టీడీపీ స్క్రిప్ట్ చ‌దివిన విజ‌య‌సాయిరెడ్డి

ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వంలోనే నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మ‌ద్యం దుకాణాలు పెట్టార‌ని కొర‌ముట్ల ఆరోపించారు.

వైఎస్సార్‌సీపీ మాజీ నేత విజ‌య‌సాయిరెడ్డిపై ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ మాజీ ఎమ్మెల్యే కొర‌ముట్ల శ్రీ‌నివాసులు సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు. లిక్క‌ర్ స్కామ్ కేసులో విచార‌ణ‌కు హాజ‌రైన విజ‌య‌సాయిరెడ్డి తాను పార్టీ నుంచి బ‌య‌టికి రావ‌డానికి కార‌ణాల‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ నేప‌థ్యంలో ఇదే కేసులో సిట్‌ విచార‌ణ‌కు ఇవాళ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి హాజ‌ర‌య్యారు.

మిథున్‌రెడ్డితో పాటు సిట్ కార్యాల‌యం వ‌ద్ద‌కు వ‌చ్చిన మాజీ ఎమ్మెల్యే కొర‌ముట్ల శ్రీ‌నివాసులు మాట్లాడుతూ టీడీపీ స్క్రిప్ట్‌ను విజ‌య‌సాయిరెడ్డి చ‌దువుతున్నార‌ని విమ‌ర్శించారు. విజ‌య‌సాయిరెడ్డి వైసీపీ నుంచి బ‌య‌టికి వెళ్లి, త‌మ పార్టీ నేత‌ల‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. వైఎస్ జ‌గ‌న్‌కు స‌న్నిహితంగా వుండే వాళ్ల‌పై బుర‌ద చ‌ల్లేందుకే మిథున్‌రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింద‌ని ఆయ‌న అన్నారు.

ఇదంతా సిట్ కావాల‌నే చేస్తోంద‌ని కొర‌ముట్ల విమ‌ర్శించారు. త‌మ హ‌యాంలో మ‌ద్యంలో ఎలాంటి స్కామ్ జ‌ర‌గలేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వంలోనే నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మ‌ద్యం దుకాణాలు పెట్టార‌ని కొర‌ముట్ల ఆరోపించారు.

గుడులు, బ‌డుల‌కు స‌మీపంలోనే బెల్ట్‌షాపులు, మ‌ద్యం దుకాణాలు పెట్టిన‌ట్టు తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలిక‌పూడి ఆరోపించార‌ని ఆయ‌న గుర్తు చేశారు. సిట్ విచారించాల్సింది …కూట‌మి హ‌యాంలో జ‌రుగుతున్న లిక్క‌ర్ స్కామ్‌పై అని ఆయ‌న అన్నారు.

5 Replies to “టీడీపీ స్క్రిప్ట్ చ‌దివిన విజ‌య‌సాయిరెడ్డి”

  1. చదివితే మా సజ్జల వారి స్క్రిప్ట్ చదవాలి కానీ మాకు వ్యతిరేకంగా బాబు స్క్రిప్ట్ చదివితే ఎట్టా..

  2. అంతే అంతే, చెల్లి టీడీపీ స్క్రిప్ట్, అమ్మ టీడీపీ స్క్రిప్ట్, అన్ని ముందువుండి నడిపిన సాయి రెడ్డి టీడీపీ స్క్రిప్ట్, ఇంక జగన్ ఒక్కడే మిగిలాడు టీడీపీ స్క్రిప్ట్ చదవడానికి, అప్పుడు భారతి రెడ్డి, అవినాష్ ysp పార్టీ నడుపు కోవచ్చు , ఇంకొంత మంది డికాయిట్ కూని కోరులు కలిపి లైక్ రోజా, వంశీ, నాని x2 

Comments are closed.