మహేష్ మూవీ.. ఈ సారైనా క్లారిటీ వస్తుందా?

మహేష్-రాజమౌళి సినిమాకు సంబంధించి చాలా వర్క్ నడుస్తోంది. కానీ ప్రేక్షకులకు మాత్రం ఒక్కటంటే ఒక్క అప్‌డేట్ లేదు.

తన శైలికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు రాజమౌళి. సినిమా ప్రకటన లేదు, ప్రెస్ మీట్ లేదు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే కొబ్బరికాయ కొట్టి, రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టేశాడు.

రేపోమాపో యూనిట్ మొత్తం ఆఫ్రికా అడవులకు షిఫ్ట్ అవ్వబోతోంది. ఈ మేరకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ కు కూడా వచ్చి ఫార్మాలిటీస్ పూర్తిచేశాడు రాజమౌళి.

అటు మహేష్ కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం శారీరకంగా-మానసికంగా సన్నద్ధమై ఉన్నాడు. ఎందుకైనా మంచిదని కాస్త ముందుగానే ఓ విదేశీ పర్యటన కూడా కానిచ్చేశాడు. ఇక హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా మళ్లీ హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తిచేసిన ఆమె, మరో షెడ్యూల్ కు రెడీ అవుతోంది.

ఇలా మహేష్-రాజమౌళి సినిమాకు సంబంధించి చాలా వర్క్ నడుస్తోంది. కానీ ప్రేక్షకులకు మాత్రం ఒక్కటంటే ఒక్క అప్‌డేట్ లేదు. మహేష్ లేదా రాజమౌళి ఇప్పటివరకు నోరు తెరిచి మాట్లాడింది లేదు.

చివరికి సుమ లాంటి సీనియర్ యాంకర్ నిండు సభలో నేరుగా రాజమౌళిని ప్రశ్నించినప్పటికీ, నవ్వుతూ సమాధానం దాటేశాడు తప్ప ఎలాంటి ప్రకటన చేయలేదు జక్కన్న. ఇప్పుడు మరోసారి అలాంటి సందర్భమే రాబోతోంది.

ఎల్లుండి తన కొత్త సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టుకున్నాడు నాని. ఆ వేడుకకు రాజమౌళిని స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించాడు. కనీసం ఈసారైనా రాజమౌళి, తను చేస్తున్న మహేష్ బాబు సినిమాపై ఓ ప్రకటన చేస్తాడని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

2 Replies to “మహేష్ మూవీ.. ఈ సారైనా క్లారిటీ వస్తుందా?”

  1. ento nee expectations? oka international level cinema gurinchi details oka tupaki and lapaki function lo chepthaaraa? burra budhi ledhaa venkat reddy?

Comments are closed.