ఇప్పటికే పీకల్లోతు వివాదాల్లో మునిగి తేలుతున్నారు సీనియర్ నటుడు మోహన్ బాబు. ఓవైపు చిన్న కొడుకు మంచు మనోజ్ తో వివాదం. మరోవైపు జర్నలిస్ట్ పై దాడితో మొదలైన మరో వివాదం. రకరకాల మలుపులు తిరుగుతున్న ఈ కేసులకు తోడు, ఇప్పుడు ఊహించని వివాదంలో చిక్కుకున్నారు మోహన్ బాబు.
దివంగత నటి సౌందర్యకు చెందిన హైదరాబాద్ ఆస్తుల్లో కొన్నింటిని మోహన్ బాబు ఆక్రమించుకున్నారట. అంతేకాదు, సౌందర్య మరణం కూడా ప్రమాదవశాత్తూ జరిగింది కాదని, మోహన్ బాబు పేరు ఉపయోగిస్తూ కొన్ని పోస్టులు కనిపించాయి.
దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యాడు. నిజంగా ఇది ఊహించని వివాదమే. అయితే ఈ వివాదం సోషల్ మీడియాలో రాజుకుంటున్న టైమ్ లోనే దానిపై క్లారిటీ ఇచ్చారు సౌందర్య భర్త రఘు.
సౌందర్యకు సంబంధించి మోహన్ బాబుపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆయన ఖండించారు. మోహన్ బాబుతో తమకు పాతికేళ్లుగా మంచి అనుబంధం ఉందని, తమ ఆస్తుల్ని మోహన్ బాబు ఆక్రమించుకున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తామంతా ఓ కుటుంబంలా ఉంటామన్నారాయన.
సౌందర్య భర్త ప్రకటనతో ఈ వివాదం సమసిపోయింది. మోహన్ బాబు, సౌందర్య కలిసి పోస్టుమేన్, శివశంకర్ లాంటి సినిమాల్లో నటించారు.
luchha gaadu mohan babu. karma is haunting this guy
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Ammaya