రాజకీయ నాయకులు చేసే అన్ని ఆరోపణలకు ఆధారాలు ఉండవు. ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలని, ప్రజల్లో వారిపై వ్యతిరేకత పెరగాలని, తాము చేసిన ఆరోపణల మీద అందరూ చర్చించుకోవాలని అనుకుంటారు. అంటే మైండ్ గేమ్ ఆడతారన్న మాట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇలాంటి మైండ్ గేమ్ ఆడుతున్నాడు. జ్యోతిరావు పూలే జయంతి రోజు కేటీఆర్ ఓ సంచలన విషయం చెప్పాడు. ఇది అన్ని రాజకీయ పార్టీల్లో కలకలం రేపింది. అసలు కంచ గచ్చి బౌలి భూముల వ్యవహారమే పెద్ద సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే కదా.
ఈ భూముల వ్యవహారాన్ని బీఆర్ఎస్ తన రాజకీయ ప్రయోజనాలకు సమర్థంగా ఉపయోగించుకుంది. రేవంత్ రెడ్డి సర్కారును ఇరుకున పెట్టింది. జాతీయస్థాయిలో ప్రభుత్వం పరువు పోయేలా రచ్చ రచ్చ చేసింది. అసలే తల బొప్పి కట్టి ఉన్న ప్రభుత్వం నెత్తిన మరో బండ పడేశాడు కేటీఆర్. కంచ గచ్చి భూముల వ్యవహారంలో భారీగా ఆర్థిక నేరం జరిగిందని చెప్పాడు. రేవంత్ రెడ్డికి అన్నీ తెలిసే ఆర్థిక నేరం చేశాడని, ఈ భూముల వెనుక 10 వేల కోట్ల ఆర్థిక కుంభకోణం ఉందని ఆరోపించాడు.
ఈ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పాడు. రేవంత్ రెడ్డికి బీజేపీకి చెందిన ఓ ఎంపీ వెనుక నుంచి పూర్తిస్థాయిలో సహకరించాడని ఆరోపించాడు. ఈ వ్యవహారంలో ట్రస్ట్ ఎడ్వజైర్స్ ఇన్వెస్ట్మెంట్ అనే కంపెనీ రేవంత్ రెడ్డికి బ్రోకరిజం చేసిందన్నాడు. అందుకు గాను ఆ కంపెనీకి రూ. 170 కోట్లు లంచం ఇచ్చాడని చెప్పాడు. ఎఫ్‌ఆర్‌బీఎంను బైపాస్ చేసి డబ్బులు ఇస్తామని… ఆ తర్వాత భూములు అమ్ముకోవచ్చని ఆ కంపెనీ తెలిపిందన్నాడు.
ఇందుకోసం సుప్రీంకోర్టు తీర్పులు, ఆర్బీఐ గైడ్‌లైన్సులను తుంగలో తొక్కారని విమర్శించాడు. అటవీ భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాకట్టు పెట్టిందని కేటీఆర్ ఆరోపించాడు. అటవీ భూమిని తాకట్టు పెట్టే అధికారం, అమ్మే అధికారం ప్రభుత్వానికి కూడా లేదన్నాడు. వాల్టా, ఫారెస్టు చట్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘించిందన్నాడు. బీజేపీ ఎంపీ సారధ్యంలోనే బ్రోకరేజ్ కంపెనీ తీసుకొచ్చారని… ఆ ఎంపీకి రేవంత్ అనుచిత లబ్ధి చేకూర్చాడని కేటీఆర్ ఆరోపించాడు. త్వరలోనే ఆ బీజేపీ ఎంపీ ఎవరో చెబుతానన్నాడు.
ఈ వ్యవహారంపై నిర్దిష్టమైన ఆధారాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖ రాస్తున్నామన్నాడు. కేంద్రం, ఆర్బీఐ, సీబీఐ, సెబీ, ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తు చేయాలని కోరుతున్నామని చెప్పాడు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశాడు. ఈ ఆరోపణలను కేటీఆర్ పట్టు వదలకుండా ప్రస్తావిస్తూనే ఉన్నాడు. దర్యాప్తు చేయాలని కేంద్రాన్ని డిమాండ్చేస్తూనే ఉన్నాడు. అయితే ఈ ఆరోపణలు చేసి వారం రోజులైనా రేవంత్ రెడ్డికి సహకరించిన బీజేపీ ఎంపీ ఎవరో కేటీఆర్ బయటపెట్టలేదు.
ఆ బీజేపీ ఎంపీ ఎవరో త్వరలో చెబుతానన్న కేటీఆర్ ఇప్పటివరకు నోరు మెదపడంలేదు. అసలు కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు నిజమేనా? ఆధారాలు ఉన్నాయా? ఆయన ఎప్పుడూ కాంగ్రెసు, బీజేపీ ఒక్కటే అంటూ ఉంటాడు కదా. అందుకే బీజేపీకి కూడా మసి పూస్తున్నాడని అనుకోవాలి. కేటీఆర్ ఆరోపణలు నిజమే అయితే ఆ పేరు బయటపెట్టేందుకు ఎందుకు వెనకాడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కంచగచ్చిబౌలి భూముల విషయంలో సీఈసీ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని ప్రధానిని కోరిన కేటీఆర్.. బీజేపీ ఎంపీ విషయాన్ని ఎందుకు స్కిప్ చేశారనే చర్చ జరుగుతోంది. బీజేపీ ఎంపీ పేరు చెప్పాలని మీడియా సమావేశంలో విలేకర్లు అడగ్గా అది మీరే ఇన్వెస్ట్ గేషన్ చేయాలంటూ కామెంట్ చేశాడే తప్ప ఆ ఎంపీ ఎవరనేది మాత్రం చెప్పలేదు. పేరు చెప్పాలని బీజేపీ, కాంగ్రెసు నాయకులు కూడా చాలాసార్లు డిమాండ్చేశారు. దీన్నిబట్టి చూస్తే కేటీఆర్ గాల్లో బాణం వేశాడని అనుకోవాలి.
వారిది ఏమిపోయింది దీనివెనుక చిట్టి పికిల్ ఉన్నారు అంటారు.. వినేవాడు ఉంటే ఏమైనా చెప్పచ్చు
Veedu oka potti naa ko
asalu unte kada cheppataniki adhikaram poyo babu badha[adurunnadu