అజిత్ – అమ్మో..అయిదో తారీఖు

ప్రతి నెల అయిదవ తేదీన కచ్చితంగా అజిత్ అకౌంట్లో 15 కోట్లు జమ కావాల్సిందేనట.

గుడ్ బ్యాడ్ అగ్లీ..తమిళ సూపర్ స్టార్ అజిత్ సినిమా. మన తెలుగు టాప్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ తమిళ సూపర్ స్టార్ తో సినిమా తీయడం గ్రేట్. అయితే విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం అజిత్ తో సినిమా తీయడం అంటే అంత వీజీ కాదట. కత్తి మీద సాము లాంటిదంట. అజిత్ ను కన్ సల్ట్ చేయడం, రెండు వైపులా డిస్కషన్ చేసి స్టోరీ లాక్ చేయడం వరకు ఓకె. కానీ ఆ తరువాతే అసలు కథ మొదలవుతుందట.

తమిళ హీరోలు ఎవ్వరూ బ్లాక్ మనీ తీసుకోరు. నూటికి నూరు శాతం వైట్. ప్లస్ జిఎస్టీ. అది నిర్మాతకు మంచిదే. కానీ అజిత్ వ్యవహారం ఇంకోంచెం స్ట్రిక్ట్. సినిమా ఒప్పుకున్నాక టోకెన్ అడ్వాన్స్ తీసుకుంటారట. ఓ పది కోట్లు అనుకోవచ్చు. ఆ తరువాత నుంచి ప్రతి నెల అయిదవ తేదీన కచ్చితంగా అజిత్ అకౌంట్లో 15 కోట్లు జమ కావాల్సిందేనట. ఆ అయిదో తేదీ కనుక బ్యాంక్ హాలీడే అయితే నాల్గవ తేదీకి పడిపోవాల్సిందేనంట.

ఇలా షూటింగ్ టైమ్ లో ప్రతి నెల ఇస్తూ పోవాలి. టోటల్ రెమ్యూనిరేషన్ 160 కోట్లకు కాస్త అటు ఇటుగా వుంటుంది. దీనికి జిఎస్టీ అదనం. అంటే దాదాపు పది నెలల పాటు ప్రతి నెల అయిదో తేదీకి 15 కోట్ల వంతున వాయిదాల పద్దతిలో రెమ్యూనిరేషన్ ఇస్తూ పోవాలన్న మాట. అప్పటికి సినిమా కూడా పూర్తయిపోతుంది. వాయిదా డ‌బ్బులు మాత్రం డేట్ తప్పడం అన్నది అస్సలు అజిక్ నచ్చని విషయం అని తెలుస్తోంది.

ఇదిలా వుంటే మైత్రీ సంస్థ అజిత్ తో మరో సినిమా చేయాలని భావిస్తోందట. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మైత్రీ సంస్థకు లాభమేనా అంటే కాస్త బ్రేక్ ఈవెన్ కు దూరంగానే వున్నట్లు తెలుస్తోంది. అందుకే అజిత్ తోనే మరో సినిమా చేయాలని ప్రయత్నిస్తోందట మైత్రీ సంస్థ. అయితే ఈ సారి రెమ్యూనిరేషన్ లో కాస్త డిస్కౌంట్ ఇవ్వమని అడుగుతున్నట్లు బోగట్టా.

10 Replies to “అజిత్ – అమ్మో..అయిదో తారీఖు”

Comments are closed.