ఆమె హీరోయిన్ కు తక్కువ. ఐటెం భామకు ఎక్కువ. అందుకే చాలామంది ఐటెం హీరోయిన్ అని పిలుస్తుంటారు. ఓవరాక్షన్ కు పెట్టింది పేరు ఆ ముద్దుగుమ్మ. చూడ్డానికి అందంగా ఉంటుంది కానీ అస్సలు బుర్ర వాడదనే ఇమేజ్ తెచ్చుకున్న ఆ ఐటెం హీరోయిన్ ఊర్వశి రౌతేలా.
తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఉత్తరాదిన తనకు రెండు గోపురాలు కట్టారని, ఉత్తరాఖండ్ లోని బద్రీనాధ్ సమీపంలో ఉన్న బామ్నీలో వెలసిన గుడి తనదేనని చెప్పుకుంది. సౌత్ లో కూడా తనకు గుడి కట్టి పూజలు చేయాలని డిమాండ్ చేసింది.
ఆమె ఇలా గొప్పలు చెప్పుకోవడం తప్పు లేదు. కానీ తనదికాని గుడిని చెప్పుకోవడం బాగాలేదు. బామ్ని గుడి అర్చకులు ఊర్వశి రౌతేలాపై భగ్గుమంటున్నారు. ఎంతో పవిత్రమైన బామ్ని ఆలయంలో తను కొలువై ఉన్నానని ఊర్వశి చెప్పుకోవడం బాధాకరమని, ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కోరారు అర్చకులు.
ఈమె ఇలా వింతవింతగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. గతంలో సైఫ్ పై కత్తితో దాడి జరిగినప్పుడు స్పందించాల్సిందిగా రిపోర్టర్ అడిగితే, తన చేతి వేలికున్న ఉంగరాన్ని చూపించి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంది ఊర్వశి. మొన్నటికిమొన్న తమన్న వేస్ట్ తనే బెస్ట్ అంటూ కలరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. కేవలం ప్రచారం కోసమే ఊర్వశి ఇలా లేనిపోని స్టేట్ మెంట్స్ ఇస్తోందంటున్నారు బాలీవుడ్ జనం.
Gudi emo kani bangalore lo NIMHANS Hospital matram thana kosame kattaru
కొందరు లండన్ కెళ్లడం మానేసి బెంగుళూరు బాట పట్టారు.. యెలాహంకా ప్యాలెస్ నుండి NIMHANS కి helicopter EXPRESS WAY ఉంది. ఎవరు, ఏమిటి, ఎందుకు అని మాత్రం అడగొద్దు..
ఆవిడ ఆశించే ఆకు పూజ చేసే ధీరులు ముందుకు నిలవండి, లేని వారు పక్కకు తప్పుకుని సర్దుకొండి “పం”చె లు.