గోదావరి జిల్లాల్లో క్రాప్ హాలీడే వుంటుంది… చేపల వేటకు హాలీడే వుంటుంది. ఉత్పత్తిని కంట్రోలు చేసి, రేట్లు స్థిరంగా వుంచేలా చేయడానికి, నీటి లభ్యత కోసం, అలాగే చేపలు పిల్లలు పెట్టేందుకు టైమ్ ఇవ్వడం కోసం ఇలా రకరకాల క్రాప్ హాలీడే ప్లాన్ చేసారు. పరిస్థితి చూస్తుంటే ఇక థియేటర్ హాలీడేలు కూడా ప్రకటించాల్సి వచ్చేలా వుంది.
ప్రస్తుతం ఫిబ్రవరి నుంచి ఏప్రియల్ వరకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి దారుణంగా వుంది. పళ్ల బిగువున థియేటర్లను నడుపుతున్నారు. థియేటర్లకు జనం రావడం తగ్గిపోయింది. సరైన సినిమా పడితే ఓకె. అది కూడా వన్ వీక్ మాగ్జిమమ్. రెండోవారానికి షేరింగ్ కు తీసుకురావాల్సిందే. సంక్రాంతికి వస్తున్నాం తరువాత అన్ని వారాల పాటు మంచి రన్ వచ్చిన సినిమా లేదు. తండేల్ సినిమా అంత హిట్ అనిపించుకున్నా, అన్ని ప్రాంతాల్లో థియేటర్లకు సరైన ఫుల్స్ రాలేదు. ఆ తరువాత మళ్లీ సరైన సినిమా పడకపోగా, ఎగ్జిబిటర్ల నుంచి బయ్యర్లు తీసుకున్న అడ్వాన్స్ లు అన్నీ రన్నింగ్ అక్కౌంట్ల రూపంలో పడి వున్నాయి.
వారం వారం రెండు మూడు సినిమాలు వస్తున్నాయి. కానీ థియేటర్ దగ్గర బకెట్ తన్నేస్తున్నాయి. ఎంత ప్రచారం చేసి, ఎంత బజ్ వచ్చింది అని సంతోషపడినా థియేటర్ దగ్గరకు జనం మాత్రం రావడం లేదు. సరే, మొదటి రోజు జనం రాకపోయినా, టాక్ వచ్చిన తరువాత వస్తారు అనుకుంటే సినిమాలు కూడా అలాగే అఘోరిస్తున్నాయి. ఏ సినిమా కూడా జనాలకు అంత సులువుగా నచ్చడం లేదు. సంక్రాంతికి వస్తున్నాం, తండేల్, కోర్ట్ …జనవరి నుంచి ఏప్రిల్ వరకు జస్ట్ మూడు సినిమాలు. సరిగ్గా జనాలకు నచ్చినవి, డబ్బులు వెనక్కు తెచ్చినవి.
థియేటర్ల నిర్వహణ ఖర్చులు, కరెంట్ బిల్లులు, జీత భత్యాలు, ఇవన్నీ కలిసి తడిసి మోపడవుతున్నాయి. పెద్ద సినిమాలు వస్తే రెంట్లు వస్తాయి. చిన్న మిడ్ రేంజ్ సినిమాలు షేరింగ్ మీద. నిజానికి కలెక్షన్లు వస్తే షేరింగ్ బెటర్. కానీ రాకుంటే, పది మంది కోసం సినిమా వేయాలి అంటే షోకి వచ్చేది మహా అయితే అయిదు వందల నుంచి వెయ్యి రూపాయలు. అందులో వచ్చే షేర్ ఎంత. ఖర్చులు ఎంత?
మిగిలిన రాష్ట్రాల్లో పెద్ద, చిన్న హీరోలు అంతా కలిపి అయిదారుగురు కూడా వుండరు. కానీ వారం వారం సరైన సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. మన దగ్గర రెండు డజన్ల మంది హీరోలు వున్నా సరైన సినిమాలు రావడం లేదు అని ఓ టాప్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ అన్నారు. ఈ రోజు థియేటర్ల పరిస్థితి కి, నటీనటులు, నిర్మాతలు, థియేటర్ల యజమానులు, మీడియాతో సహా ప్రతి ఒక్కరు బాధ్యులే అని ఆయన అన్నారు.
