పవన్ కల్యాణ్ సినిమా రీ-స్టార్ట్

ఆయనిచ్చిన మాట ప్రకారం, ఓజీ యూనిట్ ఇతర నటీనటులతో షూటింగ్ మొదలుపెట్టింది.

ఎప్పుడైతే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తయితే, ఓజీ సినిమా కూడా త్వరలోనే రీస్టార్ట్ అవుతుందని అప్పుడే అంతా అనుకున్నారు. అంతా ఊహించినట్టుగానే ఓజీ సినిమాకు మోక్షం లభించింది.

దాదాపు 5 నెలలుగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు రీస్టార్ట్ అయింది. ఓజీ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్టు యూనిట్ ప్రకటించింది. అయితే పవన్ కల్యాణ్ ఇంకా సెట్స్ పైకి రాలేదు.

ఆయనిచ్చిన మాట ప్రకారం, ఓజీ యూనిట్ ఇతర నటీనటులతో షూటింగ్ మొదలుపెట్టింది. ఈ నెలలోనే పవన్ కల్యాణ్ సెట్స్ లో జాయిన్ అవుతారు. వీలైనంత త్వరగా ఓజీ షూట్ పూర్తిచేస్తానని ఆయన యూనిట్ కు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ముంబయి బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ క్రైమ్ డ్రామాగా వస్తోంది ఓజీ. ఇందులో పవన్ కల్యాణ్ ఓజాస్ గంభీర అనే గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్.

సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయింది. పవన్ తో సంబంధం లేని సన్నివేశాలన్నింటినీ పూర్తిచేశారు. పవన్ సెట్స్ పైకి వచ్చిన 2-3 వారాల్లో మొత్తం షూట్ పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.