కొన్ని నినాదాలు వినడానికి బాగుంటాయి. అయితే అసలు విషయాన్ని వదిలేసి, కొసరు పనులు చేస్తూ, ఇదిగో మేమెంత స్వచ్ఛత పాటిస్తున్నామో అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలో వుండడంతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో ఇవాళ నిర్వహించారు.
నెల్లూరులో అల్లీపురంలోని డంపింగ్ కేంద్రాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అన్ని మున్సిపాల్టీల్లో ఈ-వేస్ట్ సేకరణ భారీగా చేయాలన్నారు. మున్సిపాలిటీల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. ఈరోజు నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తనకు పంపించాలని మంత్రి ఆదేశించారు.
మన చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవడం ఎంత అవసరమో, అంతకంటే ఎక్కువగా స్వచ్ఛమైన పరిపాలన అందించాలనే ధ్యాసే పాలకులకు వుండడం లేదు. ఆ విషయంలో మాత్రం అసలు జాగ్రత్తలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పాలనలో స్వచ్ఛత పాటిస్తే, ప్రజాస్వామ్యానికి నిజమైన సార్థకత లభిస్తుంది. అలాగే సమాజం అభివృద్ధి చెందుతుంది.
పాలనలో అవినీతి, అరాచకాలకు స్థానం కల్పించడమే గొప్పగా ప్రభుత్వ పెద్దల భావన. అధికారం అంటే ఇదే అనే అర్థంలో కంపు కొట్టేలా పాలనారీతులున్నాయి. ఈ విషయమై ఎందుకో ఆలోచించరో ఎవరికీ అర్థం కాని అంశంగా మారింది. పాలనలో స్వచ్ఛత పాటించేందుకు పాలకులు ముందుకొచ్చినప్పుడే మంచి సమాజాన్ని నిర్మించిన ఘనత దక్కుతుంది.
అన్నియ్య కి గత ఐదేళ్ళూ ఈ సుద్దులు చెప్పి ఉండాల్సిందే మరి .. ఇంకో పది సీట్లు అయినా వచ్చేవి.
మనోడి పాలనలో “11 క్యారెట్ స్వచ్ఛత” భరించలేకే, ప్రజలు పంగనామాలు పెట్టారు చాలదా??
Narayana colleges lo students paristhithi baga ledhu students suicides yekkuva ayyai