థియేటర్లకు వెళ్తే ఖర్చులు భారం అని జనం భయపడే పరిస్థితి వచ్చేసింది. ప్రతి సినిమాకు రేట్లు పెంచడం, పెంచకపోతే థియేటర్లే వెనక చాటున పెంచడం మామూలైంది. జగన్ టైమ్ లో థియేటర్లను కట్టడి చేస్తే కక్షసాధింపు అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే అదే బెటరేమో అంటున్నారు. థియేటర్లు ఇలా చేయడానికి కారణం భారీగా అడ్వాన్స్ లు ఇవ్వడం, అవి వెనక్కు త్వరగా రప్పించుకోవాలనే ప్రయత్నం.
నిర్మాతలు కూడా సినిమాల కోసం భారీగా ఖర్చు చేసేస్తున్నారు. రెమ్యూనిరేషన్లు తగ్గించడం, నిర్మాణ ఖర్చులు తగ్గించడం అనే డిస్కషన్లు, నిర్ణయాలు అన్నీ గాలికిపోయాయి. రాను రాను ఖర్చులు పెరుగుతూ వెళ్తున్నాయి తప్ప తగ్గడం లేదు. చిన్న సినిమా తీయాలి అన్నా అయిదు నుంచి పది కోట్లు కావాల్సి వస్తోంది.
అవి రాబట్టుకోవడం కోసం రేట్లు తెస్తున్నారు. ఖర్చు, రేట్లు చూపించి సినిమా అమ్ముతున్నారు. దీంతో సినిమా కాస్తా జనానికి భారం అయిపోతోంది. పది మంది వస్తే వాళ్ల దగ్గరే వసూలు చేసేద్దాం అనే భావనలో నిర్మాతలు, సినిమా జనాలు వున్నారు. అంతే తప్ప మంచి కంటెంట్ ఇచ్చి, రీజనబుల్ రేట్లు పెడితే ఎక్కువ మంది వచ్చి, ఎక్కువ అమౌంట్ వస్తుందనే ఆలోచనలో లేరు.
మరోపక్క సోషల్ మీడియా బాగా విస్తృతంగా మారింది. సినిమా ఫలితం విడుదలైన క్షణాల్లో జనాలకు చేరిపోతోంది. మీడియా మేనేజింగ్ అన్నది ఇప్పుడు పనికి రావడం లేదు. మీడియా మీట్ ల్లో చెప్పే కబుర్లు జనం లైట్ తీసుకుంటున్నారు. మౌత్ టాక్ అన్నదే కీలకంగా మారిపోయింది. ఈ మౌత్ టాక్ ను సోషల్ మీడియా విపరీతంగా ప్రభావితం చేస్తోంది.
అన్నింటికి మించి సినిమా ఒకప్పుడు వన్ అండ్ ఓన్లీ వినోద సాధనం, ఇప్పుడు సినిమా అనేకానేక వినోదాల్లో ఒకటి మాత్రమే. ఖర్చు లేని, లేదా సినిమా కన్నా తక్కువ ఖర్చు వున్న వినోదసాధనాలు అనేకానేకం ఇప్పుడు జనాలకు అందుబాటులో వున్నాయి. విండో షాపింగ్, క్రికెట్, వీకెండ్ విజిటింగ్ ప్లేస్ లు, రెస్టారెంట్లు ఇలా చాలా అంటే చాలా వ్యవహారాలు సినిమాల మీద వన్ పర్సంట్ నుంచి హండ్రెడ్ పర్సంట్ ప్రభావం చూపిస్తున్నాయి.
మొత్తం మీద కర్ణుడి చావుకు బోలెడు కారణాలు అన్నట్లు థియేటర్ల బాధలకు సవాలక్ష కారణాలు. ఇదే పరిస్థితి ఇలా కొనసాగితే భవిష్యత్ ఎలా వుంటుందో అని సినిమా పెద్దలే ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద పరిస్థితి అలార్మింగ్ గానే వుంది.
