బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించేసిన కూటమి

విశాఖ మేయర్ పీఠంపై రెండు నెలలుగా నడుస్తున్న నాటకీయ పరిణామాలకు ఇవాళ తెరపడింది.

విశాఖ మేయర్ పీఠంపై రెండు నెలలుగా నడుస్తున్న నాటకీయ పరిణామాలకు ఇవాళ తెరపడింది. కూటమి ప్రభుత్వం అనుకున్నట్లుగానే మేయర్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరివెంకట కుమారిని మేయర్ పీఠం నుంచి దించేసింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ కార్పొరేటర్లను తయనో భయనో తమవైపు తిప్పుకుని, మేయర్‌గా హరివెంకట కుమారి నాలుగేళ్లు పూర్తి చేసిన తర్వాత అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. నాలుగేళ్లు పూర్తి అయినా త‌ర్వాతే అవిశ్వాసం తీర్మానం పెట్ట‌లానే రూల్ ఉండ‌టంతో ఇటీవ‌ల నోటీసులు ఇచ్చారు. దీంతో గత మూడు వారాలుగా అధికార పార్టీ విదేశాలకు తమ కార్పొరేటర్లను తరలించి క్యాంప్ పాలిటిక్స్ నిర్వహించాయి.

దీంతో ఇవాళ జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి కూటమికి చెందిన 74 మంది సభ్యులు హాజరయ్యారు. వైసీపీ సభ్యులు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. కాగా, అవిశ్వాస తీర్మానం గెలవాలంటే 74 మంది సభ్యులు అవసరం కాగా, ఆ బలం కూటమికి ఉండటంతో ఈ తీర్మానంలో కూటమి విజయం సాధించింది.

జీవీఎంసీకి నాలుగేళ్ల కిందట ఎన్నికలు జరిగాయి. మొత్తం 98 వార్డులకు గాను వైసీపీ 58 వార్డులు గెలుచుకోవడంతో, మేయర్ పీఠంపై 11వ వార్డు కార్పొరేటర్ గొలగాని హరివెంకట కుమారిని కూర్చోబెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వైసీపీ కార్పొరేటర్లను తమ పార్టీల్లోకి చేర్చుకున్నాయి.

ఇప్పటి రాష్ట్రంలో ఇలాంటి అవిశ్వాస తీర్మానాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. కొన్ని చోట్ల వైసీపీ గట్టిగా నిలబడుతున్నా, విశాఖ వంటి చోట అధికారం కోల్పోయినప్పటి నుంచి కార్పొరేటర్లు కూటమి పార్టీల వైపు పోతున్నా పెద్దగా పట్టించుకోలేదు.

మరోవైపు, ఇంకొక ఏడాది మాత్రమే ఉండే పదవి కోసం ఇలాంటి రాజకీయాలు, ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించేయడం బీసీలను అవమానించడమేనని బీసీ సంఘాలు అంటున్నాయి.

8 Replies to “బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించేసిన కూటమి”

  1. Bc mahila sc mahila oc mahila  …bochulo mahila .. evaraithe emi ? Mahila aithe emi? Purushudu aithe emi? Andhulo ye caste aithe emi? Yee darudraanni 2025 lo koodaa choodaalsi vasthondhi..thoo

Comments are closed.