చాలా హైప్ క్రియేట్ అయిన విజయసాయిరెడ్డి సిట్ విచారణ పూర్తయింది. విజయసాయిని విచారణకు పిలిచారనగానే పచ్చమీడియా అత్యుత్సాహం చూపించింది. విచారణ తర్వాత.. మీడియాతో మాట్లాడుతూ ఆయన కూడా ఇదే విషయం ప్రస్తావించారు. ఆయన విచారణ తర్వాత కూడా పచ్చమీడియా అదే అత్యుత్సాహాన్ని కంటిన్యూ చేస్తోంది. ఆయన చెప్పిన వివరాల వల్ల దర్యాప్తు కీలకమలుపు తిరగబోతున్నదని అంటున్నారు.
కానీ.. విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ ను జాగ్రత్తగా గమనిస్తే.. ఆల్రెడీ ప్రచారంలో ఉన్న సంగతులను ఆయన ధ్రువీకరించారే తప్ప కొత్త సంగతులు బయటపెట్టినట్టు లేదు. పైగా.. వైసీపీ వారి మీద నమోదు అవుతున్న చాలా కేసుల్లో విచారణకు హాజరవుతున్న నేతలు.. తరచూ చెబుతున్న రెగ్యులర్ సమాధానం లాగానే కీలక ప్రశ్నలు కొన్నింటికి ఆయన ‘తెలియదు.. గుర్తులేదు’ లాంటి సమాధానాలే చెప్పారు.
లిక్కర్ స్కామ్ కు సంబంధించి మీడియా అడిగిన అనేక ప్రశ్నలకు అవన్నీ రాజ్ కసిరెడ్డిని అడగండి అంటూ సెలవిచ్చారు. కసిరెడ్డి ఈ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి అనే విషయం విజయసాయి ఇవాళ కొత్తగా చెప్పిందేమీ లేదు. గతంలో కూడా అదే చెప్పారు. కాకపోతే.. ఇవాళ సిట్ అడిగిన ప్రశ్నలకు ఆయన తెలియదు, గుర్తులేదు లాంటి జవాబులిచ్చారు.
హైదరాబాదులోని తన నివాసంలో మొదటి మీటింగ్, విజయవాడలోని నివాసంలో రెండో మీటింగ్.. ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి జరిగాయని విజయసాయి సిట్ ముందు ఒప్పుకున్నారు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, శ్రీధర్ రెడ్డి హాజరైనట్టుగా కూడా చెబుతున్నారు. అయితే.. కుంభకోణానికి పాల్పడడం, వసూళ్ల పర్వం మొత్తం రాజ్ కసిరెడ్డి, ఆయన తోడల్లుడు, ఇతర బంధువులు నడిపించారనేది విజయసాయిరెడ్డి చెబుతున్న మాట.
అయితే ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర ఉన్నదా అని సిట్ అడిగినప్పుడు ‘తెలియదు’ అని చెప్పినట్టుగా ఆయన వెల్లడించారు. అలాగే.. విజయవాడలో జరిగిన రెండో మీటింగుకు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఐఎఎస్ అధికారి ధనంజయ రెడ్డి హాజరైనట్టుగా గతంలో విచారణలో తేలిందని.. నిజమేనా అని సిట్ అధికారులు విజయసాయిని అడిగారట. ‘తనకు గుర్తున్నంత వరకు హాజరు కాలేదు’ అని చెప్పారట. అంటే.. ఆ ఇద్దరి విషయం తనకు ‘గుర్తులేదు’ అని చెప్పారన్నమాట.
తన ఇంట్లోనే సమావేశం జరిగిందని అంటూ.. ఇద్దరు కీలక అధికారులు వచ్చారో లేదో గుర్తులేదని అనడం గమనార్హం. మొత్తానికి అడిగిన అన్నింటికీ జవాబులు చెప్పానని, తన సమాధానాలతో సిట్ అధికారులు సంతృప్తి చెందారని అంటూనే.. మళ్లీ విచారణకు పిలిచినా వస్తానని అన్నట్టుగా విజయసాయి చెప్పడం విశేషం.
మొత్తానికి కుంభకోణం జరగ లేదు అని మాత్రం అనలేదు ..
మా అన్నయ్య అమాయకుడు సౌమ్యుడు గుణవంతుడు అందరివాడు అంటున్న విశ్లేషకులు
ఈ వీసా రెడ్డి గతం మర్చిపోవాలని కోరుకో, లేదంటే అప్రొవర్ గా మారితే ఇక అంతే సంగతులు, జగన్ జీవితాంతం జైల్ లోనే ఉండాలి
గుర్తులేదు అన్న ప్రతిసారి “శాంతం” గా ఆలోచించి చెప్పండి అని అడిగితే గుర్తులు అన్ని టన్నులు టన్నులు గా బయటపడ్డాయేమో ? ఒకసారి నువ్వు కూడా ఆ కోణం లో ఆలోచించు.
ఇంటి పక్కనే కోరు పెట్టుకుని, కోడి కత్తి డ్రామా కే*సు లో సాక్ష్యం చెప్పం*ట్నీ ప్యాలెస్ పులకేశి గాడు ఏమి అన్నాడు చెప్పూ లో గ్రేడ్ ఆంద్ర ?
అసలు ysr మర*ణం వెనుక అం*తఃపురం కు*ట్ర ఏమిటి అనేది బయట పెడితే సరి. కో*డి క*త్తి ప్యా*లెస్ పుల*కేశి గాడు సంగతి బయట పడిద్ది.
meru neeli media ga garu
ఆహా ..ఎవ్వడు తగ్గడం లేదు.
…కసి గాడికి తాట తీస్తే కానీ తాడేపల్లి, బెంగళూరు..లో మంటలు పుట్టవు….
///హైదరాబాదులోని తన నివాసంలో మొదటి మీటింగ్, విజయవాడలోని నివాసంలో రెండో మీటింగ్.. ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి జరిగాయని విజయసాయి సిట్ ముందు ఒప్పుకున్నారు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, శ్రీధర్ రెడ్డి హాజరైనట్టుగా కూడా చెబుతున్నారు.///
.
మరి ఎమి చెప్పలెదు అంటున్నావ్! చాలా విషయాలు ఒప్పుకున్నాడుగా?
reddy
YCP redlu andaroo kilisi liquor peru tho raktham tagaranamata
నేను మీకు తెలుసా ?