గోశాల వివాదం.. ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో కూట‌మి!

తప్పులు జరిగివుంటే టీటీడీ సరిచేసుకుంటుంది.. మధ్యలో కూటమి పార్టీల నేతలు గోశాలకు ర్యాలీ చేయాల్సిన అవసరం ఏముంది?

తిరుపతిలోని టీటీడీ గోశాలలో అవులు చనిపోతున్నాయంటూ టీటీడీ మాజీ ఛైర్మన్‌, వైసీపీ సీనియ‌ర్‌ నేత భూమన కరుణాకర రెడ్డి లేవనెత్తిన అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంలో ఎలా స్పందించాలో, ఎలా వ్యవహరించాలో తెలియక, మ‌రోవైపు అప్ర‌తిష్టను మూట‌క‌ట్టుకుంటూ కూట‌మి ప్ర‌భుత్వం పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది.

గోశాలలో గోవులు మరణిస్తున్నాయని భూమన చేసిన విమర్శలను టీటీడీ మొదట్లో చాలా తేలిగ్గా తీసుకుంది. అలాంటిదేమీ లేదంటూ కొట్టిపారేసింది. ఆ తర్వాత‌ కరుణాకర రెడ్డి గోవులు మృతి చెందిన ఫొటోలు విడుదల చేయడంతో వివాదం మరింత రాజుకుంది. దాంతో టీటీడీ చైర్మన్‌ బిఆర్‌ నాయుడు స్పందిస్తూ వృద్ధాప్యంతో కొన్ని ఆవులు మృతి చెందినమాట వాస్తవమేనని అంగీకరించారు. ఆ మరుసటిరోజే మీడియా సమావేశం నిర్వహించిన టీటీడీ ఈవో శ్యామలారావు గోశాలలో మూడు నెలల కాలంలో 43 అవులు మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రతినెలా సగటున 15 ఆవుల దాకా మరణిస్తూ వుంటాయని కూడా ఈవో వెల్లడించారు. మ‌రోవైపు తిరుప‌తి ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసులు 42 గోవులు మాత్ర‌మే మృతి చెందాయ‌ని సెల‌విచ్చారు. దీంతో భూమన చేసిన విమర్శలను ఈవోతో పాటు చైర్మ‌న్‌, కూట‌మి ఎమ్మెల్యే ధ్రువీకరించినట్లు అయింది.

టీటీడీ ఈవో ప్రెస్‌మీట్ తర్వాత‌ భూమన విమర్శలకు మరింత బలం చేకూరింది. గోశాలలో 1800 ఆవులుంటే అందులో వృద్ధాప్యం కారణంగా నెలకు 15 ఆవులు మరణించడం ఏమిటన్న చర్చ మొదలయింది. ఈ లెక్కన 10 ఏళ్లలో గోశాలలోని ఆవులన్నీ అంతరించిపోతాయి. వాస్తవంగా పశువుల సహజ మరణాల రేటు 3 శాతం మాత్రమే వుంటుందని శాస్త్రవేత్తల అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే. వెయ్యి పశువులుంటే అందులో వృద్ధాప్యం వల్ల ఏడాదికి 30 మాత్రమే చనిపోతాయి. ఆ లెక్కన గోశాలలో మరణించే పశువుల సంఖ్య ఏడాదికి 60కి మించకూడదు. అయితే మూడు నెలల్లోనే 43 ఆవులు మరణించినట్లు ఈవో ప్రకటించడం సంచలనంగా మారింది.

ఈ పరిస్థితుల్లో భూమన చేసిన విమర్శలు నిజమేకదా అనే భావన సర్వత్రా వ్యక్తయింది. భూమన చెప్పిన 100 సంఖ్యలో తేడా వుండొచ్చేమోగానీ…ఆవుల మరణాలు నిజమేకదా, టీటీడీ ఏమి చేస్తోంద‌ని అంటూ శ్రీవారి భక్తులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం అనుకూల మీడియా కొత్త, వింత ప్రచారానికి శ్రీకారం చుట్టింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మతాల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నదంటూ ఒకమాట, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నదంటూ ఇంకోమాటను ప్రచారంలోకి తెచ్చింది.

టీటీడీ గోశాలలో జరుగుతున్న అన్యాయాన్ని బయటకుతెస్తే.. సరి చేసుకోకుండా ఇదేమి ఎదురుదాడి అనే అభిప్రాయం సోషల్‌ మీడియాలో వ్యక్తమయింది. గోవులు మృతి చెందాయని టీటీడీ అంగీకరిస్తుండగా, దాన్ని బయటకు వెల్లడించడం హిందూ ధర్మాన్ని కించపరచడం ఎలా అవుతుందన్న ప్రశ్న కూటమి ప్రభుత్వానికి ఎదురయింది. మొత్తంగా ప్ర‌భుత్వ అనుకూల మీడియా ఎత్తుకున్న ప్రచార ఎత్తుగడ ఫలించలేదు.

ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు మొన్న జరిగిన కేబినెట్‌ సమావేశంలో గోశాల వివాదాన్ని ప్రస్తావించారు. భూమన చేస్తున్న విరమర్శలను సరిగా తెప్పికొట్టలేకపోతున్నామని ఆయన మంత్రులపై అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి.

