వివాదాస్పద సన్నివేశాన్ని తొలిగించిన మేకర్స్

సినిమాలోని ఒక నిర్దిష్ట సన్నివేశంపై వ్యతిరేకత తలెత్తింది. ఆ సన్నివేశాన్ని తక్షణమే సినిమా నుండి తొలగించాం

జాట్ రిలీజై వారం దాటింది. ప్రారంభంలో ఈ సినిమాలోని ఓ సన్నివేశంపై ఓ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ మేకర్స్ పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. ఎప్పుడైతే దీనికి సంబంధించి కేసు నమోదైందో, వెంటనే అప్రమత్తమయ్యారు. అందరికీ క్షమాపణలు చెప్పి మరీ ఆ సన్నివేశాన్ని తొలిగించారు.

మతపరమైన భావాల్ని కించపరిచేలా సినిమాలో ఓ సన్నివేశం ఉందంటూ జలంధర్ లో జాట్ మేకర్స్ పై కేసు పడింది. సెక్షన్-299 కింద కేసు నమోదు చేసిన పోలీసులు, దర్శకుడు గోపీచంద్ మలినేని, ప్రధాన నటులు, నిర్మాతల్ని అందులో చేర్చారు. దీంతో మేకర్స్ ఆ వివాదాస్పద సన్నివేశాన్ని తొలిగించారు.

“సినిమాలోని ఒక నిర్దిష్ట సన్నివేశంపై వ్యతిరేకత తలెత్తింది. ఆ సన్నివేశాన్ని తక్షణమే సినిమా నుండి తొలగించాం. ఏ మతానికి చెందిన మనోభావాలను దెబ్బతీయకూడదనేది మా ఉద్దేశ్యం. జరిగిన దానికి తీవ్రంగా చింతిస్తున్నాం. ఆ సన్నివేశాన్ని సినిమా నుండి తొలగించడానికి త్వరితగతిన చర్యలు తీసుకున్నాం. ఎవరి విశ్వాసాలు దెబ్బతిన్నాయో వాళ్లందర్నీ హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం”

జాట్ సినిమాలో ఓ సన్నివేశంలో రణదీప్ హుడా పాత్రను చర్చి లోపల శిలువ కింద నిల్చున్నట్టు చూపించారు. ఆ సన్నివేశం జీసస్ ను అగౌరవపరిచేలా ఉందంటూ కొందరు కేసు పెట్టారు. ఈ ఒక్క సన్నివేశాన్ని సినిమా నుంచి తొలిగించారు.

One Reply to “వివాదాస్పద సన్నివేశాన్ని తొలిగించిన మేకర్స్”

Comments are closed.