థియేటర్లకు కాస్త ఊపిరి

హర్రర్ జానర్ నచ్చేవారు ఓదెల 2 ను ఎంచుకోవచ్చు. కథ ఓల్డ్ మోడల్ అయినా, ఫైట్లు, స్టార్ కాస్ట్ ఇవన్నీ కలిసి సన్నాఫ్ వైజయంతి కి చిన్న కలర్ లుక్ ఇచ్చాయి.

దాదాపు రెండు మూడు నెలలుగా డల్ గా వున్నాయి థియేటర్లు రెండు రాష్ట్రాల్లో. సినిమాలు వస్తున్నాయి కానీ కనీసపు ఓపెనింగ్ అందుకోవడం లేదు. సిద్దు జొన్నలగడ్డ సినిమా జాక్ వస్తుంటే ఎగ్జిబిటర్లు కాస్త ఆశపడ్డారు. కానీ ఆ సినిమాకు కూడా మినిమమ్ ఓపెనింగ్ రాలేదు. దాంతో థియేటర్లు దిగాలు పడ్డాయి.

ఈవారం రెండు సినిమాలు వచ్చాయి. ఓదెల 2, అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈవారం ఎలా వుంటుంది అని ఆశగా చూసారు ఎగ్జిబిటర్లు. పైగా వచ్చేవారం సారంగపాణి జాతకం సినిమా వుంది. దానికి బయ్యర్లు నాలుగు డబ్బులు కట్టాలంటే ఈవారం సినిమాలు ఆడాలి.

ఇలాంటి పరిస్థితుల్లో విడుదలయ్యాయి ఈవారం సినిమాలు. ఓదెల 2 సినిమా విడుదల రోజున ఫరవాలేదు అనే ఓపెనింగ్ అందుకుంది. గురువారం కావడం వల్ల ఆశించిన మేరకు ఓపెనింగ్ రాలేదు. రెండో రోజు అర్జున్ సన్నాఫ్ వైజయంతి విడుదలైంది. ఈ ఎఫెక్ట్ ఓదెల 2 మీద పడింది. కానీ సన్నాఫ్ వైజయంతి మాత్రం కాస్త రీజనబుల్ ఓపెనింగ్ అందుకుంది. చాలా సెంటర్లలో ఫుల్స్ పడ్డాయి. రెండు సినిమాలకు కాస్త డివైడ్ టాక్ నే వచ్చింది.

అందువల్ల శనివారం నాడు ఏ సినిమాను జనం సెలెక్ట్ చేసుకుంటారు అన్నదాన్ని బట్టి వుంటుంది అసలు సంగతి. హర్రర్ జానర్ నచ్చేవారు ఓదెల 2 ను ఎంచుకోవచ్చు. కథ ఓల్డ్ మోడల్ అయినా, ఫైట్లు, స్టార్ కాస్ట్ ఇవన్నీ కలిసి సన్నాఫ్ వైజయంతి కి చిన్న కలర్ లుక్ ఇచ్చాయి. అందువల్ల అది ఎడ్జ్ తీసుకుంటుందా అన్నది రేపు చూడాలి.

One Reply to “థియేటర్లకు కాస్త ఊపిరి”

Comments are closed.