అసలు సమంత ఏం ఆలోచిస్తోంది..?

ఈ సినిమా ప్రచారం కోసం సమంత మీడియా ముందుకొస్తుందా రాదా అనే అనుమానం మాత్రం ఇంకా చాలామందిలో ఉంది.

తిప్పికొడితే అటు ఇటుగా 2 వారాల టైమ్ కూడా లేదు. అయినప్పటికీ సమంత కూల్ గా కనిపిస్తోంది. తొలిసారి నిర్మాతగా మారి చేసిన తన సినిమా ప్రచారం కోసం ఆమె ఎందుకో కంగారు పడట్లేదు. హడావిడి చేయట్లేదు. చూస్తుంటే, ఆమె ఏదో పెద్ద ప్లాన్ లోనే ఉన్నట్టుంది.

సొంతంగా బ్యానర్ స్థాపించి, డబ్బులు పెట్టి, ‘శుభం’ అనే సినిమా నిర్మించింది సమంత. మే 9న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. రిలీజైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఊపును అలానే కొనసాగించి ఉంటే బాగుండేది.

కానీ సమంత మళ్లీ గ్యాప్ ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆమె నేరుగా ఇప్పటివరకు ఈ సినిమా ప్రచారంలోకి దిగలేదు. ఇంతకీ సమంత ఏం ఆలోచిస్తోంది?

ఆమె దృష్టి మొత్తం ఇప్పుడు ట్రయిలర్ పై ఉంది. టీజర్ తో వచ్చిన హైప్, ట్రయిలర్ తో రెట్టింపు అవుతుందని ఆమె భావిస్తోంది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలుపెట్టాలని ఆమె భావిస్తోంది.

అయితే ఈ సినిమా ప్రచారం కోసం సమంత మీడియా ముందుకొస్తుందా రాదా అనే అనుమానం మాత్రం ఇంకా చాలామందిలో ఉంది. ఆమె శుభం సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతుందేమో కానీ, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు.

One Reply to “అసలు సమంత ఏం ఆలోచిస్తోంది..?”

Comments are closed.