నానిని ఆ విషయంలో శభాష్!

నాని సినిమాలకు ప్రచారం ఓ రేంజ్‌లో ఉంటుంది. ఎక్కడా కక్కర్తి పడరు, ఎక్కడా రాజీ పడరు.

మన సినిమా హీరోలు చిత్రంగా ఉంటారు. తమది కాకపోతే కాశీ వరకు డేకించేస్తాం అంటారు. తమది అయితే బంగారం అని దాచేసుకుంటారు. వేరేవాళ్ల ప్రొడక్షన్ అయితే చిత్తానుసారం ఖర్చు చేయిస్తారు. పబ్లిసిటీ ఇంకా ఇంకా కుమ్మేయాలి అంటారు. అదే స్వంత సినిమా అయితే క్వాలిటీ అంతంతమాత్రంగా ఉంటుంది. పబ్లిసిటీ నీరసంగా ఉంటుంది.

కానీ ఇందుకు పూర్తిగా మినహాయింపు నాని. హీరోగా సంగతి సరే, నిర్మాతగా కూడా అలాగే ఉంటారు. నాని సినిమాలకు ప్రచారం ఓ రేంజ్‌లో ఉంటుంది. ఎక్కడా కక్కర్తి పడరు, ఎక్కడా రాజీ పడరు. సినిమా నిర్మాణం కూడా అలాగే ఉంటుంది. ఎంత ఖర్చు కావాలో అంతా పెడతారు.

హిట్ 3 సినిమాకు సాగుతున్న ప్రచారం చూడండి. సింపుల్‌గా ఎక్కడో ఒక దగ్గర ఇంటర్వ్యూలు కానిచ్చేయవచ్చు. అలా కాకుండా ఓ ఫ్లోర్‌ మొత్తం తీసుకుని, అయిదారు సెటప్‌లు డిజైన్‌ చేయించారు. ఇతర రాష్ట్రాల నుంచి సెలెక్టివ్‌గా ఇన్‌ఫ్లుయెన్సర్లను రప్పించి, వారికి ఆతిధ్యం ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించారు. ఇదంతా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం.

సినిమా హీరోల స్వంత నిర్మాణాలు, స్వంత సినిమాల పబ్లిసిటీకి నాని స్వంత బ్యానర్ నిర్మాణానికి, పబ్లిసిటీకి ఉన్న తేడా గమనిస్తే నాని స్పెషాలిటీ అర్థమవుతుంది.

5 Replies to “నానిని ఆ విషయంలో శభాష్!”

  1. సిగ్గుందా అసలు .. ఛీ.. ఛీ.. కడుపుకు అన్నం తింటున్నారా.. ఇంకేమైనా తింటున్నారా .. దేశం మొత్తం, మీడియా మొత్తం ఉగ్రదాడుల మీద రగిలిపోతుంటే, మీ దగ్గర నుండి ఒక్క ఆర్టికల్ రాకపోవడం అతి దారుణం, ఆ మరణాల్లో మీకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఆ నొప్పి తెలిసేది.. అన్న కి భజన చేసి చేసి మీకు కూడా హిందువులంటే వ్యతిరేకత పెరిగిపోయినట్టుంది. కొంచెం సోయలో ఉండండి, తమరు పుట్టిన దేశంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుసుకొని బాధ్యత గా ఆర్టికల్స్ రాయండి

    1. You can’t blame. He has limited burra. దాంట్లో పొగడడానికి YCP తెగడడానికి సినిమా వాళ్ళు, TDP, JSP. తను చెప్పాల్సింది చెప్పిన అందరు అనుకుంటున్నారు అని రాస్తారు.

Comments are closed.