జనాలు రోడ్డెక్కారు అంటే!

వైసీపీ ఇచ్చిన యువత పిలుపునకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాలలో నేతలు కదిలారు.

ఏపీలో తెలుగుదేశం నాయకత్వంలోని ఎన్డీయే కూటమి పాలన పట్టుమని పది నెలలు కూడా పూర్తి కాలేదు కానీ జనాలు రోడ్డెక్కారు అని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. జనాలు ఎందుకు ఇలా వైసీపీ పిలుపునకు స్పందిస్తున్నారు అన్నది బాబు ప్రభుత్వం ఆలోచన చేయాలని అన్నారు.

ఎన్నికల్లో గెలిచేందుకే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు కానీ జనాలకు అమలు చేసేందుకు కావని ఆయన నిందించారు. ప్రభుత్వం వేల కోట్లు అప్పు తెస్తోందని విద్యార్ధుల ఫీజుల కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు అందులో నుంచి తీసి ఖర్చు పెట్టలేదా అని ఆయన ప్రశ్నించారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోందని గ్రహించే వైసీపీ ఉద్యమాలను పోలీసులతో అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారని అయినా వైసీపీ క్యాడర్ వెనకడుగు వేయదని అన్నారు.

ఉత్తరాంధ్రలో వైసీపీకి పూర్వ వైభవం తీసుకుని వస్తామని ప్రజల మద్దతు కూడగట్టడం ద్వారా పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుంటామని ఆయన చెప్పారు. వైసీపీ ఇచ్చిన యువత పిలుపునకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాలలో నేతలు కదిలారు. నిరసన కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. ఇది పోరాటాలకు ఆరంభం మాత్రమే అని ముందు ముందు మరిన్ని ఉద్యమాలు చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నిరసన కార్యక్రమం అయితే వైసీపీలోని నేతలను మాత్రం బయటకు తెచ్చిందని అంటున్నారు.

14 Replies to “జనాలు రోడ్డెక్కారు అంటే!”

  1. ఉనికి కోసం మాజీ ఎంఎల్ఏ లు పోరాటాలు చేయాల్సిందే కానీ….జగన్ గాడు మాత్రం బయటికి రాడు…ఎలాంటి కష్టం లేకుండా దానంతట అదే సిఎం పోస్ట్ తనకు రావాలి… వీడొక పూర్తి స్థాయి సోమరిపోతు గా మారాడు…మళ్ళీ వీడు సిఎం కావడం కష్టమే…కార్యకర్తలు మీరు పోరాడండి…నేను ఇంట్లో కూర్చుంటాను…అనే స్థాయికి దిగజారాడు

  2. వైసిపి పిలుపుకి వచ్చిన జనాల స్పందన కాదు GA గారూ..

    అన్న కి వచ్చిన 40% వోట్ బ్యాంక్ లో 35% నిజం తెలుసుకొని ఎవరి దారి వారు చూసుకోగా మిగిలిన 5% లో ఏ పని పాట లేకుండా ఉన్నవాళ్ళలో 1% బీరు, బిర్యానీ 500 కోసం వచ్చిన వాళ్ళే వీళ్లంతా.. ఇదంతా ఉత్తుత్తి ధర్నాలు, ర్యాలీలు కంగారు పడి చంకలు గుద్దేసుకోవద్దు

  3. “జనాలు ఎందుకు ఇలా వైసీపీ పిలుపునకు స్పందిస్తున్నారు అన్నది బాబు ప్రభుత్వం ఆలోచన చేయాలని అన్నారు”..lol..we have seen these tricks before 2019..enough of this batch

Comments are closed.