అధినేత అలా మాట్లాడాక కూడా ఊరుకుంటే ఇబ్బంది అవుతుందని అనుకున్నారో ఏమోగానీ…. తిరుపతిలోని కూటమి నేతలు తీరిగ్గా వారం రోజుల తరువాత హడావుడి మొదలుపెట్టారు. గోశాలపై భూమన చేస్తున్న విమర్శలకు నిరసనగా గురువారం ఉదయాన గోశాల వద్దకు ర్యాలీ చేస్తామంటే బుధవారం రాత్రి నుంచి ఇటు తిరుపతి, అటు చంద్రగిరి నియోజకవర్గం నేతలు వాట్సాప్‌ గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టడం మొదలుపెట్టారు. అలాగే టీటీడీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్‌ కూడా భూమనకు సవాల్‌ విసిరారు. ఈ అంశంపై చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. ఈ సవాల్‌ను స్వీకరిస్తున్నానని, గురువారం ఉదయం 10 గంటలకు గోశాల వద్దకు చర్చకు వస్తానని కరుణాకర రెడ్డి ప్రకటించారు.

దీంతో గురువారం తెల్లవారేకల్లా పరిస్థితి మారిపోయింది. తాము ర్యాలీ చేయడం లేదని, ఎమ్మెల్యేలు గోశాలను సందర్శించి, మీడియాతో మాట్లాడతారని కూటమి నేతలు వాట్సాప్‌ గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టారు. మరోవైపు బుధవారం రాత్రి నుంచే తిరుపతిలోని వైసీపీ నేతల ఇళ్ల వద్దకు పోలీసులు చేరుకున్నారు. నేతలను గృహ నిర్బంధం చేశారు. భూమన కరుణాకర రెడ్డి ఇంటి వద్ద దాదాపు 100 మంది పోలీసులు మోహరించారు. ఆయన్ను బయటకు రానీకుండా ఇంటిలోనే నిర్బంధించారు.

వాస్తవంగా టీటీడీ ఈవో వివరణ ఇచ్చిన తర్వాత‌ ఈ అంశంపైన ఇక మాట్లాడకూడదని, వదలిపెట్టాలని భూమన భావించారు. అయితే…పార్టీ అధినేత మెప్పు కోసం కూటమి నేతలు హడావుడిగా ర్యాలీ ప్రకటన చేశారు. అధికారంలో వున్న పార్టీ ర్యాలీ చేయడం ఏమిటి? ఇది ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టడం కాదా? తప్పులు జరిగివుంటే టీటీడీ సరిచేసుకుంటుంది.. మధ్యలో కూటమి పార్టీల నేతలు గోశాలకు ర్యాలీ చేయాల్సిన అవసరం ఏముంది? దీనివల్ల వివాదం మరింత ముదరదా? అటువంటి ప్రశ్నలన్నీ మీడియాలో వినిపించాయి. దీంతో అనివార్యంగా గురువారం ఉదయం చేయతలపెట్టిన ర్యాలీని కూటమి నేతలు రద్దు చేసుకున్నారు.

మ‌రోవైపు స‌వాల్ స్వీక‌రించి గోశాల‌కు బ‌య‌ల్దేరిన భూమ‌న‌ను పోలీసుల‌తో ప్ర‌భుత్వం అడ్డుకుంది. దీంతో రోజంతా మీడియాలో ఇదే చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రోవైపు 191 గోవులు మృతి చెందిన‌ట్టు గోశాల మేనేజ‌ర్ అధికారికంగా ప్ర‌క‌టించిన నివేదిక‌ను భూమ‌న బ‌య‌ట పెట్టి, కూట‌మి స‌ర్కార్‌ను పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి నెట్టేశారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో కూట‌మి నేత‌లు అభాసుపాల‌య్యారు.

మొత్తంగా గోశాల వివాదంపై ఎలా వ్యవహరించాలో తెలియక కూటమి నేతలు సతమతమవుతున్నారు. భూమన చేసిన విమర్శలను స్వయంగా టీటీడీ ఈవోనే అంగీకరించాక.. దాన్ని ఎలా తిప్పికొట్టాలతో తెలియక, ఎలా ఎదురుదాడి చేయాలో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు. కేవ‌లం అనుకూల మీడియాను అడ్డు పెట్టుకుని స‌వాల్ స్వీక‌రించిన భూమ‌న నేతృత్వంలోని వైసీపీ తోక ముడిచింద‌నే ప్ర‌చారంతో ప్ర‌భుత్వం సంతృప్తి పొందాల‌నే ప్ర‌య‌త్నిస్తోంది. కానీ వాళ్ల అంత‌రాత్మ‌లు మాత్రం.. గోశాల విష‌యంలో బ‌ద్నాం అయ్యామ‌ని చెబుతున్న‌ట్టు కూట‌మి నేత‌లే ఆఫ్ ది రికార్డు అంటూ వాపోవ‌డం గ‌మ‌నార్హం.

5 Replies to “గోశాల వివాదం.. ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో కూట‌మి!”

  1. కన్నతల్లిలాంటి గోమాతను చంపి తింటున్న ఈ తురకలంజకొడుకులును ఈ కేజీ బియ్యం కొడుకులను దేశం నుంచి తమిరి కొట్టాలి

    1. సాక్షాతు వెంకటేశ్వర స్వామీ ఒక ముస్లిం ని పెళ్లి చేసుకుని పక్కన పెట్టుకున్నాడు రా కు-

      ఎందుకు మొరుగుతావు నీచమైన బుద్ది తో ఎలా పుట్టవ్ రా

  2. బాబాయ్ కి అతి కిరాతకంగా గుండె పోటు…..ఆత్మ రక్షణ లో కూటమి ప్రభుత్వం….ఆనందం లో మన అన్నయ్య….అంతే నా GA…

Comments are closed.