టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం, ఆయన భార్య ప్రముఖ నటి అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
“వారు రికార్డులు, మైలురాళ్ల గురించి మాట్లాడతారు… కానీ నీవు చూపించని కన్నీళ్లు, ఎవరూ చూడని పోరాటాలు, ఈ ఫార్మాట్‌కి నీవు చూపిన నిస్వార్థ ప్రేమను నేనెప్పటికీ మర్చిపోలేను. ఈ ప్రయాణం నిన్ను ఎంతగా పరీక్షించిందో నాకు తెలుసు. ప్రతి టెస్ట్ సిరీస్ అనంతరం నీలో వచ్చిన మార్పులను చూసే అవకాశం నాకు లభించింది – అది నాకు గౌరవంగా అనిపించింది. నీవు వైట్ జెర్సీలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతావని ఎప్పుడో ఊహించాను. కానీ నీవు ఎప్పుడూ నీ మనసు మాటే వినేవాడివి. ఈ గుడ్‌బైకి నీవు అర్హుడివి” అంటూ అనుష్క తన సోషల్ మీడియాలో భావోద్వేగంగా పేర్కొన్నారు.
“ప్రతి మగాడు విజయం వెనక ఓ మహిళ ఉంటుంది” అన్న మాటను మరోసారి నిజం చేశారు అనుష్క శర్మ. భార్యగా, తల్లిగా కుటుంబ బాధ్యతలు పోషించడమే కాకుండా, విరాట్ కోహ్లీ విజయాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, కోహ్లీకి ధైర్యం చెప్పుతూ ఆయన వెన్నంటి నిలిచారు. విరాట్ ఫామ్ కోల్పోయిన సందర్భాల్లో, కొంతమంది అభిమానులు అనుష్కపై విమర్శలు చేసినా, ఆమె స్థిరంగా అతనికి మద్దతుగా నిలిచారు.
సుదీర్ఘ ప్రేమాయణం అనంతరం విరాట్, అనుష్కలు 2017లో ఇటలీలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇవాళ టెస్ట్ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పారు. 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన కోహ్లీ, ఇప్పటివరకు 123 టెస్ట్ మ్యాచ్‌లలో 9,230 పరుగులు చేశారు. మంచి ఫామ్‌లో ఉండగానే, ఆయన రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం అభిమానులకు పెద్ద షాకే. ఇటీవలే రోహిత్ శర్మ కూడా టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
You are an inspiration to lakhs of people like me, all the very best for your future endeavours Sir
Jagan anna venuka kadu, mundu, Jaganna mundu Bharathi vundi !!!