ప్రజలు పిలిస్తే మళ్లీ రాజకీయాల్లోకి వస్తా- విజయసాయి

నేను రాజకీయాల్లోకి రావాలంటే మీ అనుమతి తీసుకోవాలా?

వైయస్ జగన్ హయాంలో లిక్కర్ స్కాం జరిగింది అనే ఆరోపణల నేపథ్యంలో, ఏపీ సీఐడీ ఇవాళ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది. సీఐడీ విచారణ అనంతరం లిక్కర్ కేసుకు సంబంధించి జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

లిక్కర్‌కు సంబంధించి రెండు సమావేశాల్లో పాల్గొన్నానని, ఆ మీటింగ్‌లో వాసుదేవ రెడ్డి, మిథున్ రెడ్డి, సత్యకుమార్, కసిరెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారని చెప్పారు. తాను కేవలం వారికి బిజినెస్ కోసం వడ్డీకి డబ్బులు ఇప్పించానన్నారు.

లిక్కర్ స్కాం జరిగిందో లేదో అధికారులు, కసిరెడ్డినే అడగాలని సూచించారు. కసిరెడ్డి వసూలు చేసిన డబ్బులు ఎవరికెళ్లాయో తనకు తెలియదన్నారు. కసిరెడ్డిని పట్టుకొని ఆయన్ను అడిగితే నిజాలు బయటపడతాయన్నారు. అలాగే తాను అత్యుత్సాహంతో ముందుగానే సీఐడీ విచారణకు వచ్చి జగన్‌పై వ్యతిరేకంగా చెప్పబోతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. సిట్‌ పిలిచిన తర్వాతనే విచారణకు వచ్చానన్నారు.

వైసీపీ పార్టీ గురించి, జగన్ గురించి మాట్లాడుతూ – 2019కి ముందు తానే పార్టీని నడిపానని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోటరీ మాటలు విని జ‌గ‌న్ తనను 2వ స్థానంనుండి 2000వ స్థానానికి నెట్టారని ఆరోపించారు. జగన్ మనసులో తనకు స్థానం లేదని గ్రహించి, అవమాన భారం తట్టుకోలేక పార్టీని విడిచానని మళ్లీ చెప్పారు. తాను బీజేపీ నుంచి రాజ్యసభకు ఎంపీగా అవుతున్నట్లు వస్తున్న వార్తలను కూడా ఖండిస్తూ – ప్రజలు పిలిస్తే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు.

“నేను రాజకీయాల్లోకి రావాలంటే మీ అనుమతి తీసుకోవాలా?” అని విజయసాయిరెడ్డి ప్రశ్నించడంతో, ఏదో ఒకరోజు ఆయన తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వచ్చినా, వైసీపీలోకి చేరే అవకాశం మాత్రం లేదు. జగన్ ఒకసారి వద్దనుకుంటే, తిరిగి తీసుకునే ప్రసక్తే ఉండదు. దీంతో విజయసాయి మరికొన్ని రోజుల్లోనే బీజేపీ లేదా బీజేపీ మిత్రపక్షాల్లోకి చేరే అవకాశం ఉంది.

14 Replies to “ప్రజలు పిలిస్తే మళ్లీ రాజకీయాల్లోకి వస్తా- విజయసాయి”

    1. 1: నేను విన్నాను నేను ఉన్నాను 

      2: నేను చూశాను నేను చెబుతాను 

  1. మొదలెట్టండి . రేపట్నుంచి ప్రజలు ధర్నాలు రాస్తారోకో లు చేసి ఈయన గారిని రాజకీయాల్లోకి రమ్మని పిలుస్తారా?? రాజకీయం ఒక మత్తు పదార్థం . అలవాటు పడితే వదులుకోవడం కష్టం .  వీడి గోల ఏంటో? ఒకసారి అధికారం రుచి చూశాడు కదా? అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాడు అంతే.

  2. రేపో మాపో ప్రజలు వత్తిడి చేశారు అని జేబులోంచి కండువా బయటకి తీస్తాడు. అది ఏ రంగు అన్నది సస్పెన్సు

  3. ప్రజలంతా అవసరం లేదు…ప్రపంచ “శాంతి” కోసం ఆ ఒక్కరు చెప్పినా రీ ఎంట్రీ ఇస్తారు

  4. అసలు సూత్రదారి “మాడామోహన రెడ్డి” అనే లంగా గాడు.. వాడిని బొక్కలో ఏసి బట్టలూడదీసి దె0గే దైర్యం లేదా?? అని ప్రశ్నిస్తున్న పౌర సమాజమ్..

  5. ఒకసారి వెళితే మళ్ళీ తీసుకొనే ప్రసక్తి లేదా? మరి మంగళగిరి RK నీ ఎలా తీసుకున్నాడో

  6. ఈయన ycp పాలిట శకుని, నాయన నీ నక్క వినయాలు చాలు , జగన్ జైలు కి వెళ్ళడానికi నీ సలహాలే కారణం, ఆయన్ని ముంచింది చాలు , ఏ ప్రజలు నిన్ను రాజకీయాల్లోకి రమ్మని అడగరు..వెళ్లి చంద్రబాబు కి సేవ చేసుకో 

Comments are closed.