కొలిక‌పూడి కాదు.. అక్క‌డున్న‌ది ఆది!

అగ్ర‌వ‌ర్ణాల ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేసినా, చేస్తున్నా మంద‌లించ‌డానికి మాత్రం భ‌య‌ప‌డుతున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

అధికారాన్ని అడ్డు పెట్టుకుని త‌ప్పు ఎవ‌రు చేసినా సీఎం చంద్ర‌బాబునాయుడు లేదా ప్ర‌భుత్వ పెద్ద‌లు సీరియ‌స్ కావాల్సి వుంటుంది. స‌ద‌రు ప్ర‌జాప్ర‌తినిధుల్ని మంద‌లించి దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డితే ప్ర‌జ‌లు హ‌ర్షిస్తారు. కానీ సామాజిక నేప‌థ్యాన్ని బ‌ట్టి, ప్ర‌భుత్వ పెద్ద‌ల ఆగ్ర‌హావేశాలు వుండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ద‌ళిత ప్ర‌జాప్ర‌తినిధులు చిన్న త‌ప్పు చేసినా, పార్టీ లేదా ప్ర‌భుత్వ పెద్ద‌లు వెంట‌నే సీరియ‌స్ అయిన‌ట్టు, మ‌రోసారి పున‌రావృత‌మైతే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించిన‌ట్టు వార్త‌లొస్తుంటాయి.

ఇదే అగ్ర‌కుల ప్ర‌జాప్ర‌తినిధులు పెద్ద‌పెద్ద త‌ప్పులు చేసినా, వాళ్ల‌పై ఆగ్ర‌హావేశాలు ప్ర‌ద‌ర్శించే ధైర్యం పాల‌కుల‌కు వుండ‌డం లేదు. ఇందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా వైఎస్సార్ క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి, అలాగే గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీ‌నివాస‌రావు త‌దిత‌రుల్ని చూపుతున్నారు. ఏకంగా సిమెంట్ ప‌రిశ్ర‌మ‌ల ఉత్ప‌త్తినే అడ్డుకునే స్థాయిలో బెదిరింపుల‌కు దిగితే, ఇంత వ‌ర‌కూ ప్ర‌భుత్వ పెద్ద‌ల నుంచి సీరియ‌స్ అయిన‌ట్టు ప్ర‌క‌ట‌న కూడా లేదు.

ఇంత బ‌రితెగింపున‌కు ఎక్క‌డి నుంచి వీళ్ల‌కు ధైర్యం వ‌చ్చింద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. గుడ్డిలో మెల్ల అన్న చందంగా… క‌నీసం క‌డ‌ప క‌లెక్ట‌ర్ సీరియ‌స్‌గా తీసుకుని, సిమెంట్ ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానుల‌కు ఇబ్బంది లేకుండా చేస్తామ‌నే భ‌రోసా ఇచ్చారు. అయితే క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు భిన్నంగా వుంటాయి. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధి అనుకుంటే ఎన్ని ర‌కాలైనా ఇబ్బందులు పెట్టొచ్చు. ఎందుకంటే, ప్ర‌భుత్వ అధికారులు, పోలీసు అధికారుల్ని ఎమ్మెల్యేనే కోరి తెచ్చుకుంటారు. అందుకే స‌ద‌రు ప్ర‌జాప్ర‌తినిధికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తారే త‌ప్ప‌, ఉన్న‌తాధికారుల ఆదేశాల‌ను పాటిస్తున్న‌ట్టు న‌టిస్తారే త‌ప్ప‌, ఆచ‌రించ‌ర‌నేది నిష్టుర స‌త్యం.

ఇదే ద‌ళిత ప్ర‌జాప్ర‌తినిధులు అక్ర‌మాల్ని అడ్డుకున్నా, ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు కోపం రావ‌డాన్ని మ‌నం చూస్తున్నాం. తిరువూరు, నందిగామ ఎమ్మెల్యేలు … చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల అడుగుల‌కు మ‌డుగులొత్త‌లేద‌ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్ర‌జ‌ల దృష్టిలో వీళ్ల‌దే త‌ప్పు అన్న‌ట్టుగా, ప్ర‌భుత్వ అనుకూల మీడియా కూడా వ్య‌తిరేక క‌థ‌నాలు రాస్తుంటుంది. అధిష్టానం పెద్ద‌లు ఆ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ప‌వ‌ర్స్ లేకుండా, ప్ర‌త్యామ్నాయంగా ఏదో ఒక‌పేరుతో స‌మాంత‌ర వ్య‌వ‌స్థ‌ను తీసుకు రావ‌డం స‌హ‌జంగా జ‌రిగిపోతుంది.

జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో ఒకే కంపెనీకి చెందిన రెండు సిమెంట్ ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానుల్నే ముప్పుతిప్పలు పెడుతుంటే, ఇక ఆ నియోజ‌క‌వర్గంలో సామాన్యుల ప‌రిస్థితిని ఊహించుకుంటేనే భ‌య‌మేస్తోంది. తాడిప‌త్రిలో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిని సీఎం చంద్ర‌బాబు ఏ మేర‌కు అదుపులో పెట్టారో అంద‌రికీ తెలిసిందే. ఎంతైనా ద‌ళిత‌, అణ‌గారిన వ‌ర్గాల ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ఒంటికాలిమీద లేచే ప్ర‌భుత్వ పెద్ద‌లు… అగ్ర‌వ‌ర్ణాల ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేసినా, చేస్తున్నా మంద‌లించ‌డానికి మాత్రం భ‌య‌ప‌డుతున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారానికి బ‌లం క‌లిగేలా ప్ర‌భుత్వ పెద్ద‌ల మౌనం కార‌ణ‌మ‌వుతోంది.

7 Replies to “కొలిక‌పూడి కాదు.. అక్క‌డున్న‌ది ఆది!”

  1. ఒరేయ్ సన్నాసి…కొలికపూడి టీడీపీ సభ్యుడు….ఆది బీజేపీ సభ్యుడు. ఆ మాత్రం తేడా తెలియదురా యెడ్డీ ఎదవా

  2. ఒరేయ్ సన్నాసి…కొలికపూడి టీడీపీ సభ్యుడు….ఆది బీజేపీ సభ్యుడు. ఆ మాత్రం తేడా తెలియదురా యెడ్డీ

  3. ఒరేయ్ సన్నాసి…కొలికపూడి టీడీపీ సభ్యుడు….ఆది బీజేపీ సభ్యుడు. ఆ మాత్రం తేడా తెలియదురా యె డ్డీ ఎదవా

    1. సభ్యుడు ఏ పార్టీ వాడు అన్నది కాదు ర.. అందరికి సీఎం మన బొల్లి గాడే అయినప్పుడు.. ప్రతి MLA నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా CM ను కలుస్తున్నప్పుడు.. సీఎం వాళ్లకు సహకరిస్తున్నప్పుడు, ఒక పట్టు ఉంటుంది.. రాష్ట్రం మీద సీఎం హోదాలో.

      మరి.. బొల్లి గాడికి.. ఆ responsibility లేదా విషయం అరా తీసి.. MLAను మందలించటానికి?? అందులోనూ.. ఒకే కూటమిలో కదా ఉన్నారు? వైస్సార్సీపీ నుండి.. జంప్ అయిన జిలానీలలో.. వీడు ఒకడు కదా? వీడిని నీతి తప్పి చేర్చుకోవటమే కాకుండా.. మంత్రి పదవి కూడా కట్టబెట్టాడు గా? మల్లి వీళ్లందరినీ బీజేపీ లో కి పంపిందే మన బొల్లి గాడు.. ఇప్పుడు చెప్పు.. సీఎం గా వాడు.. Involve అయ్యి విషయాన్నీ చక్కదిద్దాల వద్దా?

      1. ఒరెయ్ బోకు మరి పులివెందుల ఎంఎల్ఏ కూడా  ఆయనే సిఎం, ఆ తుంటోడు అసెంబ్లీ కి రావడం లేదు. నిన్ను ఎన్నుకున్న ప్రజలను మోసాం చెయ్యొద్దు అని మెదపట్టుకొని సిఎం అసెంబ్లీ కి రావలంటావ సన్నాసి

Comments are closed.