విజయనగరం జిల్లాకు పది వేల కోట్లు

స్థానికంగా ఉన్న కంపెనీలు మూసివేతతో 50 వేల మంది దాకా కార్మికులకు ఉపాధి పోయింది. జిల్లాలో నీటి ప్రాజెక్టులకు అతీగతీ లేదని మేధావులు అంటున్నారు.

ఏపీ బడ్జెట్‌లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఎంత మేరకు నిధులు కేటాయించారో తెలియదు, కానీ ఉత్తరాంధ్ర అత్యంత వెనుకబడిన ప్రాంతమని అధిక నిధులు ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. ఇందులో విజయనగరం జిల్లా బాగా వెనుకబడిందని, ఆ జిల్లా అభివృద్ధి కోరుకునే వారు, ప్రజా సంఘాల నేతలు అంటున్నారు. విజయనగరం జిల్లా సమగ్రమైన అభివృద్ధికి పది వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తే తప్ప ప్రగతి దారులు కనిపించవని అంటున్నారు.

జిల్లాలో ఏ రకమైన అభివృద్ధి కానరాక, వేలాది మంది ఉపాధి కోసం వలసబాట పట్టారని లెక్కలు చెబుతున్నాయి. స్థానికంగా ఉన్న కంపెనీలు మూసివేతతో 50 వేల మంది దాకా కార్మికులకు ఉపాధి పోయింది. జిల్లాలో నీటి ప్రాజెక్టులకు అతీగతీ లేదని మేధావులు అంటున్నారు.

వైద్య కళాశాలకు సిబ్బంది లేరని, ప్రభుత్వ కళాశాలకు సొంత భవనాలు లేవని అంటున్నారు. విజయనగరం జిల్లా పరిస్థితులను పరిశీలిస్తే, మామిడి, జీడి, చింతపండు ప్రాసెసింగ్‌ పరిశ్రమలు పెట్టి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించవచ్చని మేధావులు సూచిస్తున్నారు. జిల్లాలో జూట్ మిల్లును బట్టల తయారీ పరిశ్రమగా మారిస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని సూచిస్తున్నారు.

ఈ విషయాల మీద చర్చించేందుకు ప్రజా సంఘాలు, మేధావులు, జిల్లా ప్రగతిని కోరుకునే వారితో ఈ నెల 16న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని చెబుతున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూటమి ప్రభుత్వానికి పంపిస్తామని అంటున్నారు.

9 Replies to “విజయనగరం జిల్లాకు పది వేల కోట్లు”

  1. 2019-2024 కాలం లో విజయనగరం అభివృద్ధి చెందింది.. కూటమి ప్రభుత్వం రావడం తో పరిశ్రమలు మూతపడ్డాయి అభివృద్ధి లేదు అంతే కదా జీఏ

Comments are closed.