుకాడ‌ని వారు చాలా మంది త‌యార‌వుతూ ఉన్నారు. దీంతో రానున్న కాలంలో కూడా అమెరికా డ్రీమ్ తో అటు వైపు వ‌స‌ల కొన‌సాగే ప‌రిస్థితే త‌ప్ప త‌గ్గే ప‌రిస్థితి ఏ మాత్రం క‌న‌ప‌డ‌టం లేదు! ఇది నిష్టూర‌మైన నిజం!

విప‌రీత‌మైన జ‌నాభా.. సౌక‌ర్యాల లేమి, ప‌రిస్థితులు ఆశాల‌ను రేకెత్తించ‌లేక‌పోవ‌డం ఒక ద‌శ‌లో ఇండియ‌న్స్ ను అమెరికా వైపు వ‌ల‌స‌ల‌కు మొగ్గేలా చేసింది. అయితే ఇప్పటికీ ఇండియాలో అలాంటి ప‌రిస్థితులే ఉన్నాయ‌నుకోవాలి! కొన‌సాగుతున్న ఈ త‌ర‌హా వ‌ల‌స‌లు, అప్పులు చేసి అయినా అమెరికాకు వెళ్లి పోతే ఆ త‌ర్వాత అక్క‌డ ఏదో ఒక‌టి చేసుకోవ‌చ్చు అనే ప‌రిస్థితి ఉంద‌నే అనుకోవాలి. బేడీ లు వేసి విమానాల‌ను ఎక్కించి పంపిస్తున్నా.. అమెరికా ఇప్ప‌టికీ ఆక‌ర్షిస్తూ ఉంది భార‌తీయుల‌ను! కొంద‌రు ఆర్థిక నిపుణులేమో.. అబ్బే ఇండియా భ‌విష్య‌త్తు అంటూ మాట్లాడుతున్నా.. భార‌తీయ యువ‌త‌రంలోనే ఆ న‌మ్మ‌కం క‌లుగుతున్న‌ట్టుగా లేదు!

యువ‌త‌రంలోనే కాదు.. చాలా మంది త‌ల్లిదండ్రుల‌ది కూడా ఇదే ప‌రిస్థితి. ఎంత జాతీయ‌వాదం గురించి మాట్లాడేవారు కూడా, అమెరికా అవ‌కాశం అంటే .. అక్క‌డ‌ప‌రిస్థితుల‌ను లెక్క‌చేయ‌క ఎగిరిగంతేసే ప‌రిస్థితే ఇండియాలో కొన‌సాగుతూ ఉంది!

13 Replies to “అంత జ‌రుగుతున్నా.. అమెరికానే ముద్దు, ఇదే వాస్త‌వం!”

  1. గతంలో కంప్యూటర్లు ఏమైనా కూడు పెడతాయా అన్న మహానేత లు ఉన్నారు మన దగ్గర..

      1. పోనీ మీరు చెప్పండి వ్యవసాయం లాభసాటి అని చెప్పి ఊళ్లలో నలుగురు రైతులు కూర్చుని పిచ్చ పాటి మాట్లాడుకొనే వద్దకు వెళ్లి మీ అమూల్య అభిప్రాయాన్ని చెప్పండి రియాక్షన్ కూడా చూసుకోండి వ్యవసాయ దారుడుకు పిల్లను కూడా ఎవరు ఇచ్చి పెళ్లిచేయటలేదు అది వ్యవసాయానికి వున్నా గౌరవం

  2. We can’t blame anyone as opinions change from time to time, based on the situation. Change is inevitable bro. It’s a natural part of life, and it can be a catalyst for growth.

  3. In India quality of life is not good, nothing difference if you have 1crore or 100 crore. Worst roads even if you buy Benz car. Not suitable climate for outdoor activities.

  4. మన గ్రేడ్ ఆంద్ర యాజమాన్యం కూడా

    అమెరికా పౌరసత్వం తిరిగి ఇచ్చేసి తట్ట బుట్ట సర్దుకుని ఇండియా తిరిగి వెచ్చేశారా

    లేక

    ఇంకా అక్కడే ఉన్నారా?

    ముందు ఆ మాట చెప్పి , అమెరికా మీద రాయండి.

  5. There’s no future for India as long as it’s stuck in Regionlaism, Limitless socialism, & appeasement secularism. Taxes are rising drastically to keep the country going while feeding these 3 evils. Modi is failing. Judiciary is waste.

  6. ఇండియాలో వారికి భవిష్యత్తు కనిపించడం లేదు.

    భారతదేశంపైన మమకారంతో వారు వచ్చి ఏదో సంస్థ మొదలు పెట్టాలంటే ఇక్కడ రాజకీయ నాయకులకు అమ్యామ్యాలు చదివించుకోవాలి. 

    ఒక పార్టీ అధికారంలో ఉండగా ఆమ్యామ్యాలు ఇస్తే సరిపోదు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇచ్చుకోవాలి. ఇవ్వలేదంటే ప్రభుత్వాలకు పర్యావరణం పరిరక్షణ గుర్తుకు వస్తుంది.

    అభివృద్ధిని కనిపించిన చోట్ల దానిని తరిమి వేసే దాకా నిద్దరపోని మమతా బెనర్జీ వంటి నాయకులకు కొదవలేదు మన దేశంలో.

    ఇక్కడ ఉండి నీతిగా నిజాయితీగా ఎల్లకాలం మధ్య తరగతి బ్రతుకులు బ్రతికే కన్నా  పరాయి దేశంలో అదే నీతి నిజాయితీలతో సంపాదిస్తూ ఎగువ మధ్య తరగతికి ఎగబాకుతున్నారు. 

    తాము సంపాదించిన సొమ్ము ఇండియాలో ఆస్తుల విక్రయం చేసి ఇక్కడ అభివృద్దికి తోడ్పడుతున్నారు. 

  7. అమెరికా చేసిన పనే భారతదేశం కూడా చేయాలి.

    ఈ దేశానికి అక్రమంగా తరలివచ్చి, ఈ దేశ సంపదను తేరగా అనుభవిస్తు ఈ దేశంలో అల్లర్లు సృష్టిస్తున్న బంగ్లాదేశీయులను, రోహింగ్యాలను తరిమి తరిమి కొట్టాలి ఇండియా నుంచి.

    అప్పుడే మమతా బెనర్జీ లాంటి నాయకుల పొగరు అణుగుతుంది.

Comments are closed.