మళ్లీ అదే విమర్శ.. అదే రిమార్క్.. వరుసగా రెండోసారి సంగీత దర్శకుడు అజనీష్ లోకనాధ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో అతడు తన మార్క్ చూపిస్తున్నాడు. పాటల విషయంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు.
మొన్నటికిమొన్న ఓదెల-2 రిలీజైంది. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ లో ఎన్నో దోషాలు కనిపించకుండా అజనీష్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మేజిక్ చేశాడు. అయితే పాటల విషయంలో ఫెయిల్ అయ్యాడు. ఓదెల-2 లాంటి చిత్రాల్లో పాటలు కూడా బలంగా ఉండాలి. ఆ లోటు కనిపించింది.
ఇక తాజాగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా వచ్చింది. దీనికి కూడా అజనీష్ లోకనాధ్ సంగీతం అందించాడు. ఇక్కడ కూడా అదే మిస్టేక్ రిపీట్ చేశాడు. ఈ సినిమాకు అజనీష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అయింది. కానీ పాటలు తేలిపోయాయి.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనేది పూర్తిగా కమర్షియల్ ఫార్మాట్ లో తీసిన సినిమా. ఇలాంటి మూవీలో పాటలు కచ్చితంగా బాగుండాలి. కనీసం ఒక్క పాటైనా క్లిక్ అవ్వాలి. మరి ఏ నమ్మకంతో అజనీష్ ను మేకర్స్ తీసుకున్నారో వాళ్లకే తెలియాలి.
బ్యాక్ టు బ్యాక్ వచ్చిన 2 సినిమాలతో ఒకే తరహా విమర్శ అందుకున్నాడు అజనీష్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే తన డొమైన్ అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. సంగీత దర్శకుడిగా ఎదగాలంటే బీజీఎం మాత్రమే కాదు, ఆకట్టుకునే పాటలు కూడా ఇవ్వాలి. ఈ లోపాన్ని అజనీష్ వీలైనంత తొందరగా అధిగమించాలి.
Same to same..మనోడు బటన్ నొక్కడమే పరిపాలన అనుకున్నట్టు అంటావ్.!
మన వాడు.. D0 N G@…. అసలేo నొక్కడు…అన్ని మన డబ్బులే నొక్కేస్తాడు! ఎందుకంటే.. తిరుపతి రైల్వే స్టేషన్ లో.. D0 N G@ గా… తన ప్రస్థానం మొదలు పెట్టాడు కాబట్టి!…. youtube.com/shorts/4ssrsXvYY70?si=2PTUCzU2zwp9zxLe
ఇక్కడ కూడా మా పొట్టొడిని వదలరా?
ఇక్కడ కూడా మా పొట్టొడిని వదలరా?


Ee vedavalu bgm straight lift Western movies nundi.. talent emi vundadu