అందుకే డల్ సీజన్లలో కొన్నాళ్లు థియేటర్ల హాలీడే ప్రకటిస్తే, జనాలకు థియేటర్ల పట్ల కాస్త ఆసక్తి పెరుగుతుందేమో?
-విఎస్ఎన్ మూర్తి
మనోడు అసెంబ్లీ కి పోకుండా bycott చేసినట్టు, జనాలు థియేటర్స్ ని bycott చేస్తే అయిపోయే.. థియేటర్స్ వాళ్ళే సచ్చినట్టు హాలిడే ఇచ్చేస్తారు ఏమంటావ్ వెంకీ ??
థియేటర్ ల పని అయిపోయింది. OT T ల లొ వస్తుంటే ఇంకా థియేటర్ లోకి పోవాల్సిన అవసరం ఏముంది? పైరసీ ఎలాగూ ఉంది. వీటికి తోడు టికెట్ రేట్స్ పెంచుతున్నారు.
ఇంక చిన్న సినిమాలు రావు. వచ్చినా ott కే పరిమితం. పెద్ద బడ్జెట్ సినిమాలు తక్కువగా ఉంటాయి. వాటికి టికెట్ రేట్స్ అందుబాటులో ఉండవు. బయట రోడ్ మీద బజ్జీలు, పనీపురీలు తింటారు, రెస్టారెంట్ లు పోతారు తప్ప థియేటర్ అవసరం లేదు.
హాయ్
సోమవారం నుండీ గురువారం వరకు రోజుకు 2 షో లు లేకపోతే షో లు కేన్సిల్ చేయడం బెటర్ … శుక్రవారం నుంచి ఆదివారం వరకు రోజుకు 4 షో లు వేసుకోవడం బెటర్…
ఏదైనా సినిమా నూ అందునా తెలుగు సినిమా నూ చంపేసింది తమరి లాంటి సినిమా జర్నలిస్ట్ అనే ముసుగు లో ఉన్న సినిమా ఎర్నలిస్ట్ లే….అందులో NO 1 GA డీదా మూర్తి అగ్రగణ్యుడు
ప్రతీ టాపిక్ జగన్ కోసం రాస్తున్నట్లుంది…. దీన్నే పిచ్చి ఫాలోయింగ్ అంటారేమో
మంచి సినిమా చూసి చాలా కాలం అయింది
Hi
Hi
నీ అసలు ఏడుపు జగ్గ లా present govt 5/- ticket చెయ్యాలంటావు…అదేదో direct గా edachugaa…
Sir, మీరు కరెక్ట్ గా చెప్పారు. జగన్ టికెట్ రేట్లు తగ్గిస్తే అదేదో వీళ్ళ మీద పిడుగు పడినంత చేసారు .అసలు రేట్లు పెంచింది ఎవరికోసం 4-5 హీరోలు, 2-3 ప్రొడక్షన్ హౌసెస్ , వీళ్ళకి లాభాల కోసం చెత్త సినిమాలకి హైప్ క్రియేట్ చేసి, ఆస్కార్ నటులంతా బిల్డ్ అప్ లు ఇస్తారు. ఈ సో కాల్డ్ పెద్ద హీరోల నుండి ఒక్క మంచి సినిమా వస్తె ఒట్టు. హీరోయిన్స్ తో డాన్సులు, ఐటం సాంగ్స్, ఒకడు 100 మంది తో ఫైట్, తొడలు కొట్టే ఛాలెంజ్, దొంగలు – స్మగ్లర్ – బ్యాంక్ మోసాలు చేసే వాళ్ళు హీరోలుగా చూపెట్టడం – ఇది మన సినిమా సంస్కృతి. సెన్సార్ బోర్డు కి OTT మీద నియంత్రణ ఉన్నట్టు లేదు, సినిమాల మీద కూడా తగ్గుతోంది అనిపిస్తోంది. చూద్దాం, ఎన్నాళ్ళు ఇలా ప్రజలను, ప్రేక్షకులను మెప్పిస్తారో, నొప్పిస్తారో !
