విజ‌య‌సాయిరెడ్డి రాజ్య‌సభ సీటు.. ఆయ‌న‌కే!

విజ‌య‌సాయిరెడ్డి రాజీనామాతో ఏర్ప‌డిన రాజ్య‌స‌భ సీటు బీజేపీ సొంతం చేసుకోనుంది.

విజ‌య‌సాయిరెడ్డి రాజీనామాతో ఏర్ప‌డిన రాజ్య‌స‌భ సీటు బీజేపీ సొంతం చేసుకోనుంది. ఈ స్థానం నుంచి త‌మిళ‌నాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్య‌క్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామ‌లై కుప్పుస్వామిని అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌కు పంపాల‌ని ఆ పార్టీ జాతీయ నాయ‌క‌త్వం నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. ఇటీవ‌లే అన్నామ‌లై స్థానంలో త‌మిళ‌నాడు బీజేపీకి కొత్త ర‌థ‌సార‌థిగా నైనార్ నాగేంద్ర‌న్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ నేప‌థ్యంలో విజ‌య‌సాయిరెడ్డి రాజ్య‌స‌భ సీటు విష‌య‌మై ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు తెరపైకి వ‌చ్చాయి. బీజేపీతో ముంద‌స్తు ఒప్పందం ప్ర‌కార‌మే, విజ‌య‌సాయిరెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. చివ‌రికి అదే నిజ‌మ‌వుతోంది. త‌మిళ‌నాడు బీజేపీ నేతను ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని నిర్ణ‌యించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఏపీలో కూట‌మి అధికారంలో వుంది. ముఖ్యంగా టీడీపీ పెద్ద‌న్న పాత్ర పోషిస్తోంది. అయితే జాతీయ‌స్థాయిలో బీజేపీ అధికారంలో వుండ‌డం, ముఖ్యంగా రాజ్య‌స‌భ‌లో బ‌లం పెంచుకోవాల‌ని ఆ పార్టీ వుంది. అందుకే బీజేపీ ప్ర‌తిపాద‌న‌ను టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కాద‌నే ప‌రిస్థితి వుండ‌దు. ఏపీ బీజేపీలో కూడా రాజ్య‌స‌భ సీటును ఆశించే నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ, జాతీయ నాయ‌క‌త్వం ఆద‌ర‌ణ చూర‌గొన్న వాళ్లెవ‌రూ లేరు.

అన్నామ‌లైని రాజ్య‌స‌భకు తీసుకుని, ఆయ‌న్ను కేంద్రంలో మంత్రిని చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది త‌మిళ‌నాడు అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో, ఆ రాష్ట్రానికి రాజ‌కీయ ప్రాధాన్యం ఇచ్చే క్ర‌మంలోనే అన్నామ‌లై వైపు మొగ్గు చూపుతున్నార‌ని స‌మాచారం.

8 Replies to “విజ‌య‌సాయిరెడ్డి రాజ్య‌సభ సీటు.. ఆయ‌న‌కే!”

    1. BJP is contesting elections in TN in alliance with AIADMK under EPS. And as EPS and Annamalai don’t go together, BJP decided to move Annamalai to RS (and may be, into Central ministry as well!). Everyone that is following Indian politics knows this. 

  1. స్థానిక నాయకులకే రాజ్యసభ సీటు ఇవ్వాలి అనే డిమాండ్ చేస్తారు వైసిపి వాళ్ళు తప్పకుండా (పరిమళ నత్వానీ కి రాజ్యసభ సీటు విషయం మర్చిపోయి)

  2. తల్లిని, చెల్లిని అగౌరవపరిచిన నేతకు గౌరవం ఎక్కడ? గ్రామాల నుంచి జగన్‌కు ఘోర తిరస్కారం!

