బాబు.. జ‌గ‌న్‌కు ఆ ఐఏఎస్ కోవ‌ర్డ్‌!

జ‌గ‌న్‌కు కోవ‌ర్ట్‌గా ప‌ని చేస్తున్నాడ‌నే అనుమానం టీడీపీ నేత‌ల్లో రావ‌డానికి బ‌ల‌మైన కార‌ణం వుంద‌ని అంటున్నారు.

వైసీపీ హ‌యాంలో కీల‌క పోస్టులో ప‌నిచేసిన ఓ ఐఏఎస్ అధికారి గ‌తంలో ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడికి ప్ర‌భుత్వంలో ఏం జ‌రుగుతున్న‌దో ఎప్ప‌టిక‌ప్పుడు డాక్యుమెంట్స్‌తో స‌హా చేరేవేశార‌ని ఆల‌స్యంగా వైసీపీ పెద్ద‌లు గుర్తించారు. ఒక మాట‌లో చెప్పాలంటే చంద్ర‌బాబుకు కోవ‌ర్ట్‌గా విజ‌య‌వంతంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన‌ట్టు వైసీపీ నేత‌ల అభిప్రాయం.

వైసీపీ హ‌యాంలో ఆడుదాం ఆంధ్రా క్రీడ‌ల నిర్వ‌హ‌ణ బాధ్య‌త ఆ ఐఏఎస్ అధికారిదే. అందులో అవినీతి జ‌రిగింద‌ని కూట‌మి నేత‌లు ప‌దేప‌దే ఆరోప‌ణ‌లు చేస్తుంటారు. నిజంగా ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో విచారిస్తే, ఇరుక్కునేది ఆ ఐఏఎస్ అధికారే. కానీ ఆయ‌న్ను జైలుకు పంప‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా లేదు. ఎందుకంటే, గ‌త ప్ర‌భుత్వంలో ఏం జ‌రుగుతున్నాయో ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం చేర‌వేశాడ‌నే కృత‌జ్ఞ‌త‌తో ఆయ‌న్ను కూట‌మి స‌ర్కార్ సీఎంవోలోకి తీసుకుంది.

అయితే ఇప్పుడాయ‌న వైఎస్ జ‌గ‌న్‌కు కోవ‌ర్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అనుమానాలు కూట‌మి నేత‌ల్లో ఉన్నాయి. కోవ‌ర్ట్ స్వ‌భావం క‌లిగిన ఆ ఐఏఎస్ అధికారి, నాడు జ‌గ‌న్ ప్రాధాన్యం ఇచ్చినా క‌నీస విశ్వాసం చూప‌లేద‌ని, ఇప్పుడు మాత్రం నిజాయితీగా ఎలా వుంటార‌నే ప్ర‌శ్న టీడీపీ నేత‌ల నుంచి వ‌స్తోంది. ఇదే విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబుతో కూడా చెప్పిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

గ‌తంలో ఆ ఐఏఎస్ అధికారి చిత్తూరు క‌లెక్ట‌ర్‌గా ప‌ని చేశారు. కూట‌మి అధికారంలోకి రాగానే, చ‌క్క‌గా కీల‌క పోస్టు ద‌క్కించుకున్నారాయ‌న‌. వైసీపీ హ‌యాంలో ముఖ్య పోస్టుల్లో ప‌నిచేసిన అధికారుల్ని, జ‌గ‌న్‌తో అంట‌కాగార‌నే కార‌ణంతో ప‌క్క‌న పెట్ట‌డం చూశాం. కానీ ఆ అధికారి విష‌యంలో మాత్రం మిన‌హాయింపు వెనుక మ‌త‌ల‌బుపై ఐఏఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. కానీ జ‌గ‌న్‌కు కోవ‌ర్ట్‌గా ప‌ని చేస్తున్నాడ‌నే అనుమానం టీడీపీ నేత‌ల్లో రావ‌డానికి బ‌ల‌మైన కార‌ణం వుంద‌ని అంటున్నారు. అదేంటో త్వ‌ర‌లోనే తెలిసే అవ‌కాశం వుంది.

11 Replies to “బాబు.. జ‌గ‌న్‌కు ఆ ఐఏఎస్ కోవ‌ర్డ్‌!”

  1. ja*** అనే నీచుడు అన్ని వ్యవస్థలని భ్రష్టు పట్టించాడు!! నువ్వదేదో ఘనకార్యం లాగా రాయటం ఏంటి ఎంకి కామెడీ గా!!

  2. గాలి జనార్ధన్. అదే మన మహానేత  గారి స్నేహితుడు కు జైలు శిక్ష. విధించగర్. అప్పుడు ఆ గనులు allot చేసింది. సబిత .ఇంద్ర రెడ్డి.   అప్పటి cm. ఎవరో చెప్పక్కరలేదు

  3. etthese mundara brand esi nookeyadame ga. ade nadustundi. annitiki vaadi covert veedi covert anadam toseyadam. inko 1 month lo talliki vandanam veyakapothe voorlallo kootami batch ki vuntundi naa saami ranga. vaddu le. silver screen meeda choosukovacchu reaction.

  4. Bongu emi kaadu..

    whene power transfers these kind of people always exists and it’s open truth. Even if this IAS didnt, some other would have been. 

    so ga Venkat, ee article ki boodida tappa emi raladu..

Comments are closed.