రేట్స్. పెంచడం తగ్గించడం జగన్ కు emj పని. Kg vanajaram చేప. 800 పడుతుంది జగన్ కు చెప్పి. 200 కి అమ్మించి అయితే. బొచ్చు చేప kg 150. Ayithe జగన్ కు ఏమి నొప్పి . ఏ చేప ను ఎంత పెట్టీ కొనాలి అనేది తినేవాడు చేతిలో ఉంటుంది అంతే తప్ప జగన్.కి ఏమి పని . సేమ్ లాజిక్ ఫర్ మూవీస్ also .alaa ayithe bike lu car lu అన్ని jagan ku cheppi తగ్గించే. Cinema ఆడక పోయినా వాళ్ళు ఎందుకు రేట్స్ తగ్గించడం లేదు ?? అంటే లోపల కట్టుబాటు అవుతుంది గనుకనే.ఒక వేళ కట్టుబాటు కాక పోతే వాళ్లే తగ్గించుకుంటారు జగన్ కి ఏమి పని
Arey sasthri aa bokugadu thagginchindi PK movies ki maatrame, edo ani movies ki chesinatlu buildup lu isthinnavu jeggugadiki
Ayyo neeli Sastry evaru chuda mannaru mimalini
Aina kh eppudo cheppadu ga dabbulu vunte film chudandi leka pothe ….
Ayyo mari gorrelu mana neeli kj lk 11 rule lo moriginappudu leda censor board
హాయ్
Hi
హాయ్
సినిమా థియేటర్ లు మూసుకు.పోతే పోనీ ఇదేమ్మనన దేశ సమస్య ?? దాని గురించి ఆర్టికల్ ఎందుకు . పెద్ద పేద బిజినెస్ లీ. ఒక్క ట్రంప్ నిరణ్యం తో మూసుకుపోతున్నాయి నో వర్రీ వాళ్ళకి అంత లాస్ అయితే రేట్స్ తగ్గించి వాలే నడుపుతారు లేక పోతే మూసేస్తారు అయితే ఎంటి ఎవరికి ఎక్కువ .మా నాన్న చిన్నపుడు రిక్షా ఎక్కించే వారు 5 రూపాయలకి బేరం ఆడి .ఇప్పుడు కనబడటం లేదు రికా షా లు కాలం లో మార్పు సహజం . ఆటో అయిన కొనుక్కోవాలి లేదా టాక్సీ డ్రైవర్ గా అయిన జీతానికి పని చెయ్యాలి లైఫ్ లో అంతే
వారం మధ్యలో టికెట్ రేట్స్ తగ్గిస్తే చాలా మంది వచ్చే అవకాశం వుంది.
Rabinhood సినిమా కు కూడా టికెట్ రేట్ పెంచారు. చూద్దామనుకున్న నా లాంటి వాళ్ళు కూడా చూడలేదు. అసలుకే మోసం వచ్చింది.
వారం వారం రెండు మూడు సినిమాలు వస్తున్నాయి. కానీ థియేటర్ దగ్గర బకెట్ తన్నేస్తున్నాయి. ఎంత ప్రచారం చేసి, ఎంత బజ్ వచ్చింది అని సంతోషపడినా థియేటర్ దగ్గరకు జనం మాత్రం రావడం లేదు. ఏ సినిమా కూడా జనాలకు అంత సులువుగా నచ్చడం లేదు.
సినిమా ఒకప్పుడు వన్ అండ్ ఓన్లీ వినోద సాధనం, ఇప్పుడు సినిమా అనేకానేక వినోదాల్లో ఒకటి మాత్రమే. ఖర్చు లేని, లేదా సినిమా కన్నా తక్కువ ఖర్చు వున్న వినోదసాధనాలు అనేకానేకం ఇప్పుడు జనాలకు అందుబాటులో వున్నాయి.