    ఒకప్పుడు “మామయ్య” అంటూ ప్రేమగా పిలిచిన మహిళలు, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పేరు వినగానే జాల్రాలు వేస్తున్నారు. ఇంట్లో ఒకరిలా కనిపించిన వ్యక్తి, ఆ ఇంటినే నాశనం చేసాడన్న భావన ఇప్పుడు గ్రామాల్లో బలంగా నెలకొంది. తన తల్లిని కోర్టుకు లాగిన వాడిని మన నాయకుడిగా ఎలా అంగీకరిస్తాం అని ఆడవాళ్లు గళమెత్తుతున్నారు. కుటుంబానికి గౌరవం లేని వాడికి ప్రజలకు ఏమాత్రం గౌరవం ఉంటుంది?

    గ్రామాల్లో ఇది ఏకవాక్యం: “మనం మోసపోయాం… ఇక మళ్లీ కాదు!” జగన్ వేసిన నాటకాలన్నీ బహిరంగమయ్యాయి. సంక్షేమం పేరుతో ఓట్లు గెలవడం మాత్రమే ఆయన లక్ష్యమని ప్రజలు ఎట్టకేలకు గుర్తించారు. అల్లరి మాటలతో ఆకర్షించిన రోజులే గడిచిపోయాయి. ఇప్పుడు ప్రజలు విషయాన్ని తలచుకొని మాడిపోతున్నారు.

    తల్లిని తక్కువ చేస్తే మనిషికి మానవత్వమే లేదని చెప్పే తెలుగు సంస్కృతిని తునాతునకలు చేసిన జగన్ పట్ల ఇప్పుడు గ్రామాల మన్ననే కాదు, మనస్సు కూడా పూర్తిగా తిరస్కరించింది. “ఎవడైనా గెలవాలి కానీ… ఇలాంటోడు కాదు” అన్న మాటలు ఆ వృద్ధుల నోటి నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఒక్క కుటుంబం నడిపించలేని వాడిని రాష్ట్రం నడిపించడానికి ఎలా నమ్ముతాం?

    పార్టీ నాయకత్వంలో విభేదాలు, క్యాడర్‌కి గల వైముఖ్యాన్ని వేరే కోణంగా చూడాల్సిన అవసరం లేదు. అది జగన్‌ పట్ల ప్రజల్లోని అసహనం ప్రతిబింబమే. ఇప్పటికే 40 శాతం పైగా పార్టీ శ్రేణులు పార్టీని విడిచి వెళ్లిపోవడం యాదృచ్ఛికం కాదు. అది ప్రజలు తీర్పునిచ్చిన తర్వాత జరుగుతున్న సహజ పరిణామం.

    ఇప్పటికి గ్రామాల్లో ప్రజలు చెప్పేది ఒక్కటే—తల్లిని అగౌరవపరిచిన, చెల్లిని అపహాస్యం చేసిన వాడికి ఓటు వేయడమంటే… మా తల్లులను, చెల్లెల్లను అవమానపరచినట్టు అవుతుంది. ఇది రాజకీయ తిరస్కారం కాదు… ఇది నైతిక తిరుగుబాటు. జగన్ మళ్ళీ వచ్చిన రాస్తా కాదు… ఇదే చివరి దారి!

  3. ఏ చెరుకూరి వారినో వేమూరి వారినో అనుకోకుండా ఈ సాంబార్ మలై మనకు అవసరమా 

  4. దయచేసి 11 జగన్ రెడ్డి ని మాత్రం కాశ్మీర్ లో చనిపోయిన వారి ఫ్యామిలీస్ దగ్గర కి మాత్రం పంపించకండి. భారత్ దేశం మొత్తం బాధ పడుతుంటే వీడు మాత్రం అక్కడి వెళ్లి వెకిలి నవ్వులు తో పాటు కూటమి తన బోరుగడ్డ అనిల్ జైల్ లో వేసింది గురుంచి చెపుతాడు, కూటమి కంటే నేనే ఎక్కువ కంపెనీ లు తెచ్చా అని చెపుతాడు, కడప లో చికెన్, ఫిష్, ప్రాన్ షాప్స్ పెట్టిచా అని చెపుతాడు.

Comments are closed.